Birthday
జన హృదయ నేతలకు జన్మదిన శుభాకాంక్షలు


జన హృదయ నేతలకు జన్మదిన శుభాకాంక్షలు
జనంవెలుగు:- అందరివారు ఆ రామలక్ష్మణులు, వర్గ విభేదాలకు, కుల మతాలకు అతీతంగా పని చేస్తూ ప్రతి ఒక్కరి నాలుకల యందు ఉన్నారు రామలక్ష్మణులు, జనం మెచ్చిన యువ నాయకులు రామలక్ష్మణులు, ఉన్నత చదువులు ,ఉన్నత భవిష్యత్తును వదులుకొని ప్రజల కోసం, ప్రజలే మా జీవితమంటూ, ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా, ప్రజల కోసం అహర్నిశలు పరితపించే గొప్ప యువ నాయకులు రామలక్ష్మణులు ప్రజల కోసం రామలక్ష్మణల ఒకటే బాట ఒకటే మాట ప్రజల నాలుకల యందు ఉన్న గొప్ప యువ నాయకులు రామలక్ష్మణులు, పార్టీలకు అతీతంగా, ప్రజలకు ఉన్నత సేవలు అందించి, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చే గొప్ప యువ నాయకులు రామలక్ష్మణులు, ప్రపంచంతోపాటు భారతదేశముతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు బాన్సువాడ నియోజకవర్గం మెచ్చిన నేత, ప్రజలంతా దేవుడిగా కొలిచే ఆరాధ్య దేవుడనే, అరుణిత్యం లా స్మరించుకునే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నమ్మిన బంటులు, మెచ్చిన నాయకులు, తన కుమారులుగా భావించే రామలక్ష్మణులు, ఎప్పుడు స్పీకర్ పోచారం సేవల లో నిమగ్నమై ఉండటం గర్వకారణం అని ప్రజలు కొనియాడడం విశేషం, రుద్రూర్ మండలం, మండల కేంద్రం, పీస్ ఫుల్ గా ఉందంటే ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారంటే రామలక్ష్మణుల కృషి ఫలితమే అని చర్చ జరగడం విశేషం,
పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వర్గ విభేదాలకు అతీతంగా, సామాన్య మానవులకు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, ప్రతి ఒక్కరికి కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ భరోసా ఇచ్చి, సమస్య పరిష్కరించేంతవరకు కష్టం తీరేంతవరకు వెన్నంటి ఉండి, కష్టాలు తీర్చే, సమస్యలు పరిష్కరించే గొప్ప యువనాయకులే రామలక్ష్మణులని ప్రజలు నాలుకల యందు అనుకోవడం చర్చనీయాంశం.
హిందూ ముస్లిం అన్ని మతాలు అన్ని కులాల వారు ఒకటే అంటూ ప్రజల్లోకి కలివిడిగా ఉంటూ, కుల మతాల ఘర్షణలు జరగకుండా అందరూ సమానులే అని ప్రశాంత వాతావరణంతో పాటు, హిందూ ముస్లింలందరూ భాయి భాయి అంటూ, ప్రశాంతహితమైన వాతావరణ నెలకొల్పడంలో, రామలక్ష్మణులు అహర్నిశలు చేస్తున్న కృషి అద్భుతం అని ప్రజలు కొనియాడడం విశేషం.
ప్రజలు సుఖశాంతులతో ఉండడం కోసం ప్రజల శ్రేయస్సు కోసం చివరికి కుటుంబాన్ని కూడా వదిలి, మండల ప్రజలు, గ్రామ ప్రజలంతా తమ కుటుంబమే అని అనునిత్యం ప్రజల్లో కలిసి, ప్రజల కోసం పరితపించే గొప్ప మహా యువనాయకులే రామలక్ష్మణులు అని ప్రజలు అనుకోవడం విశేషం, ఇంతటి క్వాంటిటీ, క్వాలిటీ ఉన్న రామలక్ష్మణ బర్త్ డే నేడు, వీరి పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాతో పాటు, గ్రామ, గ్రామాల్లో ఘనంగా ప్రజలు, అన్ని మతాలవారు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చేసుకోవడం, వేడుకలు నిర్వహించడం, కుల మతాలకు అతీతంగా వర్గ విభేదలకతీతంగా పార్టీలకు అతీతంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం, ఇవన్నీ చూస్తుంటే వారి గొప్పతనం ఏమిటో అర్థమవుతుందని ప్రజలు అనుకోవడం విశేషం.
సొంత అన్నదమ్ముల వలె ఎల్లవేళలా అనుకుంటూ ప్రజల్లో వెళ్లి, ప్రజల కోసం పరితపించే, యువ నాయకులు రామలక్ష్మణులు అని భావించి వారిపై అపార నమ్మకం పెట్టుకున్నా డిసిసిబి ఉమ్మడి జిల్లాల చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, గొప్ప వైద్యులు పోచారం రవీందర్ రెడ్డిలు మెచ్చిన, యువ నాయకులే రామలక్ష్మణులు అని చర్చ జరగడం విశేషం, ఈ సందర్భంగా రామలక్ష్మణులకు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వారు వారి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని మరింత ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాగ్రాలకు ఎదిగి, భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరో మారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Birthday
|Nandipet నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….


నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….
పల్లె పల్లె నా పండగలా 135 వ అంబేద్కర్ జయంతి…
నందిపేట్ ఏప్రిల్ 14 (జనం, వెలుగు): నందిపేట డొంకేశ్వర్ మండలాలలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఆయన ప్రతిమల వద్ద పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
ముందుగా మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో మండల కేంద్రం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చౌరస్తా మొత్తం నీలిరంగుల జెండాలతో నింపేసి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.
అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా మహన్నదనా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వివిధ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, బహుజన పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు జోహార్లు అర్పించారు. మండల ట్రస్మా, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న మాట్లాడుతూ….. భీమ్రావు రాంజీ అంబేద్కర్ అనే పేరు, ఆయన ప్రతిమ లేని ప్రదేశం ఈ భారత దేశంలో ఎక్కడ లేదని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన యుగ పురుషుడని కొనియాడారు.
సమానత్వం కొరకు అంటరాని తనం అనే విష సంస్కృతిని రూపుమాపేందుకు ఎంతో దూరదృష్టిగా రాజ్యాంగ చట్టం కల్పించి అట్టడుగు వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడు అన్నారు. మండల కేంద్రం అంబేద్కర్ సంఘం సభ్యులు మాట్లాడుతూ…. అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో బహుజనులకు రక్షణ కరువయ్యేదని ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా సమాన హక్కులు ఉండేవి కావని, ఉక్కుపాదంతో అణిచివేసేవారని, ఈరోజు అనగారిన వర్గాల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే ఆ బిక్ష అంబేద్కర్ పెట్టిన భిక్షేనని అన్నారు.
Birthday
బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక


బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక
జనం వెలుగు – చౌటకూర్:- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరఫ్‌పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో మోహన్, విలేజ్ ప్రెసిడెంట్ గోవర్ధన్, మాజీ సర్పంచ్ హనుమంతరావు, పర్మేశ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, వార్డ్ మెంబర్ వెంకటేశం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న నాయకులు సురేష్ సేవలను ప్రశంసించారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఉత్సాహంగా జరుపుకున్నారు.
Birthday
PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి


PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి
జనంవెలుగు, నిజామాబాద్:- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని PRTU తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక పులాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్ మాట్లాడుతూ, అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి సమానత్వాన్ని, స్వేచ్ఛను ప్రసాదించారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగేశ్వరరావు, గంగాధర్, బుచ్చన్న, జావీద్, శ్రీకాంత్, వినోద్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతిజ్ఞ చేశారు.








