Connect with us

Crime

అంతరాష్ట దొంగ ముఠా అరెస్ట్. ఛేదించిన నిర్మల్ పోలీసులు

janamvelugunews

Published

on

 జనం వెలుగు న్యూస్:-  బీరవెల్లి (MACTCS) సొసైటీ (Mutually aided co-operative thrift & credit society) దొంగతనం కేసులో అంతరాష్ట నిందితులు అరెస్ట్
దొంగలించిన డబ్బుల నుండి 6 లక్షల ఒక వంద యాబై (6,00,150/-) రూపాయలు నగదు స్వాదీనం.
నేరనికి ఉపయోగించిన కారు, సెల్ ఫోన్లు (2) నిందితుల నుండి స్వాదీనం.

MACTCS సొసైటీ (Mutually aided co-operative thrift & credit society ) ఆఫీస్ వెనుక కిటికీ గ్రిల్ ను తొలగించి 2 1/2 క్వింటాల్ గోద్రెజ్ (తిజోరి) లాకర్ ని డబ్బులతో సహా దొంగలించి న కేసు లో సొసైటీ ప్రెసిడెంట్ ఐన లక్కడి గంగ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంబించిన పోలీసులు. పోలీసులు, క్లుస్ టీం, డాగ్ స్క్వాడ్, ID పార్టీ పోలీసులు నేరస్తలం నుండి బౌతిక సాక్ష్యాలు సేకరించడం జరిగింది.
రైతులు వారి వ్యవసాయ అవసరాల గురించి స్వంచందంగా ఏర్పాటు చేసుకున్న పరస్పర సొసైటీ వారు కష్టార్జితంతో సoపాదించిన డబ్బులను సొసైటీలో ఉంచి సొసైటీ ద్వార తీసుకోని అవసరాలకు ఉపయోగించుకుంటారు, రైతులకు సంభందించిన డబ్బులను నిందితులు సాక్షలు దొరకకుండా CCTV కి చెందిన DVR ని దొంగలు ఎత్తుకేల్లినారు. జిల్లాలోనే సంచలనత్మకమైన దొంగతనముగా బావించి రైతుల డబ్బులను భారి ఎత్తున దొంగలు ఎత్తుకుపోవడంతో నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్ IPS.,  చాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితులలో ఈ కేసును చేదించి నిందితులను పట్టుకొని రైతులకు దొంగలించిన రైతుల సొమ్మును రికవరీ చేయవలసిందిగా నిర్మల్ డివిజన్ పోలీసులను ఆదేశించినారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేరస్తలాన్ని DSP నిర్మల్, నిర్మల్ డివిజన్ CIs, SIs, లు పరిశిలించినారు, ఈ నేరాన్ని శోధించడానికి నిర్మల్ రూరల్ CI, సొన్ CI, నిర్మల్ రూరల్ SI లు ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాట్లు చేయడం జరిగినది, ప్రత్యేక దర్యాప్తు బృందాలు దర్యాప్తులో తెల్చినది ఏమనగా అంతరాష్ట్ర దొంగలు కొందరు ఇచ్చిన పక్క సమాచారం మేరకు ఒక కారును ఉపయోగించి దొంగలు బీరవెల్లి గ్రామానికి వచ్చి సొసైటీ లో దొంగతనం చేద్దామని ఆరోజు తేది 10-11/10/2022 సాయంత్రం రెక్కి నిర్వహించి కిటికీ యొక్క గ్రిల్ తొలగించి అందులో వున్నా 2 ½ క్వింటాల్ల డబ్బులున్న తిజోరిని నలుగురు దొంగలు దానిని పైకి తీసి కిటికి ద్వారా బయటకు తీసుకవచ్చి కారు డిక్కీ లో తీసుకెళ్ళినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో దర్యాప్తు బృందాలు CC కేమెరాల ఆదారంగా కారు దొంగతనం జరిగిన తరువత వంజరు గ్రామము మీదుగా సారంగాపూర్ వచ్చి అక్కడి నుండి చించోలి X రోడ్, రాణాపూర్, రోల్ మామడ టోల్ ప్లాజా మీదుగా బోథ్ x రోడ్ కిన్వాట్ మీదుగా దహివాడి (మహారాష్ట్ర) గ్రామము, యవత్మాల్ జిల్లా వెళ్ళినట్లు 24 గం. ల వ్యవధిలోనే పోలీసులు తమ దర్యాప్తులో నిర్ణయించుకొని నిందితుల యొక్క పేర్లు వారి వివరాలు సేకరించినారు, కాని నిందితులు దొరకవద్దు అనే ఉద్దేశ్యం తో పరరైనందున నిర్మల్ పోలీసులు చాల కష్టపడి ఔరంగాబాద్, (మహారాష్ట్ర) యవత్మల్ నాందేడ్ జిల్లాలో తిరిగి దొంగల్ని పట్టుకరావడానికి ప్రత్యేక బృందాల ద్వారా ప్రయత్నం చేయడం జరిగినది. నిర్మల్ రూరల్ CI వెంకటేష్, సారంగాపూర్ SI కృష్ణ సాగర్ రెడ్డి, ఆధ్వర్యంలో ఈరోజు పక్క సమాచారం మేరకు సారంగాపూర్ మండలం కౌట్ల B, గ్రామము వద్ద వాహనాలు తానికి చేస్తుండగా కారు నెం. MH 02AU 6179 మారుతీ ఎస్టీం, కారులో ఐదుగురు వ్యక్తులు రావడం గమనించి వారిని చాకచక్యంగా కారును అడ్డగించి ఐదుగురు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారి పేర్లు దత్త రాథోడ్, రాజ్ పుల్, సంతోష్ రాథోడ్, సురేష్ ఆడే, ప్రకాష్ మడవ అని తెలిపి ఈరోజు మళ్ళి దొంగతనం చేస్తామని నేరము ఒప్పుకోని నిర్మల్ జిల్లా కు వస్తున్నట్లు నిందితులు ఒప్పుకోవడం జరిగినది.

నేరానికి పాల్పడిన విధానము

దత్త రాథోడ్, మడవి ప్రకాష్, ఇద్దరు మిత్రులు మహారాష్ట్ర కు చెందినా వారు, మడవి ప్రకాష్ కు హన్మంతు, కసావాకర్ చిన్న @ ఒడ్డె శీను మిత్రులు. ఒడ్డె శీను గత ఐదు సం.రాలుగా సారంగాపూర్ మండలం లోని బీరవెల్లి లో అద్దెకు ఉంటూ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు.బీరవెల్లి లో ట్రాక్టర్ నడిపేటప్పుడు రైతులతో పరిచయాలు ఉన్నందున MACTCS (Mutually aided co-operative thrift & credit society) సొసైటి ఆఫీస్ కు వెళ్తుండేవాడు. సొసైటికి వెళ్ళినప్పుడు అక్కడ వున్నా లాకర్ ను చూడడం అందులో ఐదు కోట్లకు పైగా డబ్బులు ఉంటాయని రైతుల ద్వారా తెలుసుకున్న ఒడ్డె శీనుకు వాటిని ఎలాగైనా దొంగాలించాలని నిర్ణయించుకొని తన మామ అయిన B.హన్మంతుకు ఇట్టి విషయం తెలియజేయగా వీరిద్దరు స్నేహితులకు మడవి ప్రకాష్, ఆడే సురేష్ లతో చర్చించగా అందుకు వారు కూడా ఒప్పుకొని తనకు తెలిసిని స్నేహితులతో చేర్చించినారు. వారితో పథక రచన చేసినారు వీరి పథకం ప్రకారము హన్మంతు, ఒడ్డె శీను, మడవి ప్రకాష్ లను పిలిపించుకొని 10 వ తేది నాడు బీరవెల్లి లో MACTH ( mutually aided thrift credit co-operative society) సొసైటి ఆఫీస్ యందు దొంగతనము ఏవిదంగా చేయాలనీ చర్చించుకోవడం జరిగినది. చర్చల ప్రకారం మహారాష్ట్ర లు చెందినా దత్త రాథోడ్ గ్యాంగ్ కు సమాచారము ఇచ్చి నిర్మల్ కు రమ్మనగా నిర్మల్ లో తను ఉన్న లొకేషన్ ను వారికి షేర్ చేయడం జరిగినది. వీరు ఇచ్చిన సమాచారం ప్రకారము దత్త రాథోడ్, హజిఫుల్, సంతోష్ రాథోడ్, సురేష్ ఆడే, ఎస్టీం కారులో ప్రకష్ చెప్పిన ప్రదేశం నాకు వచ్చిన తరువాత ప్రకాష్ తో పాటు హన్మంతు కుడా అక్కడే ఉండి దొంగతనము ఏవిధముగా చేయాలని చేర్చించుకోవడం జరిగింది. తరువాత ప్రకాష్ మిగితా నలుగురు వ్యక్తులతో పాటు కారులో బీరవెల్లి లి వెళ్లి MACTCS ఆఫీస్ లోనికి రహస్యంగా ప్రశిలించి దొంగతనం మధ్య రాత్రి చేయాలనీ అనుకోని అక్కడి నుండి వెళ్ళిపోయినారు. తరువాత 10.11/10/2022 ల మధ్య రాత్రి కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రకాష్ చూపించిన ఆఫీస్ వద్దకు వెళ్లి కిటికీ ఉన్న గ్రిల్ ను తొలగించి అందులోకి వెళ్లి లాకర్ ను తెచ్చి కారులో లాకర్ ను పెట్టి మహారాష్ట లోని యవత్మల్ జిల్లా దాహివాడి గ్రామానికి తీసుకేల్లినారు. అక్కడ వారి స్నేహితులైన ఎనుధర్ కుండలిక్ పవర్, సంతోష్ పవర్, మరియు వీరు నలుగురు పవర్ కట్టర్ లతో లాకర్ ను కట్ చేసి వచ్చిన డబ్బులను అందరు పంచుకొనగ వారు కొంత తమ అవసరాల నిమ్మితం క్కర్చు పెట్టుకొనగా మిగిలిన డబ్బులను ఈ క్రిందివిదంగా స్వాదీనం చేయడం జరగింది.
దత్త రాథోడ్ నుండి రూపాయలు 2,40,000/-
MD. రాజిఫుల్ నుండి రూపాయలు ,1,40,000/-
సంతోష్ రాథోడ్ నుండి రూపాయల 59,000/
సురేష్ ఆడే నుండి రూపాయలు 60,000/-
ప్రకాష్ మడవి నుండి రూపాయలు 51,150/-
ఎనుధర్ కుండలిక్ పవర్ నుండి రూపాయలు 25,000/-
సంతోష్ పవర్ నుండి రూపాయలు 25,000/- మొత్తం రూపాయలు 6,00,150/- లను, 2 సెల్ ఫోన్లు లను మరియు నిందితులు ఉపయోగించిన కారు ను స్వాదీనం చేసుకోవడం జరిగింది.
అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు:
1: దత్త రాథోడ్ s/o హిరామాన్ రాతోడ్, వృత్తి: కూలీ, ని: మహదాపూర్ పోస్ట్, ఇవలేశ్వర్
తాలూకా, నాందేడ్ జిల్లా మహారాష్ట్ర
2. MD, రాజిఫుల్ s/o MD, రహీం, వృత్తి: కూలీ, ని: పరంపూర్ టౌన్, బిఘోర్ హట్,
కతియార్ జిల్లా, భిహర్
3. సంతోష్ రాథోడ్ s/o కైలాష్ రాథోడ్ , వృత్తి: ప్రైవేటు కంపెనీ వర్కర్, ని: గుండవాల్,
మహోర్ తాలూకా, నాందేడ్ జిల్లా మహారాష్ట్ర.
4. సురేష్ ఆడే. s/o మోహన్ ఆడే , వృత్తి: కూలీ, ని: మహదాపూర్ పోస్ట్, ఇవలేశ్వర్
తాలూకా, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర
5. ప్రకాష్ మడవి s/o మారుతీ రావు మడవి, వృత్తి: బిజినెస్, ని: గొన్ కెడ పోస్ట్, కోపర
తాలూకా, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర
6. ఎనుధర్ కుండలిక్ పవర్ s/o కుండలిక్ పవర్, వృత్తి: కూలీ, ని: దాహివాడ ఖుర్ద్, మహా
గావ్ తాలూకా, యావత్మల్ జిల్లా, మహారాష్ట్ర
7. సంతోష్ కుండలిక్ పవర్ @ సోను పవర్ s/o సంతోష్ పవర్, వృత్తి: కూలీ, ని:
దాహివాడ ఖుర్ద్, మహా గావ్ తాలూకా, యావత్మల్ జిల్లా, మహారాష్ట్ర


పరారిలో ఉన్న నిందితుల వివరాలు:
1. B. హన్మంతు s/o దేవకార్, ని: బొదిడి, కిన్వాట్ తాలూకా, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర
2. కసావాకర్ చిన్న @ ఒడ్డె శ్రీను s/o బాపు రావు, వృ: ట్రాక్టర్ డ్రైవర్ ని: దివిసి ఖుర్ద్ భోకర్
తాలూకా, నాందేడ్ జిల్లా

ఇట్టి కేసును నిర్మల్ DSP ఆద్వర్యంలో త్వరితగతిన చేదించిన నిర్మల్ రూరల్ CI వెంకటేష్, సోన్ CI రాంనర్సింహ రెడ్డి, ఎస్ఐలు చంద్రమోహన్, కృష్ణ సాగర్ రెడ్డి, గంగాధర్, గీత, ASI- సిరాజ్, HC- రవీంద్ర రెడ్డి, PCs మనోజ్, వర్మ, సునీల్ లను జిల్లా ఎస్పీ  అబినందించినారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

janamvelugunews

Published

on

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రూ.11.10 లక్షల జరిమానా విధింపు – 9 మందికి జైలు శిక్ష

జనం వెలుగు, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గడిచిన వారం రోజుల్లో 138 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.

తేదీ 25-05-2026 నుండి 30-05-2026 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 138 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 9 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.11,10,000 జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

పోలీస్ కమిషనర్ సూచనలు:

• మద్యం సేవించి వాహనాలు నడపరాదు.

• వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలి.

• డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడుతుంది.

• మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా ప్రయోజనాలు లభించవు.

• మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

• ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది.

మోటార్ వెహికల్ యాక్ట్–1988 సవరణ చట్టం–2019 ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చని, రెండోసారి పట్టుబడితే రూ.15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు.

Continue Reading

Crime

|crimenews నందిపేట మండల కేంద్రంలో చోరీ….

janamvelugunews

Published

on

నందిపేట మండల కేంద్రంలో చోరీ….

పొద్దున పొద్దున్నే 10 తులాల బంగారం రెండు లక్షల నగదు అపహరణం….

కట్ట పనికి వెళ్లొచ్చే సరికే కానిచ్చేశారు..

నందిపేట్ మే 28 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర నాగమంతెన సంఘం దగ్గర కాలనీలో నివాసం ఉంటున్న నడ్కుడ రాధా ఇంట్లో చోరీ జరిగింది.

   బుధవారం సుమారు ఉదయం 7- 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సుమారు 10 తులాల వరకు బంగారం 2 లక్షల రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నడ్కుడ రాధ భర్త చనిపోయి చాలా రోజులవుతుంది, తన తల్లి కొడుకుతో నాగ మంతెన సంఘం వద్దగల కాలనీలో నివాసం ఉంటుంది.

    అయితే బుధవారం ఉదయం కట్ట పనికొరకంటూ కొడుకు బండిమీద వెళ్ళింది. కాసేపటికి రాదను దింపేసి రాజు ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్లీ యధావిధిగా పొలం పనికి వెళ్ళాడు. వృద్ధురాలైన రాధాత తల్లి ఇంట్లో ఒక్కతే ఉంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో తల్లి కొడుకులు ఇద్దరు ఇంటికి వచ్చారు. వీరు నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి గురించి చర్చించుకొని మేస్త్రి డబ్బులు కట్టమన్నాడని,

   మేస్త్రీకి డబ్బులు ఇచ్చేందుకు బీరువాలో ఉన్న నగదును చూసుకునేందుకు బీరువా దగ్గరికి వెళ్లగా బీరువా తాళం చేయి కనిపించలేదు. అనుమానం వచ్చి ఒకరికొకరు వాకబు చేసుకున గా బీరువా తాళం చేయి కనిపించే పోయేసరికి బీరువాతాలాన్ని పగలగొట్టి చూడడంతో అందులో ఉన్న బంగారం నగదు కనిపించక పోయేసరికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

   మా అమ్మ నేను బయటకెళ్ళిచ్చేసరికి మా అమ్మమ్మను పక్కింటి వ్యక్తి ఒకరు బయటకు తీసుకెళ్లడం జరిగిందని, ఆ వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు నడ్కుడ రాజు. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Crime

|crimenews మంటగలిసిన మాతృత్వం 

janamvelugunews

Published

on

మంటగలిసిన మాతృత్వం 

ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం 

నందిపేట్ మే 24 జనం వెలుగు: మాతృత్వం మంట కలిసింది.. ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ రెహిమానియా మజీద్ ప్రాంతం

హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా మండుటెండలో విసిరేసి వెళ్లడం జరిగింది. వివరాల్లోకి వెళితే మెయిన్ రోడ్డు లో గల పాత హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో పసికందును ఘర్కశంగా విసిరేశారు.

స్థానిక చిన్నపిల్లలు క్రికెట్ ఆడదామని గేటు పైనుంచి ఆ నిర్మాణస్య ప్రాంతంలో వెళ్లేసరికే అక్కడ ఒక పసి గుడ్డు ఏడుపులు విని వెంటనే అసిఫాన్ అనే బాలుడు వాళ్ళ అమ్మ నాన్నకు తెలపడంతో వెంటనే వాళ్లు ఆ పసి గుడ్డును హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది.

అయినా పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో ఆ పసి గుడ్డు మరణించడం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆడపిల్ల అనే నెపంతోనో.. లేదా అక్రమ సంబంధమో..

తెలియదు కానీ అభం శుభం తెలియని ఆ చిన్నారిని మండుటెండలో విశ్రేయడం మాతృత్వానికే మచ్చ అని ఇటువంటి చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Continue Reading