ARTICLE'S
ఇవి బీజేపీనీ భయపెడుతున్నాయి


ఇవి బీజేపీనీ భయపెడుతున్నాయి
జనంవెలుగు, తెలంగాణ:- నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడంతో, సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది. కనీసం కడుపునిండా తిండి తినే పరిస్థితి కూడా కనిపించడం లేదు. 2014లో బియ్యం కిలో 27 రూపాయలు ఉంటే ఇప్పుడు 52 రూపాయలకు పెరిగింది. ఉల్లిపాయలు రూ. 17 ఉంటే కొన్ని మహానగరాల్లో ఇప్పుడు 80కి చేరింది. గోధుమపిండి రూ. 22 ఉంటే ఇప్పుడు 60కి చేరింది. ఇలా ఉప్పు, పప్పు వంటివి సైతం పెరిగాయి. మొన్నటి వరకూ టమోటా ధరలు ‘మోత’ మోగించగా, ఇప్పుడు మార్కెట్లో ఉల్లిగడ్డ ధర కొండెక్కి కూర్చున్నాయి. గత నెలరోజుల వ్యవధిలో ఉల్లి ధర దాదాపు రెట్టింపు అయింది. దేశవ్యాప్తంగా సగటు ఉల్లి ధర 57 శాతం పెరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖకు, మార్కెట్ వ్యవస్థ మధ్య సమన్వయం లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులపై వాటి కొరతలపై సరైన అంచనాలు లేవు. మార్కెట్ ధరల పరిశోధన, అధ్యయనం శాస్త్రీయంగా లేవు. ప్రతిసారి మార్కెట్ అంచనాలు స్థిరంగా ఉండటం లేదు. కోలుకోలేని దెబ్బలకు విలవిల్లాడుతున్నారు. నిరు పేద మధ్యతరగతి ప్రజలపై ప్రతిరోజు ఏదో ఒక నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల భారం పడుతూనే ఉంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ 2014లో రూ.399 ఉంటే ఇప్పుడు రూ.955కి పెరిగింది, రూ.71, రూ.55గా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మోదీ పాలనలో ఏకంగా సెంచరీని దాటేసాయి. 2014 నుంచి ఇప్పటిదాకా బీజేపీ డీజిల్ పై 512 శాతం, పెట్రోల్‌పై 194 శాతం చొప్పున ఎక్సైజ్ పన్నులు పెంచేసింది. దీంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం జిమ్మిక్కులు మామూలుగా లేవు. సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రానున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలను కొంత మేర తగ్గించింది. బీజేపీ చేతలన్నీ కేవలం ఎన్నికల వ్యూహాలే తప్ప ప్రజల సంక్షేమంపై నిబద్ధత కానరాదు. ఎంతసేపు కార్పోరేట్లకు మేలు చేకూర్చడమే తప్ప సామాన్య ప్రజల అగచాట్లను ముఖ్యంగా పేదల మధ్యతరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగం, ఉపాధి కరువు దానితో పాటు ఈ ధరల పెరుగుదల పెను భారం మోసే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రానున్న ఎన్నికలలో అధికార పక్షానికి సరైన గుణపాఠం చెబుతారు. కల్లబొల్లి మాటలతో అన్నిసార్లు సామాన్య ప్రజలను బోల్తా కొట్టించలేరు. ప్రజలు తమ నిత్య జీవిత అనుభవాల నుండి చైతన్యం పొందుతారు. సుదీర్ఘ ఉపన్యాసాలకు, శుష్క వాగ్ధానాలకు, తాత్కాలిక తాయిలాలకు ఎంతో కాలం మోసపోరు. ఉదాహరణకు ఈ ఏడు ఖరీఫ్ పంట ఉత్పత్తి ఆలస్యం కావడంతో, ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, వినియోగదారులు వాపోతున్నారు. మరొకవైపు ధరలను నియంత్రించే పేరుతో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది. బియ్యం, గోధుమలు, చక్కెర తదితర పంటలు మన దేశంలో బాగా పండినప్పుడు కొరత ఉన్న రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతులపై నిషేధాలు, ఆంక్షలు విధిస్తుంది. దానితో మన రైతులకు తమ పంటలపై లాభాలు వచ్చే అవకాశాలను కోల్పోతున్నాడు. మన దేశాల ఎగుమతులపై విదేశాలు ఎక్కువ పన్నులను వసూలు చేస్తున్నాయి. ఆ విధంగా కూడా మన రైతులు నష్టపోతున్నారు. మన దగ్గర గోధుమలు, చక్కెర బాగా నిలువ ఉన్నప్పుడు అనాలోచితంగా అవే ఉత్పత్తులను రాయితీలు ఇచ్చి విదేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నారు. అప్పుడు విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరలకే మన ఉత్పత్తులను అమ్ముకొనే దుస్థితి మన రైతులకు దాపురించింది. ఈ ధరల పెరుగుదలతో కుటుంబ వ్యయం బాగా పెరుగుతుంది. నిత్యావసర ధరలతో ఒక సామాన్యుడి కుటుంబం తడిసి మోపెడు అవుతుంది. అంచనాలకు అందనంతగా ధరాఘాతంతో వారి బతుకులు అతలాకుతలం అవుతున్నాయి. ఓవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నా సామాన్యుడి ఆదాయం మాత్రం పెరగడం లేదు. కుటుంబానికి వస్తున్న నెలసరి ఆదాయానికి, ధరల పెరుగుదల కారణంగా అవుతున్న ఖర్చుకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










