Connect with us

ARTICLE'S

మోడీ సర్కార్ అన్ని రంగాలలో విఫలమైందన్న సి డబ్ల్యూ సి

janamvelugunews

Published

on

దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే దానికి పరాకాష్ట

నిజం కాకుంటే కేంద్రం నిలదీయవచ్చు కదా !

కొన్ని గణాంకాలు పరిశీలిస్తే ఆందోళన కలగక మానదు
ఇదేనా?
వజ్రోత్సవ భారతి సాధించిన పురోగతి.

వడ్డేపల్లి మల్లేశం 9014206412

జనం వెలుగు:- కేంద్రంలో మోడీ సర్కార్ అన్ని రంగాలలో విఫలమైందని 16, 17 సెప్టెంబర్ 2023 తేదీలలో హైదరాబాదులో జరిగిన సిడబ్ల్యుసి సమావేశం ఘాటుగా విమర్శించింది. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక శాంతిభద్రతల అంశాల పైన ప్రస్తావించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగంలో చోటు చేసుకున్నటువంటి అంశాలు పరిశీలించడం మనందరి యొక్క కనీస బాధ్యత. సాధారణంగా అధికార పార్టీకి ఉన్న బాధ్యత కంటే ప్రతిపక్షాలకు మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది అని ప్రజాస్వామ్య పాలనాపరంగా నిర్వచి0 చుకున్నప్పటికీ దేశంలో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వప్రయోజనాల కోసం పాల్పడి ప్రజల ఆశలు ఆకాంక్షలను పక్కన పెడుతున్న కారణంగా పుట్టుకొస్తున్న ప్రజా ఉద్యమాలను అణచి వేస్తున్న పాలకవర్గాలు ప్రశ్నించే గొంతులను నొక్కడం ఆనవాయితీగా పెట్టుకోవడం కూడా ఈ దేశం అన్ని రంగాల్లో విఫలమైంది అని చెప్పడానికి ప్రధాన సాక్ష్యం అవుతుంది. కాంగ్రెస్ హయాంలో సుమారు 300 ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతుంటే 1991లో కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైనటువంటి ప్రపంచీకరణ, సరళీకరణ, నూతన ఆర్థిక విధానాల కారణంగా ప్రారంభమైనటువంటి ప్రైవేటీకరణ ఇటీవల 2014 నుండి మోడీ హయాములో మరింత పెచ్చు మీరినట్లు కీలకమైనటువంటి రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ పెట్టుబడిదారీ మిత్రులకు అప్పగించడాన్ని అందుకోసం కొత్త చట్టాలు చేయడాన్ని మనం గమనించవచ్చు. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో సహా అనేక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో చిన్నాభిన్నమైనటువంటి జనజీవనంతో పాటు ఆ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేక రాష్ట్రాలలో నెలకొన్న కరువు దృష్ట్యా భారీ మొత్తంలో ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా సిడబ్ల్యుసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడాన్ని దేశంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులకు దర్పణంగా భావించవచ్చు.

సిడబ్ల్యుసి ఆందోళన వ్యక్తం చేసిన కీలక రంగాలు:-

భారత్ జూడో యాత్ర సందర్భంగా చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిన విషయాన్ని రాహుల్కు భాజపా నాయకులే చూపించినట్లుగా ప్రస్తావించిన సిడబ్ల్యుసి కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా చైనాకు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వంద వైఖరి కాదా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో మూక దాడులు అంతర్గత సవాళ్లు కీలక రంగాలలో సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాసానికి దారి తీసిన మణిపూర్ అల్లర్ల విషయాన్ని ప్రస్తావిస్తూ 2023 మే 3 తేదీ నుండి ఆ రాష్ట్రంలో పలు హింసాత్మక అమానవీయ సంఘటనలు జరిగినప్పటికీ కేంద్రం జోక్యం చేసుకొని కారణంగా ఇండియా కూటమి ఆ రాష్ట్రంలో పర్యటించడంతోపాటు ప్రధాని నుండి సమాధానం రాబట్టడం కోసం అవిశ్వాస తీర్మానం ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే మణిపూర్లో హింసను నిర్లక్ష్యం చేసిన కారణంగా రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ల పైన కూడా దాని ప్రభావం పడిందని ఎక్కడికక్కడ మౌలికంగా సమస్యలను పరిష్కరించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ సంఘటనలు చోటు చేసుకున్నట్లు సి డబ్ల్యూ సి ఆరోపిస్తున్నది. ఇక ఆర్థిక సంక్షోభాన్ని పరిశీలించినట్లయితే పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజల జీవితాలకు ముప్పుగా పరిణమించినటువంటి ద్రవ్యోల్బణంతో ధరలు భారీగా పెరిగినట్లు దాని కారణంగా 74 శాతం మంది కనీసమైన పోషకాహారానికి దూరమైనట్లుగా సిడబ్ల్యుసి ఆందోళన వ్యక్తం చేసింది. పప్పుల ధరలు ఏడాదిలో 37% పెరగడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం విస్మరించిన కారణంగా నిరుద్యోగం తారాస్థాయికి చేరుకొని దేశంలోని 65 శాతం యువత భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లుగా తెలుస్తున్నది. బీసీ వర్గాలలో కుల గణనను నిరాకరించడం, బీసీ వర్గాలకు చట్టసభలలో రిజర్వేషన్ కోసం బిల్లును ఆమోదించకపోవడంతో ఇటీవల ఆమోదం పొందినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ వర్గాలకు ప్రాధాన్యత లేదని స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించదాన్ని బట్టి మెజారిటీ వర్గాలు ఏ రకంగా నిర్లక్ష్యాన్ని గురవుతున్నవో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆర్థిక అరాచకత్వాన్ని ఒకసారి పరిశీలిస్తే దేశంలోని 1% మంది సంపన్నుల చేతిలో 40 శాతం సంపద ఉంటే 50 శాతం గా ఉన్నటువంటి అత్యంత పేదల వద్ద కేవలం 3 శాతం సంపద ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన సిడబ్ల్యుసి ఆర్థిక అసమానతలు అంతరాలు వివక్షతకు ఇది ప్రత్యక్ష తార్కాణ ము కాదా? అని ప్రశ్నించింది. 3 సంవత్సరాలుగా జనాభా గణన వాయిదా వేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా 14 కోట్ల మంది ప్రజలు ఆహార భద్రతకు 18 శాతం ప్రజలు ఉపాధి హామీ పనులకు దూరమైనట్లు వెంటనే కుల గణన జనగణన చేయడం ద్వారా అర్హులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అవకాశాలను కల్పించాలని సి డబ్ల్యూ సి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నది. దేశంలో ఎన్నికల సంఘం పైన కేంద్రం నియంత్రణ కారణంగా స్వేచ్ఛగా నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయని, పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఉండకూడదని, ఈ ప్రభుత్వాన్ని మీడియా సభ్యులు ప్రజలు విమర్శించకూడదని భావిస్తున్న కేంద్రం ప్రతిపక్షాల పైన సిబిఐ, ఈడి దాడులకు పాల్పడడాన్ని ఏకపక్ష విధానంగా సిడబ్ల్యుసి భావించడం కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడకు నిదర్శనం కాదా!

తలసరి ఆదాయం మరింత పెరగాలన్న రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్:-

ప్రముఖ ఆర్థిక నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ హైదరాబాదులో ఒక సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ 19, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అంతర్గత పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించవలసిన అవసరం ఉందని సూచించారు. వృద్ధి రేట్ పెంచడం తొలి ప్రాధాన్యత అంశoగా ఉండాలని అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉన్నప్పటికీ తలసరి ఆదాయం విషయంలో 197 దేశాల్లో 142వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే విషయమని కేంద్రానికి చురకలoటించారు. క్రమం తప్పకుండా7 శాతం వృద్ధిరేటును సాధించినట్లయితే రెండు దశాబ్దాలలో మన ఆర్థిక వ్యవస్థ మెరుగు పడడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం మన ఆర్థిక కర్తవ్యాలను గుర్తింప చేస్తున్నది. కేవలం ఉద్యోగాల సృష్టి మాత్రమే కాకుండా ఉత్పత్తి ఎగుమతులు కూడా బలంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునప్పుడు మాత్రమే తలసరి ఆదాయం పెరుగుతుందని రంగరాజన్ చేసిన సూచన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న భారత వ్యవస్థకు ఎంతో దోహదపడుతుంది. ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు, మేధావుల సూచనలను పాటించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని పంతాలకు పట్టింపులకు పోకుండా బాధ్యతాయుతంగ వ్యవహరించడమే భారత అభివృద్ధికి గీటు రాయి అవుతుందని ఈ సందర్భంగా ఆశిద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading