Crime
ఆగని ఇసుక దందా


సీసీ కెమెరాల సాక్షిగా అక్రమంగా ఇసుక రవాణా
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న అధికారులు
అధికారులకు మామూళ్ళు ముట్టజెప్తున్నారనే ఆరోపణలు
జనం వెలుగు, రాజశేఖర్ బోధన్:- ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం, సాలూరు మండల సరిహద్దు ప్రాంతంలో ఉన్న మంజీరా సరిహద్దు గ్రామాల నుంచి ప్రతి రోజు అధికలోడుతో ప్రత్యేక వాహనాలలో ఇసుక భారీగా తరులుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు వీటిపై దృష్టి పెట్టకుండా పోగా వారు ఇచ్చే మాముల మత్తులో మునుగుతున్నారని అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాలురా మండలం హున్సా, మందర్నా, తగ్గేల్లితో పాటు పలు గ్రామాల నుంచి ప్రతిరోజు ప్రత్యేక వాహనాలు ఇసుకను అధిక లోడుతో తరలిస్తున్నారు. భారీగా ఇసుక అవసరం ఉన్నవారికి ఇసుక మాఫియాదారులు ఇసుకను తరలిస్తూ అధిక రేటుతో విక్రయాలు చేస్తూ ఇసుక మాఫిదారులు భారీగా సొమ్ము చేసుకుంటూ ఇసుక అవసరం ఉన్నవారి జేబులను కొల్లగొడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోధన్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు సాక్షిగా ప్రతిరోజు పగలు, రాత్రి అనే తేడా లేకుండా, ఎలాంటి వే బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న కూడా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా రవాణా చేసేటప్పుడు రిపోర్టర్లు ఫోటోలు తీస్తుండగా, ట్రాక్టర్ డ్రైవర్లు రిపోర్టర్ల ఫోటోలను తీసి బడా నాయకులకు పంపిస్తున్నారని, అక్రమంగా తరలిస్తున్న ఇసుక వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారబలంతో సంబంధిత అధికారులను శాసిస్తున్నారు. అనాధికారికంగా ఇసుక తరలిస్తున్నారని తెలిసి రెక్కీ నిర్వహించి పట్టుకున్న పది నిమిషాల్లోనే ఆ ట్రాక్టర్ తమకు సంబంధించిన వ్యక్తిది వదిలేయ్ అని మండల నాయ కుల నుండి ఫోన్లు మోతమోగుతాయి. ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కూడా అధికారులు పట్టించుకోవడంలేదంటూ ఒకవేళ అధికారులకు ముడుపులు ముట్ట జేప్తున్నారనే ఆరోపణలు సైతం గుప్పుమంటున్నాయి. దీంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఇసుక దాందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








