నిజామాబాద్
మహతి రమేష్ దారెటు?


బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌనం యొక్క అర్థం ఏంటి?
పార్టీలో కొనసాగుతారో.. పార్టీ మారుతారో అని ప్రజల ఎదురుచూపు..
బి ఎస్ పి నాయకుడు మహతి రమేష్
జనం వెలుగు, నిజామాబాద్:- ప్రజానాయకుడిగా, సౌమ్యుడిగా ఆర్ముర్ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకొని బి ఎస్ పి పార్టీ రాష్ట్ర ప్రధన కార్యదర్శిగా ఎదిగిన ఆయన ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఉండడం పట్ల ఆయన అనుచరులు అయోమయంలో పడ్డారు. 70 మంది బి సి లను అసెంబ్లీ కు పంపలనే నినాదంతో తెలంగాణ లో చాప క్రింద నీరులా రాష్టం అంత వ్యాపిస్తున్న బి ఎస్ పి యొక్క ప్రధాన కార్యదర్శి అయిన మహతి రమేష్ సైలెంట్ గా ఉండడం పట్ల రాజకీయ విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు.
గత ఎన్నికల నుండి క్రియాశీలకంగా
గత శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి నియోజక వర్గంలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆయనకు ఆర్ముర్ నియోజక వర్గ ము పై దృష్టి పడింది. ఆ సమయం లో సిట్టింగ్ ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చే నాయకుల కొరత ఉన్న విషయాన్ని గ్రహించి తనకు ఆర్ముర్ లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని నిజామాబాద్ అర్బన్ ను వదలి ఆర్ముర్ కు మకాం మార్చి ఆర్ముర్ నియోజక వర్గంపై పూర్తి స్థాయి దృష్టి సారించి ప్రతిరోజు ఓ మారుమూల గ్రామం వెళ్లి అంబేద్కర్, కాన్సిరం, బి ఎస్ పి భావజాలాను ప్రజలకు అవగాహన కల్పించి స్థానిక సమస్యల పై వెంటది వెంట గళం విప్పారు అయితే తాజా పరిణామాలతో సందిగ్ధంలో పడిపోయారు. సుదీర్ఘకాలంగా బి ఎస్ పి పార్టీలో ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్న మహతి ఆర్ముర్ నియోజక వర్గ టికెట్ ఆశిస్తున్నారు.
పోరాట పటిమ
ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం దత్తాపూర్ గ్రామ దళితుల సమస్య విషయంలో ముందుండి పోరాటాన్ని జరిపారు, అదేవిధంగా నందిపేట మండలం తల్వేద గ్రామంలో డబుల్ బెడ్రూంలు కావాలని గ్రామ ప్రజలు నిరావధిక ధర్నా చేసినప్పుడు గ్రామములో పర్యటించి పేదల గుడిసెలు చూయిస్తూ ” ఇవేనా ఎం ఎల్ ఏ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ లు ” అని సూటిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రశ్నించి వార్తలలో ఎక్కారు. నిజామాబాదు జిల్లా నుండి గల్ఫ్ కార్మికులు ఎక్కువగా వలసలు పోతారు కాబట్టి వారి సమస్య లను దేశం దృష్టిలో పడే విధంగా గల్ఫ్ కోఆర్డినేటర్ హోదాలో దుబాయ్ లో గల్ఫ్ కార్మికుల అలాయ్ బలయ్ అనే కార్యక్రమం ద్వారా ఆర్ ఎస్ పి తో భరోసా ఇప్పంచడం లో కీలక పాత్ర పోషించారు. ఇలా ఎన్నో సమస్యల పై కమ్యూనిస్ట్ పార్టీల మాదిరి రోజు ఎదో ఒక సమస్య పైన గళం విప్పే మహతి ఎక్కడ అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
బి ఎస్ పి అంటే బహుజనుల పార్టీగా ప్రయత్నం
బీసీ ల ఆత్మ గౌరవ సభను ఆర్మూయ్ లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఓక బీసీ లీడర్ గా బీసీ లకు ఓక నమ్మకం కల్పించాదమే కాకుండా బి ఎస్ పి అంటే దళితులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించే పార్టీగా ఉన్న చేరిపేసి బి ఏస్ పి అంటే బహుజనుల పార్టీ అని బి ఎస్ పి ద్వారనే బి సి లకు మైనారిటీలకు న్యాయం జరుగుతుందని అని ప్రజలలో నమ్మకం కలిగించడంలో సఫలీకృతం అయ్యారు.
పార్టీ కి అన్ని తానై
జిల్లాలో బి ఎస్ పి పార్టీని ఇంటి ఇంటికి పరిచయం చేసిన ఆయన ఇంటినే పార్టీ కార్యాలయంగా, తన వాహనాన్ని పార్టీ వాహనంగా మార్చి తన కారుకు ఏనుగు గుర్తు పెట్టుకొని పార్టీ కార్యక్రమాలకు లక్షల రూపాయలు ఖర్చు చేసిన పార్టీ నాయకత్వం ఆయన సేవలను వాడుకోకుండ కొత్తగా వచ్చిన వారిని వత్తాసు పలకడం ఏంటని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్ ఎస్ పి ఏకపక్ష నిర్ణయాలే కారణమా?
బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ పి ఏక పక్ష నిర్ణయాలతో పార్టీకి డ్యామేజి చేస్తున్నారని కొందరు అంటున్నారు, ప్రధాన కార్యదర్శి పదవికి ప్రోటో కాల్ ప్రకారం ప్రతి విషయాన్ని తెలియపరచి ఉంటుంది కానీ ఆర్ ఎస్ పి తన స్వైరో టీమ్ వారికి మాత్రం వివరాలు చెప్తున్నారని అందుకే గౌరవం లేని చోట సైలెంట్ గా ఉండడమే ఉత్తమము అని పెరు చెప్పడానికి ఇష్టపడని బి ఎస్ పి నాయకుడు అన్నారు.
నిర్ణయం కొరకు సన్నిహితుల ఎదురు చూపు
పార్టీ కొరకు ఎన్నో త్యాగాలు చేసి తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వదిలేసి గత 5 సంవస్తరాలుగా పార్టీ కొరకు సర్వాన్ని ధారపోసిన మహతికి ఇప్పుడు పార్టీలో వున్నా ఇబ్బంది కర పరిస్థితి లో ఇలాగే సైలెంట్ ఉంటారా? లేక జిల్లాలోని ఆర్బన్ లేదా ఆర్ముర్ టికెట్ తీసుకుని పోటీ చేస్తారా? పార్టీకి వీడ్కోలు చెప్పి వేరె పార్టీలో జాయిన్ అవుతారో ? అని నిజామాబాదు అర్బన్, ఆర్మూర్ ప్రజలు, కార్యకర్తలు మహతి రమేష్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
నిజామాబాద్
మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు


మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
జనంవెలుగు, ఆర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ పరిధి లో గల శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం పురస్కరించు కొని శ్రీ నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి శ్రీసుబ్రహ్మణ్యం శ్రీ అయ్యప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం, మధ్యాహ్నం 12.30 నిముషాలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడినది.
మణికంఠ సేవా సమితి అధ్యక్షులు: చెపూర్ ధనుంజయ్
ఈ సందర్భంగా మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు దనంజయ్ మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమానికి వి. అయ్యప్ప శ్రీనివాస్ అయ్యప్ప ఆలయం నిర్మాణ కర్త సహాయ సహకారం అందిస్తున్నందుకు నవనాథ సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ దాతలకు . పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ మణికంఠుడు యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగా మోహన్, కార్యవర్గ సభ్యులు ఒడ్డేన్న, సలహదారులు శ్రీహరి, నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులు దత్తు గురు స్వామి, కొండవీటి శ్యామ్ గురు స్వామి, మోహన్ రావు గురు స్వామి, గ్యాస్ ప్రభాకర్ గురు స్వామి,నవీన్ రెడ్డి గురు స్వామి, నర్సారెడ్డి గురు స్వామి గోవింద్ పేట్, అయ్యప్ప భక్తులకు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు
నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.








