Connect with us

ARTICLE'S

మానవతా శిఖరం కొండా లక్ష్మణ్ బాపూజీ

janamvelugunews

Published

on

మానవతా శిఖరం కొండా లక్ష్మణ్ బాపూజీ

డాక్టర్ అశోక్ పరికిపండ్ల, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి (సెప్టెంబర్ -27 ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని)

జనం వెలుగు:-  పదవులు తృణపాయం!… ప్రజా శ్రేయస్సు ప్రాణం!… మాట తప్పనివాడు!… మడమ తిప్పని వాడు!… నిరంకుశ నవాబును గడగడలాడించిన వాడు!… ప్రజాస్వామ్య ప్రియుడు!… ప్రజాబ్యుదయ కంకణ ధారుడు!… వంచన, మోసం, కపటం, కుట్రలు తెలియనివాడు!… నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం!… దేశం కోసం కన్న కొడుకు ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు!… సమస్త ప్రజానీక శ్రేయస్సు కోసం తన ఆస్తి జలదృశ్యంను అర్పించిన వాడు!… సాటిలేని మేటి ప్రజా నాయకుడు! బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే ఒక ఆవేశం!.. ఒక ఆకాంక్ష!.. ఒక ఆశయం!… ఒక ఉద్యమం!…ఇవన్నీ కలిస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ. దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం, నిజాం పాలనపై నిప్పులు చెరిగిన నికార్సైన గాంధేయవాది, తెలంగాణ ఉద్యమానికి జల దృశ్యాన్ని ధారపోసిన ధీరో దా త్తుడు కొండా లక్ష్మణ్, తన జీవితంలో 30 సంవత్సరాలు లీగల్ లీడర్ గా, ఆ తర్వాత 30 సంవత్సరాలు పొలిటికల్ లీడర్ గా, మిగిలిన 37 సంవత్సరాలు తెలంగాణ లీడర్ గా తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప మానవతా శిఖరం. బాపూజీకి అధ్యయనం చేయడం ఆనందం, ఉద్యమం చేయడం ఆయనకుఊపిరి. ఆయన ఎప్పుడూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ తాట్ లని కోరుకునే వాడు. బాపూజీ ఐదు ఉద్యమాలకు కీలక పాత్ర పోషించి నేతృత్వం వహించాడు అవి 1. తెల్ల వాళ్ళ నుండి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం, 2. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం,3. ఆంధ్ర పాలకుల నుండి విముక్తి ఉద్యమం,4. సామాజిక తెలంగాణ ఉద్యమం,5. కుల వృత్తులు చేతి వృత్తులను ప్రోత్సహించే సహకార ఉద్యమం. తన 17 వ సంవత్సరంలో గాంధీ గారిని కలిసినప్పుడు వారితో మాట్లాడి, తాను సంతృప్తి చెందినిర్ణయం తీసుకొని తన తలపై ధరించిన గాంధీ గారి టోపీనీ చనిపోయేంతవరకు తీయలేదు, అంత నిబద్ధతగల గాంధేయ వాది కొండా లక్ష్మణ్. ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా వాంకిడి లో బాపూజీ, అమ్మక్క ల సంతానం లక్ష్మణ్, తండ్రి గ్రామంలో పోస్ట్ మాన్ గా ఉండేవాడు, ఏడవ తరగతి వరకు వాంకిడి లో ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం గావించి, ఎనిమిదో తరగతికి హైదరాబాద్ సిటీ కాలేజీలో ప్రవేశం తీసుకొని ఆ తర్వాత తను చదువుకుంటూ ట్యూషన్స్ చెబుతూ ఆర్థిక వెసులుబాటు సమకూర్చుకొని, వకీలు కోర్సులో డిప్లోమా పూర్తిచేశారు, చిన్నప్పుడు ముష్టియుద్ధం, కర్రసాములలో మంచి దిట్ట అయిన బాపూజీ అంతే స్ట్రాంగ్ గా మానసికంగా ఉండేవారు. తెలుగు ఉర్దూ ఇంగ్లీషు మరాఠీ భాషల్లో గొప్ప ప్రావీణ్యం కలిగిన బాపూజీ తనను ప్రభావితం చేసిన పుస్తకాలు రాణా ప్రతాప్ సింగ్, చత్రపతి శివాజీ, డాక్టర్ రాజా రామ్మోహన్ రాయ్ లని తెలిపారు. వకాలత్ లో ప్రావీణ్యత సంపాదించి క్రిమినల్ లాయర్ గా పేరు సంపాదించి ,ఆ రోజుల్లోనే 25 మంది అసిస్టెంట్లను తన వద్ద ఉపాధి కల్పించిన గొప్ప లాయరు, అంతేకాకుండా చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ముప్పుతిప్పలు పెట్టిన విస్నూర్ దేశ్ముఖ్ కేసులను ఉచితంగా వాదించి గెలిచిన గొప్ప ధీశాలి. తన జీవిత పర్యంతము పేదవాళ్లకు బాధిత మధ్యతరగతి వారికి ఫీజు ఎప్పుడు తీసుకోలేదు.34 వ యేట డాక్టర్ గా ఉన్న శకుంతలను వివాహమాడి వారిని కూడా దేశ సేవకు మిల్ట్రీ లో చేర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమం నాన్ ముల్కీ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న బాపూజీ పదవి కంటే ప్రాంతానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు 1952 లో అసిఫాబాద్ నుంచి చట్టసభకు మొట్టమొదటిసారిగా ఎన్నికై ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ గా సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ జీవితంలో తెలంగాణ ప్రజా సమితి మరియు నవసమాజ పార్టీని ఏర్పాటు చేసి సమాజాన్ని జాగృతం చేశారు. 1962 లో రెండవసారి చట్టం సభకు పోటీ చేసి అన్యాయం జరిగి ఓడిపోయిన విషయాన్ని కోర్టులో కేసు వేసి గెలిచిన ధైర్యశాలి, 1969లో విద్యార్థులు చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అక్కడే తన మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు ఏ పదవి తీసుకోబోమని అదే మాట పై చనిపోయేవరకు మాట మీదనిలబడ్డ మడమతిప్పని గొప్ప నాయకుడు. తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి, గవర్నర్ అయ్యే అవకాశాలు ఉన్నా చీపురు పుల్లతో సమానంగా తీసిపారేసిన గొప్పదీ శాలి, 97 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ కోసం ఎముకలు కొరికే చలిలో జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్షకు కూర్చున్న కరుడుగట్టిన తెలంగాణవాది, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎర్రటెండల్లో ప్రతి ఊరూరా బస్సు యాత్రను జరిపిన గొప్ప మానవతావాది బాపూజీ. తన ఆశ, శ్వాస, భాష, యాస తెలంగాణ మే అని బతికాడు. వందేళ్ల భారతదేశ చరిత్రకు సాక్ష్యం, తొలి తరం నుండి మలితరం వరకు అనేక ఉద్యమాలకు భీష్మాచార్యుడు బాపూజీ,ఎందరికో ఆశ్రయమిచ్చి అందరినీ ఎదగ నిచ్చిన గొప్ప సమతా వాది, వారి కీర్తి నలుమూలల ప్రకాశం.బీ.సీల రాజ్యాధికారం కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి.

(రచయిత కొండా లక్ష్మన్ బాపూజీ అంతరంగిక హోమియోపతి వైద్యునిగా పనిచేశారు)

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading