నిర్మల్
భారీగా తరలివచ్చిన భక్తులు


బాసర ఆలయంలో భక్తులకు సమస్యలుగా మారిన తిష్ట
పలు స్వచ్ఛంద సేవ సంస్థలచే అన్నదాన కార్యక్రమాలు
జనం వెలుగు:- బాసర
పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో గురువారం మాఘమాసం శుభ సందర్భంగా అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రాంతాల నుండి తమ తమ ప్రత్యేక వాహనాలు కాకుండా రైల్వే బస్సు మార్గం తరలివచ్చి గోదారి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు అనంతరం నేరుగా అమ్మవారి దర్శనానికి బయలుదేరగా బుధవారం రాత్రి 12 గంటల నుండి ప్రత్యేక క్యూ లైన్ లో నిల్చుగా ఆలయ అధికారులు గురువారం 1:00 నుండి భక్తులకు ప్రత్యక్షర వ్యాసాలతో పాటు టికెట్ సేవలను కల్పించగా మూడు గంటల నుండి అక్షర శ్రీకర పూజలు చేపట్టారు దీనితో అనంతరం మంత్రాల్లో ఇంద్రకరణ్ రెడ్డి ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించగా నేరుగా యధావిధిగా అక్షర శ్రీకర పూజలు చేపట్టారు. దీనితో బాసర ఆలయంలో విఐపి సాధారణ అక్షర శ్రీకారాలు చేపట్టగా సుమారు మూడు నుండి ఐదు గంటల వరకు క్యూలైన్లో భక్తులు నిల్చగా అనేక కష్టాలు పడ్డారు. చిన్నారులు ఏడుస్తుండగా అదే విధంగా అక్కడక్కడ మరుగుదొడ్ల సమస్యలు మంచినీటి సమస్యలు తలెత్తాయి దీనితో ఆలయ అధికారులు అప్రమత్తమై సమస్య ఉన్న చోట వెంటనే వచ్చి ఆ సమస్యను తీర్చిదిద్దారు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి ఆలోచన సంఘటనలు జరగకుండా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ వినోద్ రెఎల్ రెడ్డి బాసర ఎస్సై మహేష్ గారి ఆధ్వర్యంలో 14 ఎస్సైలు ఐదుగురు సిఐలు 120 మంది ప్రత్యేక బలగాలు భారీ బందోబస్తు మధ్య తమ విధులను నిర్వహించగా భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చిన తమ తమ ప్రత్యేక వాహనాలు నిలుచుండగా వాహనాలతో ఎటు చూసినా కారులతో నిండిపోయి పట్టణం లాగా మారిన బాసర ఆలయ క్షేత్రం దీనితో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అటు దుకాణాలతో పాటు ఆలయ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకున్నారు దీనితో వాస్తవానికి చూస్తే బాసర ఆలయంలో విఐపి ల పేరిట ఎక్కువ దర్శనాలు అయినాయని భక్తులు ఆందోళనకు గురయ్యారు కోపంతో అధికారులపై దిగారు సాయంత్రం వరకు అక్షర పూజలు జరుగుతూనే ఉండగా ఓపికతో పూజారులు అక్షర శ్రీకర పూజలను తమ తమ చిన్నారులకు దిద్దారు.
పలు స్వచ్ఛంద సంస్థల అన్నదానం


వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాసరాలయం తరఫునుండి అక్షరాభ్యాస మండపంలో క్యూ లైన్ లో సాధారణ దర్శనాల లైన్లో భక్తులకు చిన్నారులకు మంచినీరు పాలు బిస్కెట్లు అదేవిధంగా కొందరు స్వచ్ఛంద సేవ సంస్థలు వారు బిస్కెట్లు అరటి పండ్లు అందించారు. దీనితో మార్కండేయ అఖిల భారత పద్మశాలి సంఘంలో తిరుమల తిరుపతి దేవస్థానం గదుల ముందర పలు సేవా సంస్థలు ఉచితంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలను అందించారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








