Connect with us

Entertainment

మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీకి మరింత ఉపశమనం

janamvelugunews

Published

on

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్ర శేఖర్‌‌ (Sukesh Chandrashekhar)తో సంబంధాలను కొనసాగించిందనే ఆరోపణలను పోలీసులు ఆమెపై మోపారు. అతడి నుంచి రూ.7కోట్ల విలువైన బాహుమతులను జాక్వెలిన్ అందుకుందన్నారు. ఈ కేసులో జాక్వెలిన్‌ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయట ఉంది. తాజాగా ఆమెకు మరింత ఉపశమనం లభించింది. ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆమెకిచ్చిన బెయిల్‌ను నవంబర్ 10 వరకు పొడిగించింది.

ఢిల్లీ కోర్టులో ఈ కేసు విచారణ అక్టోబర్ 22న జరిగింది. జాక్వెలిన్ తన లాయర్ ప్రశాంత్ పాటిల్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యింది. ప్రశాంత్ పాటిల్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి తమకు ఎటువంటి పత్రాలు అందలేదన్నారు. దీంతో కేసుకు సంబంధించిన ఛార్జిషీట్, ఇతర పత్రాలన్నింటిని అన్ని పక్షాలకు అందించాలని కోర్టు సూచించింది. బెయిల్‌పై విచారణను నవంబర్ 10కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. అప్పటి వరకు హీరోయిన్‌కు మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 26న మధ్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిందని ఈడీ కోర్టుకు తెలిపింది. దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పింది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర 

janamvelugunews

Published

on

బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర 

జనంవెలుగు, నిజామాబాద్:- బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి అని సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర అన్నారు. బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో బరాబర్ ప్రేమిస్తా సినిమా టీం డైరెక్టర్ సంపత్ రుద్ర, హీరో చంద్రహాస్, హీరోయిన్ మేఘన ముఖర్జీ, ఇంద్రకరణ్ లు విలేకర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదివరకు వచ్చిన ప్రేమ కథలకు భిన్నంగా అన్ని ఎమోషన్లతో కూడిన అందమైన ప్రేమ కథ చిత్రాన్ని నిర్మించి త్వరలో తమ చిత్రం విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుందని కావున తమ చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ చిత్రం పూర్తిగా దాదాపు తెలంగాణలోని ముఖ్యమైన జిల్లాలలో ఆయన వివరించారు.

ఇదే బ్యానర్ పైన తమ తదుపరి చిత్రం కూడా ఉంటుందని ఆ చిత్రం దాదాపు 40 శాతం వరకు నిజామాబాద్ జిల్లాలోని అందమైన లోకేషన్లను ఎంపిక చేసుకుని రాబోయే తమ చిత్రానికి రూపకల్పన చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బరాబర్ ప్రేమిస్తా చిత్రంలో యువతకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాను నిర్మించామన్నారు.

సినిమాను తెలంగాణలో తీయడం జరిగిందన్నారు. తాను నెక్స్ట్ నిర్మించే సినిమాను నిజామాబాద్ లో చేసే ప్రయత్నం చేస్తామన్నారు. సి సి క్రియేషన్స్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరారు.

Continue Reading

Entertainment

ఫుల్లుగా మందేసి కరెంట్ తీగలపై పడుకున్న మందుబాబు

janamvelugunews

Published

on

ఫుల్లుగా మందేసి కరెంట్ తీగలపై పడుకున్న మందుబాబు

జనంవెలుగు, మన్యం:- పాలకొండ మండలం ఎం. సింగిపురం అనే గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగనిదే అతడికి పూట గడవదు. మద్యం తాగపోతే అతడు అడుగు కూడా బయటికి వేయలేడు. చేతులు వణుకుతాయి. మనిషి మొత్తం షేక్ అవుతుంటాడు. అలాంటి వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. పైగా నూతన సంవత్సరం కావడంతో మరింతగా మద్యం తాగాడు. దీంతో అతడి శరీరం వణికి పోవడం మొదలుపెట్టింది. కాళ్లు తడబడటం ప్రారంభమైంది. ఆ మైకం నుంచి తట్టుకోలేక అతడు బయటికి వచ్చాడు. వచ్చి రావడంతోనే పక్కన ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఇదే మైకంలో ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కాడు. చుట్టుపక్కల వాళ్ళు వారించినప్పటికీ అతడు ఒప్పుకోలేదు. అదే మైకంలో అలానే స్తంభం ఎక్కాడు. దీంతో వెంటనే స్థానికులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సరఫరాను నిలిపివేయించారు. విద్యుత్ స్తంభం పెట్టిన అతడు తీగలపై పడుకున్నాడు. అక్కడ చాలాసార్లు తనదైన విన్యాసాలు చేశాడు. ఆ తర్వాత స్థానికులు స్తంభం పైకి ఎక్కి అతడిని కిందికి దింపారు.

సోషల్ మీడియాలో సంచలనం

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అతడి తీరుపై మండిపడుతున్నారు.

Continue Reading

Entertainment

ఆత్మీయ సమ్మేళనం..

janamvelugunews

Published

on

ఆత్మీయ సమ్మేళనం..

ఉప్పొంగిన ఉత్సహం

జనంవెలుగు, వెబ్ డెస్క్:- వారంతా ఒకే పాఠశాలలో చదివారు. కానీ ఇప్పుడు వారి మధ్య పలకరింపులు లేవు.. కనీసం ఫోన్ చేసి మాట్లాడే అవకాశం లేదు.. కలుసుకోవాలని ఉన్న కుదరని పరిస్థితులు.. ప్రస్తుతం వారంతా ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. తామంత ఒకే చోట కలవాలన్న ఆలోచన కొందరిలో కలిగింది. ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఐదు నెలల సమయం పట్టింది… ఎంతో ఓర్పుతో తమతో కలిసి చదివిన వారి వివరాలు సేకరించారు. 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మంగళవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ సమ్మేళనానికి మోర్తాడ్ లోని
దేవి చెట్టు వేదిక అయింది.

మోర్తాడ్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1990-91పూర్వ విద్యార్థుల బ్యాచ్, మళ్లీ కలుసుకున్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారంతా కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలి వచ్చారు.

గుర్తుకొస్తునాయీ….. !

33 ఏళ్ల క్రితం హై స్కూల్ విద్యార్థులు ఇప్పుడు వారి పిల్లలు ఇంటర్మీడియట్, పదో తరగతిలో చదువుతున్నారు. ఆ రోజుల్లో కలిసి ఉండే కొంతమంది స్నేహితులు మినహా మిగతా వారెవరు ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. ఇప్పుడు ఆకస్మ త్తుగా కలుసుకోవడం వారిలో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసింది. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘ఒరేయ్…. నన్ను గుర్తుపట్టావా…? నేను నీ ఫ్రెండ్ సురేష్ గౌడ్ ని అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయారు. ఇలా ప్రతి ఒక్కరూ పూర్వ మిత్రులతో కలిసి ముచ్చటించుకున్నారు. గత అనుభూతులను నెమరు వేసుకున్నారు. మధుర స్మృతులు, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వయస్సుతో ప్రమేయం లేకుండా డ్యాన్సులుచేశారు. విందు వినోదాలతో కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా సాగింది.

Continue Reading