ARTICLE'S
మానవీయ విలువలకు ప్రతీక కొండా లక్ష్మన్ బాపూజీ జీవితం


★నాటి తరం పోరాట స్ఫూర్తి, త్యాగాలు, దేశభక్తి నేటి తరం స్ఫూర్తి గా తీసుకోకపోతే ఎలా?
★చరిత్ర ద్వారా పొందే ప్రయోజనం నేటి తరంలో రావలసిన సామాజిక చింతన సాధించడమే
వడ్డేపల్లి మల్లేశము 9014206412 (జయంతి వ్యాసము)
జనం వెలుగు:- గతానికి వర్తమానానికి వారధి గా నిలిచి భవిష్యత్తు తరాలకు కూడా ప్రేరణగా నిలిచే సంఘటనల సమాహారము చరిత్రగా నిలిచిపోతుంది. తమ తమ కర్తవ్యాలు, బాధ్యతలు, త్యాగనిరతి, పోరాటపటిమ, పొందిన స్ఫూర్తి ఆధారంగా వ్యక్తులు శక్తులుగా మానవీయ విలువల కోసం జీవితాలను అర్పించిన చారిత్రక జీవులుగా చరిత్రలో నిలబడతారు. వాళ్లే రాబోయే తరాలకు కర్తవ్య నిర్వహణలో జాగరూకులుగా వ్యవహరించడానికి సామాజిక ధర్మాన్ని విస్మరించకుండా ఉండడానికి దోహదపడతారు. అయితే చరిత్రను చూసే కోణాన్ని, అనుకరించే ధోరణిని, చరిత్ర పట్ల సానుకూల వైఖరి, కలిగి ఉండే వ్యక్తిత్వాన్ని బట్టి చరిత్ర యొక్క ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. ఆ కోవలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసి, మానవ విలువలకు నిర్వచనం గా మిగిలి, తన జాతి కోసం అట్టడుగు వర్గాల ప్రయోజనం కోసం అంతిమంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి 97 సంవత్సరాల సుదీర్ఘ జీవన గమనములో ఎముకలు కొరికే చలిలో డిల్లి జంతర్ మంతర్ దగ్గర చివరిగా ధర్నా నిర్వహించి తన పోరాటపటమను మరొక్కసారి నేటి తరానికి రుజువు చేసిన తెలంగాణ ధన్యజీవి, తరతరాలకు తరగని సుగుణ ఖ ని కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం. కనీసం జయంతి వర్ధంతి రోజైనా తెలుసుకొని స్ఫూర్తిని పొంది మనుషులుగా మనం నిలబడకపోతే ప్రయోజనం ఏమిటి?
కొండా లక్ష్మణ్ జీవితంలోని కొన్ని ప్రత్యేకతలు:-
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఆనాటి ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర వినలేనిది .19 69 లో తొలి దశ పోరాటంలో విద్యార్థి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగిన తెలంగాణ పోరాటాన్ని కొత్తలు పుంతలు తొక్కించే క్రమంలో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డిని ధిక్కరించి తమ ప్రాంత ప్రయోజనాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేమని తెగేసి చెప్పి మంత్రి పదవిని కూడా త్యజిo చినటువంటి త్యాగశీలి మానవీయ విలువలను నేటితరం గుర్తించకపోతే మనం మనుషులుగా నిలబడగలమా? సమాంతరంగా కొనసాగిన స్వాతంత్ర్య, నిజాం పోరాటంతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన మూడు దశల ఉద్యమాలలోనూ అలుపెరగకుండా ముఖ్యపాత్ర పోషించి ఎక్కడిక క్కడ స్వార్థ రహితంగా దేశ సేవకు అంకితమై పోరాడిన బాపూజీ కల సా కారమైన వేల తెలంగాణను చూడకుండానే ఈ నేల నుండి నిష్క్రమించడం అత్యంత విచారకరం. ఉద్యమ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా పనిచేయడం నిజంగా వేరు వేరు అంశాలు కోణాలు. కానీ రెండు సందర్భాలలోనూ ప్రజా ప్రయోజనమే ధ్యేయంగా పనిచేయడమే ఆయన నిబద్ధత అంకిత భావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 1944 -48 మధ్యకాలంలో పాలకుర్తి చాకలి ఐలమ్మ విసునూరు రామచంద్రారెడ్డి దురాగతాలు, పాలకుర్తి ప్రాంత భూస్వాముల దాస్టీ కాలకు వ్యతిరేకంగా తను పండించిన పంటను అక్రమంగా దోచుకుపోయిన తరుణంలో ఆంధ్ర మహాసభ సహకారంతో సాగించిన పోరాటంలో చాకలి ఐలమ్మ దో షిగా మిగిలిపోతే ఆ కేసును ఆనాడు న్యాయవాదిగా ఉన్న కొండా లక్ష్మణ్ ఉచితంగా వాదించి భూస్వాముల వైపు నేరాన్ని రుజువు చేసినటువంటి సమర్థ న్యాయవాదిగా తెలంగాణ సాయుధ పోరాటంలో తన పాత్రను వీరోచితంగా నిర్వహించిన దీరునిగా కొండా లక్ష్మణ్ బాపూజీని గుర్తించవలసిన అవసరం చాలా ఉన్నది. ఆంగ్లేయుల కాలంలో గవర్నర్లు పోలీసు అధికారుల మీద ఉద్యమకారులు ఏరకంగానైతే బాంబుల వర్షం కురిపించినారో అలాగే నిజాం నవాబు పై కూడా 1947లో కింగ్ కోటి నుంచి బయటికి వచ్చిన సందర్భంలో బాంబులు విసిరిన సంఘటనలో కొండా లక్ష్మణ్ కూడా నిందితులుగా మిగిలిపోవడం తన పోరాట పటిమ కు నిదర్శనంగా చూడవలసి ఉంటుంది.
నాటి సమకాలిన అంశాలపై కొండా లక్ష్మన్ వైఖరులు:-
నిజాం పాలన నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించిన తర్వాత ఆనాటి రాజకీయ నాయకులు విశాలాంధ్ర ఏర్పాటును ప్రతిపాదించగా కొండా లక్ష్మణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దామోదరం సంజీవయ్య బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా కొనసాగిన తర్వాత సీఎం పదవి కోసం పీవీ నరసింహారావుతో పోరాడటానికి వెనుకాడని సమర్థ రాజకీయవేత్త ముఖ్యమంత్రి పదవి దక్కనందుకు గవర్నర్గా నియమిస్తామని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆశ చూపితే దాన్ని సున్నితంగా తిరస్కరించి తన వ్యక్తిత్వాన్ని స్వతంత్ర ఆలోచనలను అధిష్టానానికి ధైర్యంగా అందజేసిన స్వతంత్ర రాజకీయవేత్త. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సందర్భంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల డిమాండ్ మేరకు మంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన కొండా లక్ష్మన్ తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రజల అభిప్రాయానికి భిన్నంగా చెన్నారెడ్డి కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించినటువంటి మానవతావాది. మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో ముందు వరుసలో ఉన్నటువంటి ఆయన 2000 సంవత్సరంలో మలిదశ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించినప్పుడు ప్రోత్సహించడంతోపాటు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న తన నివాస బంగ్లా జలదృశ్యాన్ని టిఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి కాను కగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు . ఇందిరాపార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష, ఢిల్లీలో జంతర్ మంతర్ లో సత్యాగ్రహం చేయడంతో పాటు తెలంగాణ అంతట బస్సుయాత్ర చేపట్టి పాదయాత్రను కూడా వివిధ దశల్లో ముగించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మద్దతు ఇవ్వాలంటూ శాంతి చర్చల సందర్భంలో ఎందరికో విజ్ఞప్తి చేసి విభిన్న వర్గాల మద్దతు పొందినటువంటి మానవతావాది కొండా లక్ష్మన్. గౌరవ మర్యాదలు మాత్రమే కాదు హెచ్చరికలో కూడా ముందున్న ఆయన కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి వణుకు పుట్టిస్తామని ఎలుగెత్తి చాటిన కొండా 97 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబర్ 21న కన్నుమూసినా 1915 sep 27 న వాంకిడిలో జన్మించి ఈ నేలను పునీతం చేసినార నడంలో సందేహం లేదు. ప్రభుత్వాన్ని, ప్రజలను, ఆయన సేవచేసిన బహుజనులు, పద్మశాలీలు, కుల సంఘాలు, సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న వాళ్లెందరో నేడు ఆయనను స్మరిస్తూ స్ఫూర్తిని పొందుతూ ఉన్నారు. ప్రభుత్వం వారి చరిత్రను పాఠ్యాంశాలలో విధిగా చేర్చాలని నేటితరం యువత విద్యార్థులు స్ఫూర్తి పొంది భవిష్యత్తుకు వారసులుగా నిలవాలని ఈ సందర్భంగా ఆశిద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










