Connect with us

Entertainment

రోజు రోజుకు ఈ అమ్మడి అందం పెరుగుతుంది

janamvelugunews

Published

on

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. కమర్షియల్ బ్రేక్ దక్కించుకోక పోయినా కూడా మంచి గుర్తింపు అయితే దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ చేస్తున్న సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.జాన్వీ కపూర్ తన తల్లి కి ఏమాత్రం తగ్గకుండా అందంగా ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో ఈమె నిజంగా శ్రీదేవి కూతురా అన్నట్లుగా విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది.

ఒకప్పుడు హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో శ్రీదేవి ఎంత అందంగా ఉండేదో ఆ స్థాయిలో జాన్వీ కపూర్ ఫోటో షూట్స్ లో ఉందంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకో ఫోటో షూట్ ను ఈ అమ్మడు షేర్ చేస్తూనే ఉంటుంది. నిన్న చూసిన ఫోటోల్లో ఈమెను చూసి నేడు వచ్చిన ఫోటోలను చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా మంచి పేరు దక్కించుకుంటుందో లేదో కానీ అందం విషయంలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. రోజు రోజుకు ఈ అమ్మడు మరింత అందంగా కనిపిస్తుంది. సౌత్ నుండి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నా కూడా బాలీవుడ్ సినిమాల పైనే ఎక్కువగా ఈ అమ్మడు ఫోకస్ పెడుతోంది. ముందు ముందు అయినా తెలుగు లో ఈ అమ్మడు సినిమాలు చేస్తుందేమో చూడాలి.

Entertainment

బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర 

janamvelugunews

Published

on

బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర 

జనంవెలుగు, నిజామాబాద్:- బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి అని సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర అన్నారు. బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో బరాబర్ ప్రేమిస్తా సినిమా టీం డైరెక్టర్ సంపత్ రుద్ర, హీరో చంద్రహాస్, హీరోయిన్ మేఘన ముఖర్జీ, ఇంద్రకరణ్ లు విలేకర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదివరకు వచ్చిన ప్రేమ కథలకు భిన్నంగా అన్ని ఎమోషన్లతో కూడిన అందమైన ప్రేమ కథ చిత్రాన్ని నిర్మించి త్వరలో తమ చిత్రం విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుందని కావున తమ చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ చిత్రం పూర్తిగా దాదాపు తెలంగాణలోని ముఖ్యమైన జిల్లాలలో ఆయన వివరించారు.

ఇదే బ్యానర్ పైన తమ తదుపరి చిత్రం కూడా ఉంటుందని ఆ చిత్రం దాదాపు 40 శాతం వరకు నిజామాబాద్ జిల్లాలోని అందమైన లోకేషన్లను ఎంపిక చేసుకుని రాబోయే తమ చిత్రానికి రూపకల్పన చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బరాబర్ ప్రేమిస్తా చిత్రంలో యువతకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాను నిర్మించామన్నారు.

సినిమాను తెలంగాణలో తీయడం జరిగిందన్నారు. తాను నెక్స్ట్ నిర్మించే సినిమాను నిజామాబాద్ లో చేసే ప్రయత్నం చేస్తామన్నారు. సి సి క్రియేషన్స్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరారు.

Continue Reading

Entertainment

ఫుల్లుగా మందేసి కరెంట్ తీగలపై పడుకున్న మందుబాబు

janamvelugunews

Published

on

ఫుల్లుగా మందేసి కరెంట్ తీగలపై పడుకున్న మందుబాబు

జనంవెలుగు, మన్యం:- పాలకొండ మండలం ఎం. సింగిపురం అనే గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగనిదే అతడికి పూట గడవదు. మద్యం తాగపోతే అతడు అడుగు కూడా బయటికి వేయలేడు. చేతులు వణుకుతాయి. మనిషి మొత్తం షేక్ అవుతుంటాడు. అలాంటి వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. పైగా నూతన సంవత్సరం కావడంతో మరింతగా మద్యం తాగాడు. దీంతో అతడి శరీరం వణికి పోవడం మొదలుపెట్టింది. కాళ్లు తడబడటం ప్రారంభమైంది. ఆ మైకం నుంచి తట్టుకోలేక అతడు బయటికి వచ్చాడు. వచ్చి రావడంతోనే పక్కన ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఇదే మైకంలో ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కాడు. చుట్టుపక్కల వాళ్ళు వారించినప్పటికీ అతడు ఒప్పుకోలేదు. అదే మైకంలో అలానే స్తంభం ఎక్కాడు. దీంతో వెంటనే స్థానికులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సరఫరాను నిలిపివేయించారు. విద్యుత్ స్తంభం పెట్టిన అతడు తీగలపై పడుకున్నాడు. అక్కడ చాలాసార్లు తనదైన విన్యాసాలు చేశాడు. ఆ తర్వాత స్థానికులు స్తంభం పైకి ఎక్కి అతడిని కిందికి దింపారు.

సోషల్ మీడియాలో సంచలనం

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అతడి తీరుపై మండిపడుతున్నారు.

Continue Reading

Entertainment

ఆత్మీయ సమ్మేళనం..

janamvelugunews

Published

on

ఆత్మీయ సమ్మేళనం..

ఉప్పొంగిన ఉత్సహం

జనంవెలుగు, వెబ్ డెస్క్:- వారంతా ఒకే పాఠశాలలో చదివారు. కానీ ఇప్పుడు వారి మధ్య పలకరింపులు లేవు.. కనీసం ఫోన్ చేసి మాట్లాడే అవకాశం లేదు.. కలుసుకోవాలని ఉన్న కుదరని పరిస్థితులు.. ప్రస్తుతం వారంతా ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. తామంత ఒకే చోట కలవాలన్న ఆలోచన కొందరిలో కలిగింది. ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఐదు నెలల సమయం పట్టింది… ఎంతో ఓర్పుతో తమతో కలిసి చదివిన వారి వివరాలు సేకరించారు. 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మంగళవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ సమ్మేళనానికి మోర్తాడ్ లోని
దేవి చెట్టు వేదిక అయింది.

మోర్తాడ్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1990-91పూర్వ విద్యార్థుల బ్యాచ్, మళ్లీ కలుసుకున్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారంతా కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలి వచ్చారు.

గుర్తుకొస్తునాయీ….. !

33 ఏళ్ల క్రితం హై స్కూల్ విద్యార్థులు ఇప్పుడు వారి పిల్లలు ఇంటర్మీడియట్, పదో తరగతిలో చదువుతున్నారు. ఆ రోజుల్లో కలిసి ఉండే కొంతమంది స్నేహితులు మినహా మిగతా వారెవరు ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. ఇప్పుడు ఆకస్మ త్తుగా కలుసుకోవడం వారిలో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసింది. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘ఒరేయ్…. నన్ను గుర్తుపట్టావా…? నేను నీ ఫ్రెండ్ సురేష్ గౌడ్ ని అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయారు. ఇలా ప్రతి ఒక్కరూ పూర్వ మిత్రులతో కలిసి ముచ్చటించుకున్నారు. గత అనుభూతులను నెమరు వేసుకున్నారు. మధుర స్మృతులు, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వయస్సుతో ప్రమేయం లేకుండా డ్యాన్సులుచేశారు. విందు వినోదాలతో కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా సాగింది.

Continue Reading