నిర్మల్
భక్తి జనసంద్రమైన ఆలయం


రికార్డు స్థాయిలో అక్షర శ్రీకారాలు
బాసరమ్మవారికి లక్ష పై గా దర్శించుకున్న భక్తులు
ఆలయంలో ప్రముఖుల పూజలు
జనం వెలుగు, బాసర:- బాసర:- దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం చదువులు తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో గురువారం వసంత పంచమి అనగా దీనిని శ్రీ పంచమి కూడా అంటారు .అయితే వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మన రాష్ట్రాన్ని కాకుండా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుండి భారత దేశ నలుమూలల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి దర్శించుకున్నారు. సుమారు లక్ష పైచిలుకు భక్తులు అమ్మవారికి రికార్డ్ స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు దర్శనానికి భక్తులు రాగా తమ చిన్నారులకు ప్రత్యేక అక్షర అక్షర వ్యాసాలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు దీనితో ప్రత్యేక అక్షర వ్యాసాలు 1000 రూపాయలు 150 రూపాయలు మొత్తం కలిపి 4640 రాగా లడ్డు ప్రసాదాలు ఆలయ అతిథి గృహాలు మొత్తం కలిపి 45 లక్షల పైచిలుకు ఆదాయం రాగా లక్షకు పైబడి భక్తులు అమ్మవారిని అక్షర శ్రీకారాలు కుంకుమార్చన ప్రత్యేక పూజలు జరిపి తమ ముక్కులను తీర్చుకున్నారు భక్తులు సుమారు బుధవారం రాత్రి 12 గంటల నుండి ప్రత్యేక క్యూ లైన్ లో నిలుచుగా దాదాపు మూడు నుండి నాలుగు గంటల వరకు సమయం పడిందని తెలిపారు అంతకుముందు బుధవారం రాత్రి భారీ సంఖ్యలో వచ్చిన భక్తులకు అష్ట కష్టాలు తప్ప లేవు ఎముకలు కోరికే చెల్లిని సైతం లెక్కచేయకుండా భక్తులు అరబైటనే పడుకున్నారు. ప్రత్యేక క్యూ లైన్ లో నిలుచుగా అక్షర అభ్యాసవేయి రూపాయలు సామాన్య భక్తులు దర్శనానికి సుమారు నాలుగు నుండి ఆరు గంటల సమయం పడింది.
వసంత పంచమి రోజున ప్రముఖుల దర్శనం
చదరతల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీరిలో నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్యసభ సభ్యులు దేవకొండ దామోదర్ రావు ఎమ్మెల్సీ విట్టల్ ప్రముఖ వ్యాపారవేత్త బిజెపి సీనియర్ నాయకులు రామారావు పటేల్ మోహన్రావు పటేల్ నిజాంబాద్ జడ్జి శ్రీనివాస్ ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ భోజన్న అదే విధంగా వసంత పంచమి పర్వదినాన్ని భక్తులను దృష్టిలో పెట్టుకొని బాసర ట్రిపుల్ ఐటీ కి చెందిన 50 మంది విద్యార్థులు తమ సేవలను చేపట్టారు వీరికి కోఆర్డినేటర్ గా రాకేష్ రెడ్డి కుమార్ ఉన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








