Connect with us

నిర్మల్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కింమ్ బాసరలో అంగన్వాడి యూనియన్   ధర్నా

INTHIYAZ MIRZA

Published

on

జనం వెలుగు, బాసర:- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్కీంలనుపై స్థానిక తసిల్ ఆఫీస్ ముందర ధర్నా  ప్రైవేటికరణ ఆపాలి.స్ర్కిమ్ వర్కర్స్ కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలి.Pf.Esi సౌకర్యం కల్పించాలని కోరుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రెడ్ యూనియన్స్ ( సీఐటీయు) బొమ్మెనసురేశ్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ కాలంలో స్కిం వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒకవైపు ఆకాశనంటూతున్న నిత్యావసర సరుకుల ధరలు,  మరోవైపు చాలి చాలని  వేతనాలతో కేంద్రం, రాష్ట్రం ప్రవేశపెట్టిన స్కీం లలో పని చేస్తున్న వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లను చట్ట పరిధిలోకి తీసుకురావడానికి నిరాకరిస్తుంది. వారి సంక్షేమం గాలికి వదిలేస్తుంది. పైగా స్కీములను నిర్వీర్యం చేసే అనేక నిర్ణయాలను తీసుకొస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం, గ్రామీణ ఉపాధి హామీ, ఎన్.హెచ్.ఎం వివిధ స్కింమ్ లు, ఐకేపీ వీవోఏ, సర్వశిక్ష అభియాన్ తదితర 72 స్కింమ్ లు దేశ వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఇందులో దేశంలో ఒక కోటి మంది, రాష్ట్రంలో ముడున్నర లక్షల మంది స్కిం వర్కర్లు పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు మహిళలు,, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు చేరావేయడంలో స్కిం వర్కర్లు కీలక పాత్ర పోషించారు. అయినా విరుకి ఇలాంటి చట్ట బద్దత సౌకర్యాలు కల్పించకుండా నేటికీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. *దేశ వ్యాప్తంగా స్కిం వర్కర్లు సీఐటీయు ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరం కోసం అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాటాల ఫలితంగా 2013మే నెలలో 45ఇండియన్ లేబర్ కన్ఫ్యూరెన్స్ స్కిం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కిం ల ప్రైవేటికరణ ఆపాలని  తీర్మానం చేసింది. ఈ నిర్ణయం జరిగి 8 సం,, లు దాటింది.స్కిం ల పట్ల కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర  ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు. పైగా ప్రైవేటికరణ విధానాలు ఐసీడిఎస్, ఎండిఎం, మెడికల్ & హెల్త్ లో అమలు చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తుంది. అనేక రంగాలలో విపరీతంగా పని బారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్కిం  వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదు. స్కింల పట్ల నిర్లక్ష్యం విడనాడాలని,  స్కీముల ప్రైవేటుకరణ,  స్కీం వర్కర్ల సమస్య పరిష్కరించాలని కోరుతూన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి,11వ PRC వర్తింప చేసి వేతనాలు పెంచాలి.మున్సిపల్ కార్మికులకు G.O 60 ప్రకారం అందరికి 15600/-చెల్లించాలి. కనీస వేతనం GO సవరించి కార్మికులకు కనీస వేతనం 26000/-రూపాయలు చెల్లచాలని CITU నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు, A.రాజమణి, జిల్లా ఉపాధ్యక్షులు, శైలేజా, శశికళ, బులక్ష్మి,రత్నమాల, కవిత, బాసర యూనియన్ అధ్యక్షులు రజియా, బేగం, ద్రౌపదీ, ఈ ప్రేమల, యు ప్రేమాల, సకినా, అరుణ, సుమల, భారత్ భాయ్, ఈశ్వర్ భాయ్, సరిత, రమ్య, లావణ్య, దేవిగా, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు Ch.చెంద్రకళ, బాగ్యా తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading