Birthday
|Nandipet నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….


నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….
పల్లె పల్లె నా పండగలా 135 వ అంబేద్కర్ జయంతి…
నందిపేట్ ఏప్రిల్ 14 (జనం, వెలుగు): నందిపేట డొంకేశ్వర్ మండలాలలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఆయన ప్రతిమల వద్ద పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
ముందుగా మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో మండల కేంద్రం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చౌరస్తా మొత్తం నీలిరంగుల జెండాలతో నింపేసి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.
అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా మహన్నదనా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వివిధ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, బహుజన పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు జోహార్లు అర్పించారు. మండల ట్రస్మా, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న మాట్లాడుతూ….. భీమ్రావు రాంజీ అంబేద్కర్ అనే పేరు, ఆయన ప్రతిమ లేని ప్రదేశం ఈ భారత దేశంలో ఎక్కడ లేదని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన యుగ పురుషుడని కొనియాడారు.
సమానత్వం కొరకు అంటరాని తనం అనే విష సంస్కృతిని రూపుమాపేందుకు ఎంతో దూరదృష్టిగా రాజ్యాంగ చట్టం కల్పించి అట్టడుగు వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడు అన్నారు. మండల కేంద్రం అంబేద్కర్ సంఘం సభ్యులు మాట్లాడుతూ…. అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో బహుజనులకు రక్షణ కరువయ్యేదని ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా సమాన హక్కులు ఉండేవి కావని, ఉక్కుపాదంతో అణిచివేసేవారని, ఈరోజు అనగారిన వర్గాల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే ఆ బిక్ష అంబేద్కర్ పెట్టిన భిక్షేనని అన్నారు.
Birthday
బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక


బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక
జనం వెలుగు – చౌటకూర్:- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరఫ్‌పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో మోహన్, విలేజ్ ప్రెసిడెంట్ గోవర్ధన్, మాజీ సర్పంచ్ హనుమంతరావు, పర్మేశ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, వార్డ్ మెంబర్ వెంకటేశం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న నాయకులు సురేష్ సేవలను ప్రశంసించారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఉత్సాహంగా జరుపుకున్నారు.
Birthday
PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి


PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి
జనంవెలుగు, నిజామాబాద్:- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని PRTU తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక పులాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్ మాట్లాడుతూ, అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి సమానత్వాన్ని, స్వేచ్ఛను ప్రసాదించారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగేశ్వరరావు, గంగాధర్, బుచ్చన్న, జావీద్, శ్రీకాంత్, వినోద్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతిజ్ఞ చేశారు.
Birthday
అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న భాజపా నాయకులు


అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న భాజపా నాయకులు
జనం వెలుగు, భీంగల్:- భీంగల్ పట్టణంలో సోమవారం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకల్లో ఘనంగా పాల్గొన్నారు. బడా భీంగల్ చౌరస్తా వద్ద ఉన్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు మాట్లాడుతూ, అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగ రూపశిల్పిగా దేశానికి మార్గదర్శకత్వం అందించారని, ఆయన ఆవిష్కరించిన సమానత్వం, సామాజిక న్యాయంను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ నాయకులు యోగేశ్వర్ నరసయ్య, సంధ్య రాజ్, పిరి గంగాధర్, దయ్య ప్రవీణ్, అశోక్, బిజీ మోహన్, కాపు కుమ్మరి హరీష్, తోపారం నరేందర్, లక్ష్మీనారాయణ, బాలగంగాధర్, అజయ్, గణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








