Connect with us

ARTICLE'S

“ప్రజాస్వామ్య సౌధం బలంగా ఉండాలంటే జర్నలిజం తడబడకూడదు

janamvelugunews

Published

on

“ప్రజాస్వామ్య సౌధం బలంగా ఉండాలంటే జర్నలిజం తడబడకూడదు” అన్న జస్టిస్ శ్రీకృష్ణ.*. జర్నలిజంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోవడం ఎంత ముఖ్యమో. జర్నలిజాన్ని సజావుగా నడిపించడమూ అంతే ముఖ్యం అది అన్నివర్గాలబాధ్యత కూడా!

వడ్డేపల్లి మల్లేశము 9014206412

జనం వెలుగు:-  స్వతంత్రంగా పనిచేయగలిగిన జర్నలిస్టులు, సామాజిక బాధ్యతను గుర్తించి పనిచేసే పాత్రికేయులు కూలిపోతున్న ప్రజాస్వామ్య సౌదా న్ని నిలబెట్టగలిగే సైనికులు. అంతేకాదు జర్నలిజం లోతుపాతులు, దాని వెనుక ఉన్నటువంటి సామాజిక పునాది , తాత్విక ఆధారాలను గనుక చిత్తశుద్ధిగా పాటిస్తే ప్రజల ధైనందిన అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడమే కాకుండా , పాలకుల వక్రభాష్యాలను, పెట్టుబడిదారీ వర్గాల కుట్రలు కుతంత్రాలను ఛేదించడానికి అవకాశం ఉంటుంది. అంతిమంగా అంతరాలు అసమానతలు, వివక్షత, పీడన వంచన లేనటువంటి సమ సమాజం స్థాపించడానికి కూడా ఉత్తమమైన జర్నలిజం ఎంతగానో దోహదపడుతుంది .

సామాజిక రుగ్మతలతో పాటు సామాజిక రాజకీయ ఆర్థిక చారిత్రక సాంస్కృతిక విషయాలను, వారసత్వాన్ని, లొసుగులను లోపాలను సరి చేసే క్రమంలో జర్నలిజం ది కీలక పాత్ర .నైతిక విలువలకు కట్టుబడి , సామాజిక స్పృహ కలిగి ఉండి, అనర్థాలను ఛేదించడానికి, ఆకృత్యాలను అడ్డుకోవడానికి , రాజకీయ రంగంలో కొనసాగుతున్నటువంటి దుర్నీతిని ఎండగ ట్టడానికి శక్తివంతమైన సాధనంగా ఉన్న జర్నలిజం తడబడితే మాత్రం ప్రజాస్వామ్య సౌధం కూలిపోతుంది అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చేసిన హెచ్చరిక జర్నలిజం తో సంబంధం ఉన్న అన్ని వర్గాలకు కూడా వర్తిస్తుంది. “స్థిరంగా, సమతూకంతో, దృఢంగా నిలబడవలసిన జర్నలిజం బాధ్యతాయుతమైన వృత్తిగా కొనసాగే బదులు తడబడితే ప్రజాస్వామ్యం కుప్పకూలుతుందని” చేసిన హెచ్చరిక అనేక సవాళ్లను సమాజం ముందు ఉంచింది. ముంబై ప్రెస్ క్లబ్ నెలకొల్పిన “రెడీనిక్ అవార్డుల “ప్రధాన కార్యక్రమంలో ప్రసంగిస్తూ “న్యాయమూర్తి జర్నలిస్టు ఇరువురు కూడా స్వతంత్రంగా ఉండాలి తొట్రుబడితే అనేక వ్యవస్థలు విచ్ఛిన్నమవుతాయి ” అని చేసిన సూచన సంక్షేమం అభివృద్ధి రెండింటిలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అందుకే జర్నలిజం గురించి మరికొంత లోతైన అధ్యయనం చేయడం పౌరులుగా మనందరి యొక్క ప్రాథమిక కర్తవ్యం .

జర్నలిజం– జర్నలిస్టు వివరణ ,లోతైన ఆలోచన:-

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఈ ప్రాంతంలో ఉద్యమ కాలంలో పర్యటించిన శ్రీకృష్ణ కమిటీకి సారధ్యం వహించిన జస్టిస్ శ్రీకృష్ణ గారు చేసిన ఏక వాక్య హెచ్చరిక జర్నలిజం యొక్క పూర్వాపరాలను, పరిణామాలను, ప్రభావాలను ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది .ఇక స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా? ఇతరులపై ఆధారపడి బతుకుతున్నారా? ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక వర్గం కొమ్ముకాస్తున్నారా? అనేది పరిశీలనలో తేలుతుంది . జర్నలిజం వృత్తిలోకి వచ్చే ముందు ఆ వృత్తిలో పొందుపరిచిన నిబంధనలు , సైద్ధాంతిక పునాది, సామాజిక స్పృహ, విలువలకు కట్టుబడే మనస్తత్వం హెచ్చరిస్తూనే ఉంటుంది .ఆ హెచ్చరికలను గమనించి తగిన నిర్ణయము తీసుకొని లక్ష సిద్ధి కోసం పనిచేసేవారు విజయం సాధిస్తారు. అవకాశవాదంతో స్థిరమైన గమ్యము ఉన్నతమైన గమనము లేని వారు జర్నలిజానికి , సామాన్య ప్రజానీకానికి, మెరుగైన వ్యవస్థను సాధించే క్రమానికి ద్రోహం చేసిన వాళ్లు కూడా అవుతారు.

జర్నలిజం అంటే సంఘటనలు, వాస్తవాలు, రాజకీయ సామాజిక ఆర్థిక జీవన నేపథ్యంలో సమాచారాన్ని క్రో డికరించి పంపిణీ చేయడం అని అర్థం . ఇందులో సమాచార సేకరణకు సంబంధించి పద్ధతులు, నిర్వహణ వ్యవస్థ , భాగస్వామ్యం వంటి బాధ్యతలతో కలబోసుకున్న ప్రజా జీవితమే జర్నలిజానికి పునాది. జర్నలిస్టు అంటే ఒక రకంగా సమాజాన్ని స క్రమ దారిలో నడిపించే కలం పట్టిన సైనికుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. .అక్షరాలతో తాను పరిశీలించిన సామాజిక అంశాలను సమాచార రూపంలో నిక్షిప్తం చేస్తూ, అవినీతి లొసుగులు, పాలకుల వైఫల్యాలను, పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఆధిపత్య ధోరణిని ఎండగడుతూ సామాన్య పేద ప్రజల పక్షాన నిలబడాలి అని జర్నలిజం చెబుతుంటే తను ఎన్నుకునే మార్గం బట్టి ఉనికి ఆధారపడి ఉంటుంది . సమాచారాన్ని సంఘటనల సమగ్ర స్వరూపాన్ని సేకరించడంలో సైనికుడు, రైతు, కార్మికుడు, సామాజిక కార్యకర్తతో నిరంతరం పోటీపడుతూ పనిచేయడమే జర్నలిస్టు యొక్క బాధ్యత. వ్యక్తిగత జీవన పోరాటాన్ని కొనసాగిస్తూనే అంతకుమించిన స్థాయిలో సామాజిక బాధ్యతను మోస్తూ అనేక సందర్భాలలో ఇక్కట్లు, ఇబ్బందులు, పేదరికం, ఆర్థికపరమైనటువంటి అనర్థాల ఉచ్చుల్లో కూడా చిక్కిపోయే ప్రమాదం ఉన్నది. అయినా వీటన్నింటికీ అతీతంగా పనిచేస్తున్న వారిని కూడా మనం గమనించినప్పుడు అలాంటి వాళ్లే ఉత్తమ జర్నలిస్టులుగా అవార్డులు పొందడానికి పోటీ పడుతుంటారు. ప్రతి రంగంలో ఉన్న మాదిరిగానే సాధారణ , మధ్యతరహా, ఉన్నత స్థాయి ఆలోచనలతో వ్యవస్థను పరుగు పెట్టించే జర్నలిస్టులను కూడా మనం చూడవచ్చు. .వ్యక్తిగతమైన సమస్యలు చుట్టుముట్టినప్పుడు కూడా, ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసి కూడా, రాజ్య వ్యవస్థ ఇతర శక్తులతో పోటీ పడవలసిన సందర్భం ఉన్నప్పటికీ మరింత శక్తిని కూడగట్టుకుని అన్వేషణ ధోరణితో పరిశీలనా దృక్పథంతో సమస్యల వెంట పరుగులు పెట్టే వారే నిజమైన జర్నలిస్టు అనే పదానికి వారసులవుతారు.

హృదయాన్ని కదిలించిన సంఘటనలు , అందుకు స్పందించి రగిలిన భావావేశాల ప్రాతిపదికన , వినూత్న మార్గములో వ్యవస్థకు మరింత మేలు చేయడం కోసం తన వంతు కృషిని ధారపోయడానికి స్వీయ ప్రణాళికతో ప్రజా చైతన్యము ఆలంబనగా ప్రత్యేకతను నింపుకునే వాడే జర్నలిస్టు. ఉనికిలో ఉన్నప్పుడే మనిషికి అతని జీవితానికి ఆలోచనలకు సార్థకత ఉంటుంది .ఆ సార్థకతను నిలబెట్టుకునే సామాజిక బాధ్యత మనిషిని మహోన్నతునిగాచేస్తుంది . ఇ oదుకు ఏ వృత్తి కూడా మినహాయింపు కాదు. శాస్త్రవేత్త పరిశోధన, రైతు సేద్యం ఆలోచన, ఉపాధ్యాయ వృత్తిలోని ప్రభావితం చేసే లక్షణాలు, అక్రమాలపై ఆయుధాన్ని ఎక్కుపెట్టిన పోలీసు సైనికుని వలె జర్నలిస్టు కూడా అశేష వృత్తుల అంతర్థాలను తన మనసులో నిక్షిప్తం చేసుకొని ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య సౌధానికి నాలుగవ స్తంభంగా చెప్పబడుతున్న మీడియాలో పనిచేయడానికి అర్హులవుతారు. ఇక వృత్తిలో నిలదొక్కుకొని ప్రజల పక్షం వహిస్తారా ? బలహీనతల ముసుగులో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారా? అనేది వారి బలాలు బలహీనతలను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాంటి సంఘటనలు స్వభావాలను కూడా మనం నిత్యజీవితంలో అనేకం చూస్తూ ఉన్నాం . కేవలం స్థానిక మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి వరకు కూడా అక్కడక్కడ జర్నలిజంలో కొన్ని బలహీనతలు తొంగి చూసిన మాట వాస్తవమే. అంతకుమించి పరిశోధనాత్మకమైన బలాలు చూపించి ఎక్కు పెట్టిన వాళ్లను కూడా మనం చరిత్రలో చూడవచ్చు. కనుక జర్నలిజం సామాజిక మద్దతు , ఆర్థిక పరిపుష్టి, పనిచేస్తున్న సంస్థ యొక్క అండ , వ్యక్తి నిబద్ధత , ఎంచుకున్న లక్ష్యం వంటి ఉన్నత ఆశయాల పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు.

గుండె బరువెక్కిన వ్యక్తి లాగా సమస్యల హోరులో అనేక రంగాల సంక్షోభంలో కూరుకున్న భారతావని సామాన్య పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడటానికి నిరంతరము సిద్ధపడినటువంటి జర్నలిస్టులు వారి వృత్తి జర్నలిజం పైన సమాజానికి అవగాహనతో పాటు అవసరమైన పక్షంలో సమాజానికి ఏకాభిప్రాయం కూడా ఉండవలసిన అవసరం ఉంది . కష్ట సమయంలో ,పోటీ వ్యవస్థలో , సమస్యలు తలెత్తిన సందర్భంలో ప్రజల మద్దతు ఉంటే ఆ ఉచ్చులో నుండి బయటపడడానికి జర్నలిస్టులకు అవకాశం ఉంటుంది . ఆ మద్దతు ఇవ్వడం మనందరి యొక్క కనీస బాధ్యత . అది పరోక్షంగా వ్యవస్థ మార్పుకు ,మెరుగైన సమాజా నిర్మాణానికి దోహదపడుతుంది అనే సోయి ఈ ప్రజానీకానికి ఉండడం అత్యాశ ఏమీ కాదు.

ఎల్లో జర్నలిజం, జర్నలిజంలో తడబాటు రెండు ప్రమాదకారులే :-

జర్నలిజం తడబాటు పడడం అంటే ఆటుపోట్ల మధ్యన చిక్కి ఊగిసలాడడo, లేదా బాధ్యతను నిబద్ధతగా నిర్వహించకుండా ఒక వర్గానికి పక్షానికి పార్టీకి ప్రజా వ్యతిరేక విధానానికి పెట్టుబడి దారి ధోరణికి వంత పాడడమే అవుతుంది .ఆ పరిస్థితి గనుక కొనసాగినట్లయితే మీడియా పెట్టుబడిదారీ వర్గం విష కౌగిట్లో చేరిపోయినట్లే .. అంటే జర్నలిజం తడబాటు పడ్డట్టే కదా !ఇలాంటి తడబాటు ప్రజాస్వామ్యాన్ని ఖూ ని చేస్తుందని జస్టిస్ శ్రీకృష్ణ గారు చేసిన హెచ్చరిక జర్నలిస్టులను పత్రికా మీడియా సంపాదకులతో పాటు ప్రజలను నిరంతరము కదిలిస్తూ ఉంటుంది. కానీ కదలడానికి, స్పందించడానికి, బాధ్యతను సానుకూలంగా తీసుకోవడానికి జర్నలిస్టులు ప్రజలు సంపాదకవర్గము సిద్ధంగా లేకపోతే కూడా అనివార్యంగా జర్నలిజం సంక్షోభంలో కూరుకుపోయినట్లే ! అప్పుడు సరైన బాధ్యత నిర్వహించకపోగా అనర్థాలకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది . అది కాదు కదా జర్నలిజం యొక్క లక్ష్యం. ఈ పొరపాటే తడబాటు . రాజ్యాంగబద్ధంగా ఎన్ని అంశాలు రాసుకున్నా ప్రవేశికలో పొందుపరచుకున్నా అంశాలను 75 సంవత్సరాల తర్వాత కూడా సాధించలేకపోయిన సందర్భంలో పాలకులు, పెట్టుబడిదారులు, సంపన్న వర్గాల తో పాటు మీడియా వైఫల్యం కూడా కారణమే అని అంగీకరించవలసి ఉంటుంది. అంతేకాదు జాగరుకులైన ప్రజావలి లేకపోవడం కూడా ప్రజాస్వామ్యం విఫలం కావడానికి కారణం అని అంబేద్కర్ గారు చేసిన హెచ్చరిక కూడా పరోక్షంగా జర్నలిజం వైఫల్యాలను ఎత్తి చూపడమే అవుతుంది. . “సందర్భం ఏదైనా జర్నలిజం లోపాలు ప్రాధాన్యత దేశవ్యాప్తంగా చర్చకు తెరదీసిన వేళ సామాజికవేత్తలు, పత్రికారంగ నిపుణులు , మేధావుల సమక్షంలో పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా జర్నలిజం పైన కథనాలు రావాలి .చర్చలు సాగాలి. గోస్టులు నిర్వహించాలి . సదస్సులు పెట్టాలి.” .సమాజంలోని భిన్న వర్గాలలో ఇంతటి ఆలోచనను రేకెత్తించిన జస్టిస్ శ్రీకృష్ణ వ్యాఖ్యలు విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత అన్న స్థాయిలో ఆలోచింప చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది .

ఇక ఎల్లో జర్నలిజం పేరుతో జర్నలిజం తప్పటడుగులు ఏకపక్ష విధానాలను ఎక్కడికక్కడ ప్రశ్నించుకొని అడ్డుకోకపోతే ఆ మంటల్లో ఈ వ్యవస్థ చిక్కుకొని పోయే ప్రమాదం ఉన్నది . ఈ నేపథ్యంలో ఎల్లో జర్నలిజం యొక్క వివరణ పాఠకుల ప్రయోజనం కోసం తప్పనిసరి. “తమ వార్తాపత్రిక లేదా ఛానల్ సర్కులేషన్ పెంచుకోవడానికి సంచలనాత్మకమైనటువంటి వార్తలు నిజా నిజాలు పరిశోదించ కుండా రాయడం పంపిణీ చేయడం, ఓకే పార్టీ సంఘం కులం మతం గూర్చిన ఏకపక్ష సమాచారాన్ని భుజానికెత్తు కొని ప్రచారం చేయడం, డబ్బు విలువైన వస్తువులు కానుకలు తీసుకొని ఒక వర్గం లేదా కొందరి ప్రయోజనం కోసం అనుకూలంగా వార్తలు ప్రచురించడం ప్రసారం చేయడం , వ్యక్తిగతమైన ప్రకటనలను వార్తలుగా రాయడం వంటి చర్యలు ఎల్లో జర్నలిజం అనబడుతుందని” పత్రికారంగా నిపుణుల అభిప్రాయం. విలువలు పతనమవుతున్న నేపథ్యంలో ఇలాంటి వారిని కొన్ని సంస్థలు వ్యక్తులు వ్యవస్థలు పెంచి పోషిస్తున్నారనే విషయం పరిశీలన అధ్యయనం ద్వారా తెలుస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

ఈ రకంగా జర్నలిజం తప్పట డుగులు, ఎల్లో జర్నలిజం రెండు కూడా దాదాపుగా సమాజ ఎదుగుదలకు భిన్నంగా పనిచేస్తున్నటువంటి ఏకరూప విన్యాసాలు అని చెప్పవచ్చు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలతో పాటు ముఖ్యంగా యువత ఈనాడు జర్నలిజం వేస్తున్న తప్పటడు గులను సరి చేయడానికి కొరడాఝ లిపించడంతోపాటు జర్నలిజాన్ని సద్వినియోగపరుచుకోవడం లోపల కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తే పాలకులు పెట్టుబడి దారి కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్న అక్రమ విధానాలకు కళ్లెం వేయవచ్చు. ప్రజల పక్షాన జర్నలిజాన్ని పది కాలాలపాటు బ్రతికించవచ్చు. అది మన నిబద్ధత పైన ఆధారపడి ఉండే అసాధారణ ఆయుధం అని తెలుసుకుంటే శ్రేయస్కరం . జస్టిస్ శ్రీకృష్ణ 17 డిసెంబర్ 2022 శనివారం రోజున ముంబై ప్రెస్ క్లబ్ లో చేసిన ప్రసంగ నేపథ్యంలో రాయబడిన వ్యాసం . పరిమిత అవగాహన , సామాజిక అధ్యయనం, అనుభవాలు జ్ఞాపకాలు ఈ వ్యాసరచనకు నాకు తోడ్పడిన అంశాలు

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading