Connect with us

నిర్మల్

మహా ధర్నా లో బీజేపీ రాష్ట్ర నాయకులు భోస్లే మోహన్ రావు పాటిల్

INTHIYAZ MIRZA

Published

on

జనం వెలుగు, బాసర:- భారతీయ జనతా పార్టీ   ఆధ్వర్యంలో బాసర మండల కేంద్రం లో స్థానిక ఎంఆర్ఓ ఆఫీసు ప్రక్కన (ఖాళీ స్థలం) డబుల్ బెడ్ రూం దరఖాస్తు దారులు మరియు సొంత ఇల్లు లేని నిరుపేద ప్రజలతో  సభ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సభ లో ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు భోస్లే మోహన్ రావ్ పాటిల్ పాల్గొని ప్రజలను , కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్ యొక్క  నియంతృత్వ పోకడలతో కూడిన పరిపాలన ను చూసి రాష్ట్ర ప్రజలు అయోమయానికి గురవుతున్నారు అని చెప్పారు, తన మోసపూరితమైన ప్రకటనలతో రెండు సార్లు గద్దెనెక్కి, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం గా మార్చి, ఒక్కొక్కరి నెత్తి మీద లక్షల కొద్ది అప్పులు పెట్టి కూర్చున్నాడని వాపోయారు, ఇగ ఎన్నికల సమయం లో  డబుల్ బెడ్ రూం ల విషయం గురించి చిలుక పలుకులు పలికిన్డు  మాటలు మాత్రం కోటలు దాటినయి కానీ చేతలు మాత్రం శూన్యం. ఈ కెసిఆర్ ప్రజలను ఆశకు గురిచెయ్యడానికి అల్లుడు వస్తె ఎక్కడ పడుకోవాలి, మేక ను ఎక్కడ కట్టెయ్యలి, కోడి ని ఎక్కడ కమ్మాలి అని కల్లబొల్లి మాటలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా మొహం చాటేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం లో అన్నీ వర్గాల ప్రజలను మోసం చేసిన కెసిఆర్ ఎన్నికల ముందు అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తాను, జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఇస్తాను అని 2018 ఎన్నికలలో సందర్భంగా హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయినప్పటి ఆ హామీలను గాలికి వదిలి ఇప్పుడేమో జాగా ఉన్నవారికి 3 లక్షలు ఇస్తాము అని కొత్త డ్రామా మొదలుపెట్టిండు. అరాకొరా కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు అప్పుడే శిథిలావస్థకు చేరిన అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల సందర్భంగా తన మోసపూరితమైన మాటలతో నియోజక వర్గ ప్రజలను మభ్య పెట్టీ పేదల ఓట్లతో MLA గా గెలిచినా స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నేడు ఇదే పేద ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించలేని చేత కాని దద్దమ్మ అని చెప్పడం జరిగింది. ఇంతవరకు సొంత జాగ ఉన్న ఏ ఒక్క కుటుంబానికి ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఇప్పించెలేని ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డిని అభివర్ణించారు, వచ్చే ఎన్నికలలో నియోజక వర్గప్రజలు , రాష్ట్ర ప్రజలు ఈ BRS ప్రభుత్వానికి, ఆ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యే లకు ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పి పేద ప్రజల పక్షపాతి అయిన బీజేపీ పార్టీ అధికారం కట్టబెడుతారుఅని విశ్వాసం వ్యక్తం చేశారు,BJP అధికారం లో వచ్చిన వెంటనే దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుపేదలకు సొంతింటి కల ఎలా నెరవేరుస్తుందో అదే పద్ధతి లో రాష్ట్రంలో , ముదోల్ నియోజక వర్గం లో నిరుపేద ప్రజలకు సొంతింటినీ నిర్మించి తీరుతామని హామీ ఇచ్చారు, ఆనంతరం సభాస్థలి నుండి వేలాది మంది ప్రజలతో ర్యాలీ గా ధర్నా చౌక్ దగ్గర కి చేరుకొని బైఠాయించిన మోహన్ రావ్ పాటిల్  2018 ఎన్నికల హామీ ప్రకారం తక్షణమే అర్హులైన పేద వారికీ డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయాలని, సొంత జాగా ఉన్న అర్హులకు 5 లక్షల రూపాయలని అందచేయాలని లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేసి ప్రగతీ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరిచారు, ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో, ప్లకార్ట్ లతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాసర మండల తహశీల్దార్ వచ్చి మీ సమస్యలన్నింటినీ కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగిన న్యాయం జరిగేలా చూస్తాను అని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించడం జరిగింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading