నిర్మల్
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, ఐకేఆర్ లు ఇక ఇంటికే


వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, ఐకేఆర్ లు ఇక ఇంటికే
డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు
కొనసాగుతున్న వస్తున్న మీ కోసం యాత్ర.
జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ పాలనపై ప్రజలు విసిగి పోయారని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపేందుకు సిద్దం అయ్యారని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. లక్ష్మణచందా మండలంలోని ధర్మారం, పొట్టపెల్లి, కనకాపూర్ గ్రామాల్లో శనివారం రెండవ రోజు వస్తున్న మీకోసం పాదయాత్ర కొనసాగింది. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారికి కాంగ్రెస్ పార్టీ అమలు చేసే పథకాలు, మేనిఫెస్టోను వివరిస్తూ యాత్రను కొనసాగించారు. అడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంత్రి ఐకేఆర్ పాలనకు విసిగిపోయామని మీలాంటి నాయకుడు కావాలంటూ మహిళలు తిలకం దిద్ది ఆశీర్వదించారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్ని మండలాలకు తన కుటుంబీకులను ఇంచార్జిలుగా నియమించి దోచుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు డబ్బు సంచులతో రాజకీయం చేయాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వంలో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
కోతి దేవుని ఆలయంలో పూజలు.
వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా పీచర ధర్మారం గ్రామాల మధ్యగల కోతి దేవుని ఆలయంలో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్, ఈటెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








