వ్యాసాలు
ఆట మాట పాట రచన,కళా రంగాల్లో పనిచేసేది బీసీలు బహుజనులే
వడ్డేపల్లి మల్లేశము 9014206412
జనం వెలుగు న్యూస్, వెబ్ డెస్క్:- సొమ్మొకడిది సోకొకడిది మాదిరిగా కాయకష్టం చేసి ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వాములై సంపదను పెంచి పోషించేది సామాన్య ప్రజలు కార్మికులు బీసీలు బహుజనులు అయితే ఆ సంపదను అనుభవించేది మాత్రం సంపన్న వర్గాలు ఆధిపత్య కులాలు అనేది నగ్నసత్యం . చాకిరీ చేసి ఉత్పత్తులు పెంచి శ్రమను ధారపోసి పంట పండించి ఇంటికి చేర్చిన కౌలు రైతు లేక పాలేరు లేదా సబ్బండ వర్గాలకు చెందిన వారిని ఉన్నత వర్గాలు గౌరవిస్తున్నాయా ఆదరిస్తున్నాయా ఇంట్లోకి కనీసం రాణిస్తున్నాయా ఒక్కసారి అర్థం చేసుకోవలసిన అవసరం బహుజనుల పైన చాలా ఉన్నది భుజం మీద చేయి వేసి మర్యాదగా మాట్లాడి నమ్మబలికి శ్రమను దోచుకోవడానికి సిద్ధపడినటువంటి వాళ్లతోనే బహుజనులకు ఎప్పుడూ నష్టమే ఇబ్బంది అవమానాలు . ఆరుగాలము శ్రమించి ఉత్పత్తులను ఇంటికి చేర్చినప్పటి వరకే విలువ ఆ తర్వాత పిలుపులో ఆదరణలో ఆచరణలో చూపులో వివక్షత దోపిడీ క్రీడలకు గురి కావడమే మనం మన అనుభవంలో చూస్తున్న సంఘటనలు . శ్రమ చేసే తత్వం గౌరవించే సుగుణం కలుపుగోలుతనం సేవ చేసే ఉన్నత మనసు నిలువెల్లా ఉన్నప్పటికీ మాయదారి మోసపు లక్షణాలను కనిపెట్టకుండా బతికినంత కాలం బహుజనులకు ఈ అవమానాలు ఇబ్బందులు తప్పవు. ఏ విషయంలోనూ వెనుకకు పోకుండా మనిషిని మనిషిగా చూసి ఆదరించి తన నోట్లోకి బుక్కడి మెతుకులు లేకపోయినా ఇతరుల కోసం ఆరాటపడే బహుజనుల మీద ఆధిపత్యం చెలాయించడమే తెలిసిన కొన్ని వర్గాలు ఇప్పటికీ ఉక్కు పాదం మోపడానికి నిర్బంధము కొనసాగించడానికి బానిసలుగా చూడడానికి యాచకులుగా గుర్తించడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు సంపన్న వర్గాలు ఆధిపత్య వర్గాల ఈ ధమను ఇతని ప్రశ్నించి ప్రకటించి నిలదీయకుండా ఉన్నంతకాలం ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ఆధిపత్య కులాల నాయకత్వంలోని పార్టీలకు బహుజనులు చేస్తున్న సేవ అపారమైనది ఒక్కడు మెతుకుల కోసం సీసా మందు కోసం 100, 200 రూపాయల కోసం చెప్పినట్టు చేయడానికి ఎదురు తిరగకుండా అప్పగించిన పనులను చేసి చూపడానికి అలవాటు పడిన వారి విధానములో భవిష్యత్తులో పెను మార్పులు రావలసిన అవసరం చాలా ఉన్నది అప్పుడు మాత్రమే బహుజనులు బీసీ వర్గాలు స్వతంత్ర జీవితం గడిపి తమ ఆధిపత్యాన్ని కొనసాగించే ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవకాశం ఉంటుంది.
ఆట, పాట, రచనలో కళా రంగాలలో మనవాళ్లే కదా :-
డబ్బు డోలు ఆట ఆట మాట రచన వేషము అన్ని కళారూపాలలోనూ పనిచేస్తున్న వర్గం ఎవరో నిజాయితీగా ప్రశ్నించుకోవడం నేర్చుకోవాలి . తెలంగాణ ఉద్యమ కాలంలోనూ గతంలో తెలంగాణ సాయుధ పోరాటంలోనూ అంతకు ముందు జరిగినటువంటి స్వతంత్ర పోరాటంలో కూడా అట్టడుగు వర్గానికి చెందినటువంటి బహుజనులు పోషించిన పాత్ర కీలకమైనది ప్రజలను ప్రజాస్వామిక వాదులను చైతన్యము చేసి ఆలోచన మొక్కలను చేసినటువంటి ఘనత ఆ వర్గాలకే దక్కింది అది ఆటపాట కళారూపాల ద్వారా. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత పరిపాలన లోకి వచ్చిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన కుటుంబం స్వాతంత్ర పోరాటము తర్వాత స్వతంత్ర భారత ప్రధానిగా ఇతర పదవుల్లో నిలబడ్డ వాళ్ళు అంతా సంపన్న వర్గాలే కదా ఆట పాట మాట కళారూపాలలో రచనలు చైతన్య శిల్పంలో ఉన్నత వర్గాలకు సంపన్న కుటుంబాలకు పాత్ర చాలా తక్కువ అని గతాన్ని అనుభవాల ద్వారా ఆలోచించినప్పుడు తెలుస్తుంది . చచ్చినా బతికినా పండుగ పద్మం ప్రతి సందర్భములోనూ డప్పు ముగించి సన్నాయి ఊది కళారూపాలను ప్రదర్శించు ఉన్నత వర్గాలకు సేవ చేసి అడుగులకు మడుగులోకి తృప్తి చేసి ఇచ్చిన డబ్బుకు ఆశపడి అమ్ముడుపోతున్నటువంటి బహుజనలారా ఇకనైనా కళ్ళు తెరవండి. మీరు లేకుంటే వ్యవస్థ లేదు మీరు నటించకుంటే నాట్యం లేదు రాయకుంటే రచన లేదు పాడ కుంటే పాట లేదు. అందుకే మన సత్తా ఏమిటో గుర్తించాలి చాకిరి విధానము నుండి బయటపడాలి బానిసత్వం నుండి బతుకుదెరువు నేర్చుకోవాలి. ఆధిపత్యం పేరుతో అగ్రవర్ణాలు అనే అహంకారంతో వీర్రవీగుతున్నటువంటి కొన్ని సామాజిక వర్గాలకు ఓట్ల సమయంలోను ఇతరత్రా అన్నివేళలా ప్రతి చోట మన సత్తాను చూపడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం కావాలి .
మీరు లేకుంటే వారి బతికే లేదు:-
ఓదార్చడానికి నెట్టూర్చడానికి తోడుగా ధైర్యాన్ని ఇవ్వడానికి సర్ ఇది చెప్పడానికి సమస్యలు పరిష్కరించడానికి బల ప్రదర్శన చేసి కష్టాలను తీర్చడానికి సంపదను దోచిపెట్టడానికి మీరు చేస్తున్న కృషి వారిని ఏ ఆకాశానికి ఎత్తినదో ఒక్కసారి అర్థం చేసుకుంటే తెలుస్తుంది కుల పరంగా ఆర్థికంగా ఆధిపత్యంలో చదువులో అవకాశాలలో ఆచరణలో సంపదలో వారిని ముందు వరసలో నిలిపి మిమ్ములను వెనుక బడేయడానికి మీ లోపం ఏమిటి వారి నైపుణ్యం విజ్ఞత ఏమిటి వారి కుండీ మీకు లేనిదే ఏమిటి వారికున్నది ధైర్యం ఆత్మ విశ్వాసం ఆధిపత్యం ప్రదర్శించడం మీకున్నది బానిస మనస్తత్వంతో యాచక ప్రవృత్తితో బుజ్జగించే ధోరణితో పాదాలకు దండం పెట్టి వంగి వంగి సలాం చేసి వాళ్ల సహవాసం కోసం సోపతి కోసం ఆరాటపాడమే తప్ప మీ తప్పు వేరే ఏమీ లేదు బలహీనతలను ఆసరాగా చేసుకున్న వాళ్లు జీవితాంతం వారి చెరలో బంధి కావడానికి మిమ్ములను దాసోహం చేసుకుంటున్నారు విడిచిపెట్టి ఉండ లేకుండా మార్చుతున్నారు పరాన్న జీవులుగా మిమ్మలను తయారు చేస్తున్నారు అందుకేనా మీ జీవితాలను నైపుణ్యాన్ని కలలను ప్రదర్శించేది . గుట్ట కాడ చెట్టు కాడ పుట్ట కాడ లొట్టి కాడ మట్టి కాడ కట్ట కాడ ఆటకాడ పాట కాడ ఆనందం కాడ సర్వ అవస్థలలో కూడా మీ చాకిరీ వాళ్లకు వేల రెట్లు ఉపయోగపడినది దాని పర్యవసానమే వారిని ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు అనడం పరిపాటి అయినవి మిమ్ములను నిమ్న కులాలు నీచవర్గాలు బానిసలు యాచకులు వెనుకబడిన వర్గాలు అనే విధంగా నమ్మబలికి అగ్ర బాగాన ఉన్నా అధికారానికి దూరంగా అనుభవించే అవకాశం లేకుండా దోచి పెట్టడానికి సేవ చేయడానికి మాత్రమే పరిమితమైనటువంటి దుస్థితి నుండి బయటపడాల్సినటువంటి అవసరం నిండుగా ఉన్నది . ఇప్పటికైనా సోయి తెచ్చుకోకపోతే మిమ్ములను మోసగించిన వర్గాలను ప్రతిఘటించి ప్రశ్నించకపోతే మిమ్ములను ఎవరూ రక్షించలేరు. అందుకే అంబేద్కర్ గారు ఒక సందర్భంలో “ఓటు హక్కు అనే ఆయుధాన్ని దేశ ప్రజలందరికీ సమానంగా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో అన్ని వర్గాలకు ఒకటే ఓటు హక్కు మోసగించే వర్గాల చేతిలో బలికాకుండా ఓటు ద్వారా రాజ్యాధికారానికి చేరువయి చైతన్యాన్ని పొంది ఈ దేశాన్ని ఏలుకోవాల్సిన బాధ్యత మీకు అప్పజెప్తున్నాను బానిసలుగా పడి ఉంటారా? ఆధిపత్యం చలాయించి చట్టసభల్లో నిలబడతారా? నిర్ణయించుకోవాల్సింది మీరే అని అగ్ర భాగంలో ఉన్నటువంటి బహుజన సామాజిక వర్గాలను హెచ్చరించడం జరిగింది.1 ఈ హెచ్చరిక చేసే 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేడు భారతదేశంలో ముఖ్యంగా ఓట్ల పండుగ నిరంతరము కొనసాగే తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు ముఖ్యంగా బీసీ వర్గాలు ఎలాంటి అధికారానికి నోచుకోకుండా చట్టపరమైన అవకాశాలు లేకుండా తమ బానిస జీవితాన్ని కొనసాగిస్తూ యాచకులు గానే బ్రతకడాన్ని సహించలేనటువంటి ప్రజాస్వామ్యవాదులు మీ పక్షాన నిలబడుతున్నారు. మిమ్ములను చైతన్య శీలురుగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పటిదాకా చేసిన లోపాలను, జరిగిన వైఫల్యాలను , ప్రదర్శించిన బానిస మనస్తత్వాన్ని, చాకిరీ చేసిన సేవా దృక్పథాన్ని ఇతరుల కోసం కాకుండా మీకోసం కేటాయించండి. ఈ దేశంలో తిరుగులేని శక్తిగా తయారై రాజ్యాధికారం మీ చేరువలోకి వస్తే చట్టసభల్లో మీదే రాజ్యం అధికారం ఆధిపత్యం అంతా మీదే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లే అధికారం ఆధిపత్యాన్ని అడ్డుపెట్టి బహుజనుల యొక్క రాజ్యాధికారాన్ని ఏ వర్గాలు కూడా నియంత్రించలేవు అనే విషయాన్ని మనం గుర్తించడం చాలా అవసరం. మునుగోడు లో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా మెజారిటీగా ప్రచారంలో పాల్గొంటున్న వాళ్లంతా బహుజనులే ఏ ఫలితం ఆశించి ఏ చైతన్యం కోసం ఏ హక్కుల కోసం ఆధిపత్య కులాల వెంట పరిగెత్తుతున్నారో ఇప్పటికీ బహుజనులకు అర్థం కావడం లేదు. నైపుణ్యం కళ ఆలోచన మేధస్సు శాస్త్ర విజ్ఞానం విశ్లేషణ చారిత్రక దృక్పథం సామాజిక చింతన ఇ న్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి బహుజనులు ఎందుకు బానిసలుగా పరాన్న జీవులుగా బతుకుతున్నారో ఒక్కసారి ప్రశ్నించుకుంటే అగ్ని పర్వతం బద్దలై ఆకాశానికి లావా తగిలి బహుజనల శక్తి ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తమవుతుంది . అప్పుడు ఇంత కాలంగా అధిపత్యాన్ని చలాయించి బానిసలుగా చూసిన ఆ వర్గం తోక ముడుచుకుని పారిపోతుంది. సమానత్వాన్ని, సాధికారతను, శ్రేయస్సును, స్నేహ భావాన్ని, సహజంగా గుర్తించే బహుజనుల ఓపికను ఆధిపత్య కులాలు ఇప్పటికైనా పరీక్షించకుండా వారి చైతన్యానికి ఆహ్వానం పలికితే సమ సమాజం ఆవిష్కృతమవుతుంది. అంతరాలు అసమానతలు లేనటువంటి మెరుగైన సమాజాన్ని చేరుకోవడానికి ఇదే తగిన సమయం. ఎన్నికల సందర్భంలో మన ప్రతిష్ట పరువు జ్ఞానముతో వారిని ముందు వరుసలో నిలబెట్టడాన్ని ఇకనైనా మానుకొని వారికి తగిన గుణపాఠం నేర్పడమే మనం తక్షణం చేయాల్సిన పని బహుజనులారా! మీరు అల్ప సంఖ్యాకుల వైపా? మెజారిటీ ప్రజల వైపా? శ్రమను దోచే వర్గానికా? శ్రమను గుర్తించే వర్గానికా? మీ మద్దతు తేల్చుకోండి .ఆసన్నమైన అవకాశాలు సమయాన్ని సందర్భాన్ని పుక్కిటపట్టి స్వతంత్ర జీవితం వైపు పరిగెత్తాలి. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను వర్ధిల్లేలా చూడాలి . ఇది బహుజనుల పరంగా ఉదృ తంగా కొనసాగాలి .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
ARTICLE'S
భూమి, భుక్తి, విముక్తి ఆ పోరాట నినాదంగా మారింది


దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రేరణ నిచ్చింది. భూమి, భుక్తి, విముక్తి ఆ పోరాట నినాదంగా మారింది. ఆ అమరత్వాన్ని నేటి తరానికి పరిచయం చేద్దాం.
(దొడ్డి కొమురయ్య వర్ధంతి వ్యాసం)
వడ్డేపల్లి మల్లేశము9014206412
“అమరజీవి నీవు కొమరయ్య
అందుకో జోహార్లు కొమురయ్య
లంచగొండుల అండ దేశముకులకు ఉండ న్యాయ రక్షణ కొరకు నడుము బిగించి తివి గుండాల తుపాకి గుళ్ళకు ఎదురుగా పోరాడి బలి అయిన వీరులలో కొమురయ్య నీ పేరు నిలుపకనే కొమురయ్య నిద్ర పోము మేము కొమురయ్య”
తెలంగాణ ప్రజల బానిస సంకెళ్ల విముక్తికోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఈ నేల మీద సాగిన మహోద్యమం. దొరలు, దేశ్ముఖ్ల, పటేళ్లు, పట్వారీలు, దౌర్జన్యాలను రజాకార్ల బీభత్సకాండను, నిజాం నిరంకుశత్వాన్ని, బాంచన్ నీ కాల్మొక్తా అనే బానిసత్వం నుండి సామాన్య ప్రజలు వెట్టిచాకిరి చేస్తున్న వారు. “నీ జులుం ఏందిరా “అని తిరగబడ్డనేల తెలంగాణ. నాటి కరీంనగర్ జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి ,ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమల వంటి ఎందరో నాయకుల సారధ్యంలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, లెవీ ధాన్యం వసూలుకు నిరసనగా, రజాకార్ల అకృత్యాలకు ప్రతిఘటన గా ఎందరో సాయుధ పోరాట వీరుల ను ఈ ఉద్యమం తయారు చేసినది.
ఈ ఉద్యమంలో తొలి అమరుడు కడివెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య.
దొడ్డి కొమురయ్య అనగానే కడవెండి, కడవెండి అనగానే పోరాటయోధుడు నల్ల నరసింహులు పుట్టిన ఊరు. ఊరి మధ్యలో అమరుడు దొడ్డి కొమురయ్య స్తూపం కడవెండి గ్రామ ప్రదేశంలోనే సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు తో పాటు అనేక నాటి నేటి పోరాట రూపాలు దర్శనమిస్తాయి. అక్కడికి దాదాపుగా పది కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తగా తన పోరాటంలో గెలిచిన కూడా గుండాల చేతిలో అమరుడైన కామారెడ్డిగూడ కు చెందిన బంధగీ సమాధి కామారెడ్డి గూడచౌరస్తా లో ఉంది. వీరనారి చాకలి ఐలమ్మ స్వగ్రామం పాలకుర్తి. 60 గ్రామాలకు అధిపతి గా ఉన్న రామచంద్రా రెడ్డి స్వగ్రామం విస్నూరు దగ్గరే. చరిత్రలో తమకంటూ పోరాట ప్రాధాన్యత లిఖించుకున్న ఈ గ్రామాల్లో అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉండటం ఇప్పటికీ ఆ ప్రాంతంలో చైతన్యం కనబడుతూనే ఉండటం గమనించదగినది. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య నడయాడిన నేల ఆ గ్రామాలకు వన్నె తెస్తే ఆ ప్రాంతాలలో పర్యటిస్తే తప్పకుండా మనం భావోద్వేగానికి గురి అవుతాము. నేను 2017 ప్రాంతంలో ఆ ప్రాంతాలను పర్యటించి చారిత్రక వారసత్వాన్ని, పోరాట గాథలను నాటి వ్యక్తుల నుండి సేకరించి కదలాడిన నేలను ముద్దాడి వారి అమరత్వానికి జోహార్లు అర్పించిన అనుభవంతోనే ఈ వ్యాసాన్ని రాస్తున్నాను.
విసునూరు రామచంద్రారెడ్డి తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తుంటే తన తల్లి జానమ్మ దొరసానికి బదులు “దొర”అని ప్రజలతో పిలువబడుతూ ప్రజలను నానారకాలుగా పీడించేది. జానమ్మ కడివెండి గ్రామములో ఉంటూ లెవీ ధాన్యాన్ని నిర్బంధంగా వసూలు చేస్తూ వెట్టిచాకిరిని నిర్బంధంగా అమలు చేస్తూ ఎదిరించిన వారిని చంపి తన ఆగడాలను నిరాటంకముగా కొనసాగించింది.
దొడ్డి మల్లయ్య తమ్ముడు దొడ్డి కొమురయ్య అన్నకు ఆసరాగా ఉండి అన్యాయాన్ని ఎదిరించి నప్పటికీ జానమ్మ ఆగడాలను భరించలేక దొడ్డి మల్లయ్య ఇస్లాం మతాన్ని స్వీకరించి ఖాదర్ అలీ గా పేరు మార్చుకుని నికృష్టంగా బ్రతుక వలసి వచ్చింది.
1944లో భువనగిరిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కడవెండి గ్రామంలో ఆంధ్ర మహాసభ గ్రామ శాఖను దామోదర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై ఏర్పాటు చేసుకున్నారు. నల్లనరసింహులు కార్యదర్శి. ఉద్యమం ఫలితంగా నాటి అధికారులతో జానమ్మ ఆగడాలపై ఒత్తిడి తెచ్చిన కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు కడివెండిలో పర్యటించి ప్రజల నుండి జానమ్మ అక్రమంగా సంపాదించిన 80 పుట్ల ధాన్యాన్ని జప్తు చేసి వెళ్ళారు. ఈ అవమాన భారాన్ని అటు రామచంద్రారెడ్డి ఇటు జానమ్మ తట్టుకోలేక పోయింది. ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులతో అరెస్టు చేయించారు. అప్పటిదాకా సంఘం కార్యకర్తల దగ్గర కర్ర బలమే తప్ప ఆయుధాలు లేవు. ఐక్యత వారి ఆయుధం పోరాట స్ఫూర్తి వారికి కొండంత అండ.
సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని విసునూరు రామచంద్రారెడ్డి మామ గడ్డం నరసింహ రెడ్డి నేతృత్వంలో గుండాల ఆధ్వర్యంలో 40 మంది కడవెండి గ్రామం పైజులై 4, 1948 నవిరుచుకుపడ్డారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆర్గనైజర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వందల మందికి పైగా ప్రజలు దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ ఆంధ్ర మహాసభ, గ్రామ సంఘం వర్ధిల్లాలి, దేశ్ముఖ్ల దౌర్జన్యాలు నశించాలి. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తుండగా దొడ్డి కొమురయ్య తన అన్న దొడ్డి మల్లయ్యతో సహా ఊరేగింపు ముందు వరుసలో నిలిచారు. ఊరేగింపు జానమ్మ గడి దగ్గరికి రాగానే నరసింహారెడ్డి ముస్కిన్ అలీ అనుచరుల గుండాలు జరిపిన కాల్పుల్లో జై ఆంధ్ర మహాసభ అంటూ దొడ్డి కొమరయ్య వీర మరణం చెందారు.
దొడ్డి కొమురయ్య శవాన్ని జనగామ తీసుకెళ్ళి గత్యంతరం లేని పరిస్థితుల్లో కడవెండి గ్రామానికి తీసుకురాలేక నెల్లుట్ల గ్రామం వద్ద పూడ్చి పెట్టారు. కేవలం విసునూరు జాగీర్దార్ హయాంలో జరిగిన ఈ అరాచకం కొమురయ్య అమరత్వం నాటి తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న వెట్టిచాకిరి, బానిసత్వ నిర్మూలన కోసం విముక్తి కోసం తెలంగాణ వ్యాప్తంగా మహోద్యమంగా మారింది. ఆ ఉద్యమమే తదనంతరకాలంలో 1947 సెప్టెంబర్లో ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు రాష్ట్ర నాయకత్వం తెలంగాణ సాయుధ పోరాటంగా పిలుపునివ్వడంతో 1951 వరకు ఈ ఉద్యమం కొనసాగింది. ఆ ఉద్యమం కొనసాగుతున్న కాలంలో పటేల్ పట్వారీ ల దోపిడీ నుంచి రజాకార్ల దుర్మార్గo నుండి వందలాది గ్రామాలను విడిపించి భూస్వాముల నుండి నిర్బంధంగా గుంజుకున్న పది లక్షల ఎకరాలను పేద ప్రజానీకానికి పంచిపెట్టి విప్లవోద్యమానికి సార్ధకత చేకూర్చినారు. ఈ ఉద్యమంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టు, ఆంధ్ర మహాసభ కార్యకర్తలు అమరులైన ప్పటికీ భూస్వాముల ఆగడాలను నిలువరించడం దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయం. దొడ్డి కొమురయ్య అమరత్వానికి నేటికీ 76 ఏళ్లు నిండినవి. నాటి ఉద్యమ అవసరాల రీత్యా పేద ప్రజానీకం ఏరకంగా ఉద్యమంలో చేరి ప్రజల విముక్తి కోసం పనిచేశారో నాటి ఉద్యమ స్థితిగతులను పోరాటపటిమను నేటి యువత అధ్యయనం చేసినట్లయితే నేడు రాష్ట్రంలో దేశంలో కొనసాగుతున్న గడ్డు పరిస్థితులను ఎదిరించడం లో కృతకృత్యుల0 కాగలము. దొడ్డి కొమురయ్య నాడు తూటాలకు బలి కావడంతో గ్రామగ్రామాన ఊరూరా ప్రజాఉద్యమం ఎగిసిపడింది. నాటి ఆంధ్ర మహాసభ 1948 జూలై 26 వ తేదీన సంస్మరణ సభ ఏర్పాటు చేయడానికి పూనుకుంటే దానికి వేలాదిగా అనేక గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ ఊరేగింపులు ఒక్క చోటనే కాకుండా రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ భారీ ఎత్తున నిర్వహించబడినవి. రాష్ట్రవ్యాప్తంగా దావానలంలా వ్యాపించిన ఊరేగింపు కథనాలు ఉద్యమ తీవ్రతను పెంచడమే కాకుండా ప్రజానీకానికి ఎక్కడికక్కడ కదిలేలా ప్రోత్సహించినవి. 1919 లో సూర్యాపేట లో జన్మించిన ఆవుల పిచ్చయ్య ఒక పేద కుటుంబానికి చెందిన వాడు. పెద్దగా చదువుకోకపోయినా అప్పటికీ నాటి సమకాలీన పరిస్థితులను అధ్యయనం చేసి తాను కూడా స్వయంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 1949 వరకు జైలు శిక్ష అనుభవించాడు. ఒక రచయితగా, కథకునిగా ఆవుల పిచ్చయ్య తాను పరిశీలించిన అంశాలను దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని నాడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఊరేగింపు లను “ఊరేగింపులు “అనే పేరుతో కథ రాసి నేటి తరానికి నాటి అనుభవాలను అందించాడు.
ఆ కథను చదవడం ద్వారా కూడా నాటి సమకాలీన పరిస్థితులు ఎలా ఉండేవి?. దొడ్డి కొమురయ్య అమరత్వం, వీరత్వం, పోరాటం, ప్రతిఘటనను ఈనాటి తరం తెలుసుకోవచ్చు. అవినీతి, అన్యాయం, అక్రమార్జన, దోపిడీ దౌర్జన్యాలు ఏ కాలంలోనైనా వ్యవస్థలో కొనసాగినప్పుడు పాలకులు ఆ దుర్మార్గానికి పూనుకున్నప్పుడు ప్రజలకు గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరాటమే ఏకైక మార్గం. ఈ చారిత్రక సత్యాన్ని 76 సంవత్సరాలకు పూర్వమే నాటితరం అమలు చేసి చూపింది.
మరి నేడు రాష్ట్రంలో దేశంలో ఎన్నో అకృత్యాలు, అసమానతలు, అంతరాలు, వివక్షత కొనసాగుతున్నప్పటికీ ప్రజానీకం స్పందించకపోవడం, పట్టించుకోకపోవడం బాధాకరం. నాటి ఉద్యమంలో పాల్గొన్న వారిలో చాలా మంది నిరక్షరాస్యులే కేవలం 4 శాతం గా ఉన్నటువంటి అక్షరాస్యత ఆనాడు కొనసాగితే నేడు 75 శాతం అక్షరాస్యత ఉన్నప్పటికీ సమకాలీన పరిస్థితుల పట్ల స్పందించక పోవడం విచారకరం ఆ వైపుగా ప్రజానీకం, ఉద్యమ శక్తులు, ప్రజాసంఘాలు, అఖిల పక్షాలూ ఆలోచించవలసి ఉంది. అప్పుడే మనము దొడ్డి కొమురయ్య అమరత్వానికి నిజమైన నివాళి అర్పించి నట్లు అవుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ)
వ్యాసాలు
సిబ్బంది అధికారులకు లేని తొందర శాసనసభ్యుల భర్తీ కోసం ఎందుకు ?
మెజారిటీ ఖాళీలతో బీసీ సంక్షేమ శాఖ ప్రజలను ఎలా ఉద్ధరిస్తుంది? అధికారులు లేకుంటే పాలన గాడి తప్పినా ప్రభుత్వ స్పందన ఏది?
వడ్డేపల్లి మల్లేశము 9014206412
జనం వెలుగు:- ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిపాలన ప్రజలకు చేరువ కావాలంటే ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు సిబ్బంది యొక్క ఆవశ్యకత ఎ నలేనిది. ఈ విషయం ప్రభుత్వాలకు తెలియనిది కాదు కానీ ప్రతిష్ట కోసం కొత్త జిల్లాలను కొత్త రాష్ట్రాలను కొత్త ప్రాంతాలను ఎంపిక చేసిన స్థాయిలో అధికారులు సిబ్బందిని నియామకం చేయకపోవడం అనేది భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అప్రజా స్వామిక విధానం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులను ఆకలింపు చేసుకొనక ముందే జిల్లాల సంఖ్యను పెంచడంతో సిబ్బంది యొక్క అవసరం మరింతగా పెరిగింది కానీ ఆ స్థాయిలో సిబ్బంది నియామకం జరపకపోవడం పది జిల్లాల నుండి 33 జిల్లాలకు పెరిగిన నేపథ్యంలో సిబ్బంది యొక్క అవసరాన్ని ప్రభుత్వం అతిగా గుర్తించకపోయిన కారణంగా నేడు సర్వత్ర ఖాళీలతోనే పరిపాలన కొనసాగుతున్నది. “బీ సీ సంక్షేమ శాఖలో అధికారులేరి” అనే పత్రిక ప్రకటన 8 జనవరి 2023 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన విషయం మనందరికీ తెలిసినదే . ఒక శాసనసభ్యుని పదవి ఏరకంగానో ఖాళీ అయితే ఆరు మాసాలలోగా తిరిగి భర్తీ చేయాలి అనే ప్రభుత్వ నిబంధనను తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వాలు అధికారులు సిబ్బంది ప్రధానమైనటువంటి కార్యదర్శులు స్థాయి విషయాన్ని మరిచిపోయి సంవత్సరాల తరబడిగా అధికారులు లేకుండానే మొక్కుబడి పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం ఎందుకు గుర్తించకూడదు? .ఉప ఎన్నికలకు పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు ఇస్తున్న విలువను అధికారుల భర్తీకి ఇవ్వకపోవడం అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమించినది. ఈ సందర్భానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వాలు జవాబు చెప్పవలసినది పోయి అరకొ ర వసతులు సౌకర్యాలు ఇబ్బందులతో ప్రజల సమస్యలు దాటవేత ధోరణిలోనే కొనసాగితే తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా సమర్ధించుకుంటుంది తన పరిపాలనను దేశానికి ఆదర్శం చేస్తుందో అర్థం కావడం లేదు.
ఇటీవల కాలంలో దాదాపుగా రాష్ట్రంలో హుజూర్నగర్ ,మునుగోడు, హుజురాబాద్ ,దుబ్బాక, నాగార్జునసాగర్ వంటి నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసినదే అతి ఖరీదైన ఉప ఎన్నికలుగా కూడా వీటికి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్నది. అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా సవాలుగా తీసుకునే ప్రయత్నం చేసినవే కానీ ఒక్క శాసనసభ్యుడు లేకపోతే ప్రత్యామ్నాయము ద్వారా పరిపాలన కొనసాగించవచ్చు అని రుజువు చేయలేక పోయినవి . అదే రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా స్థాయి, విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు వంటి ఉన్నత పదవుల్లోని సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట ఖాళీగా ఉన్నప్పటికీ పరిపాలన కుంటుపడుతున్న విషయాన్ని ప్రభుత్వం అంగీకరించకపోవడం ప్రజా ప్రతినిధులకు ఇచ్చిన విలువను అధికారులు సిబ్బందికి ఇవ్వకపోవడమేనని తెలుస్తుంది .ఈ అనాలోచిత చర్య మరొక రకంగా ఆలోచించినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలు, నియామక ప్రక్రియ, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి వంటి అనేక అంశాలకు సంబంధించినది అని ఇప్పటికీ కూడా ప్రభుత్వం గుర్తించకపోవడమే చాలా బాధాకరం. ఈ లోపాలను సమీక్షించుకొని కార్యాచరణను ప్రకటించుకోవడానికి పాలకుల తో పాటు నిరుద్యోగ యువత ప్రజా సంఘాలు మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారని ఆశిద్దాం.
బీసీ సంక్షేమ శాఖలో ఖాళీల కలవరం:-
. బీసీ సంక్షేమ శాఖలో ప్రధానంగా బీసీ కమిషన్ కొనసాగుతున్నప్పటికీ దానికి చైర్మన్ ఉన్నారు కానీ సెక్రటరీ ఖాళీ ఉండడంతో ప్రధాన కార్యదర్శి ఈ బాధ్యతను అదనంగా చూస్తున్నారు. 310 గురుకులాలు ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ పరిధిలో పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారులు లేరు. వాస్తవంగా బీసీ సంక్షేమ శాఖకు ప్రధాన సెక్రటరీ , కమిషనర్ , బీసీ ఎంబీ సీ కార్పొరేషన్లకు ఎండీలు ఐఏఎస్లు ఉండాల్సిన అవసరముంది. కానీ నాన్ ఐఏఎస్ లు కూడా లేకుండా ఆ పదవులు వెలవెల పోతున్నవి. బీసీ వర్గాల అభ్యున్నతి సంక్షేమం కు సంబంధించి ప్రణాళికలు రచించి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రకటించవలసినటువంటి సంక్షేమ శాఖలో అధిక ఉన్నతాధికారులు సిబ్బంది కొరత వలన ప్రభుత్వ పథకాలు ఏవి అట్టడుగు స్థాయికి చేరడం లేదనే విమర్శ సర్వత్రా ఉన్నది. గురుకులాలు హాస్టల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఈ వర్గాల ప్రజలు విద్యార్థులు సిబ్బంది ఇబ్బంది పడుతున్న విషయం తెలిసినదే . బీసీ సంక్షేమ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారి వివిధ విభాగాలకు ఇన్చార్జిగా వ్యవహరించడంతో అతడే ప్రతిపాదన పంపడం అతడే తిరిగి ఆమోదించుకోవడం అనే భిన్నమైనటువంటి విచిత్రమైన వ్యవహారం బీసీ సంక్షేమ శాఖలో చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది . ఇక బీసీ సంక్షేమ శాఖలోని అనేక విభాగాలలో ఉన్న అధికారి పోస్టులన్నింటికీ ప్రధాన కార్యదర్శి ఇన్చార్జిగా వ్యవహరించడంతో పాలన ఏ మేరకు ప్రజలకు చేరువవుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా గురుకులాలకు సంబంధించి ప్రత్యేకంగా సెక్రెటరీగా ఒక ఐఏఎస్ సెక్రటరీని, అడిషనల్ సెక్రెటరీని నియమించవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించక మామూలు సిబ్బందితో ఎల్ల తీస్తున్న కారణంగా ఎన్ని రకాల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది అని ప్రజలు విద్యార్థులు కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. ఐఏఎస్ బదులుగా నాన్ ఐఏఎస్ వ్యక్తి బాధ్యత నిర్వహించడం ఒక తప్పిదం అయితే జాయింట్ డైరెక్టర్లు ముగ్గురికి బదులు ఒక్కరే ఉన్నారు. బీసీ కార్పొరేషన్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను రద్దుచేసి వీరి బాధ్యతలను ప్రభుత్వం జిల్లా బీసీ అధికారులకు అప్పగించడంతో జిల్లాల అధికారులకు తలకు మించిన భారం అవుతున్నట్లుగా వాపోతుండడం కూడా గమనార్హం.
అధికారులు సిబ్బంది నియామకంలో అసంబద్ధ విధానం ఎంతకాలం:?
ప్రధానమైన విభాగాలకు అది పతులు లేకపోవడం, ఐఏఎస్ అధికారులు ఉండవలసిన చోట నాన్ ఐఏఎస్ అధికారులు కూడా లేకుండా ఖాళీగా ఉండడం, కొన్నిచోట్ల నాన్ ఐఏఎస్ అధికారులతోనే మొక్కుబడిగా కార్యక్రమాలు నడుపుకోవడం, విభాగాల బాధ్యతలను జిల్లా అధికారులకు అదనంగా అప్పగించడం వంటి అసంబద్ధ విధానాల వలన ఈ శాఖలో పనిచేస్తున్న కొద్దిమంది సిబ్బందికి అయినా అదనంగా పెనుబారం పడుతున్నట్లు దానివలన తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించలేక సిబ్బంది వాపోతున్నట్లుగా తెలుస్తున్నది. మరింత గమ్మత్తయిన విషయం ఏమిటంటే బీసీ సంక్షేమ శాఖ లోనే ఉద్యోగుల కరువు కొనసాగుతున్నదంటే ఈ శాఖ నుండి సిబ్బందిని, అధికారులను ఇతర విభాగాలకు ఇన్చార్జీలుగా నియమించడం వంటి పూర్తి తప్పుడు నిర్ణయాల వలన కూడా క్షేత్రస్థాయిలో ఈ శాఖను సిబ్బంది సమస్య వెంటాడుతుండగా ఆయా విభాగాలలో ప్రజలకు సమకూర్చవలసినటువంటి కార్యకలాపాల విషయంలో మరింత తాత్సారం జరుగుతున్న కారణంగా ముఖ్యంగా మెజారిటీ 56% గా ఉన్నటువంటి బీసీ వర్గాలకు అందవలసినటువంటి రాజ్యాంగ పలాలు అందకుండా పోవడం కూడా ప్రభుత్వ కుట్ర లో భాగమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు .ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చాలా పాఠశాలల్లో, హాస్టల్లో, గురుకులాలలో అరకొ ర సిబ్బందితో చాలీచాలని వసతులతో కార్యకలాపాలు కొనసాగుతుంటే అక్కడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా మనం ప.త్రికలద్వారా వింటూ ఉన్నాం. మొత్తం మీద బీసీ సంక్షేమ శాఖ మెజారిటీగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన సకల సమస్యలను పరిష్కరించే క్రమంలో సిబ్బంది సమస్య వెంటాడుతున్న కారణంగా పరిమితమైనటువంటి కార్యకలాపాలకు మాత్రమే మొక్కుబడిగా మిగిలిపోవడంతో బీసీ వర్గాలు రాజ్యాంగబద్ధంగా సంక్రమించవలసినటువంటి ఫలాలను అందుకోవడంలో తీవ్ర అసౌకర్యంతో పాటు ఉత్కంఠను ఎదుర్కొంటున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు .ఉన్నతాధికారులు లేకపోవడం ఒక లోపం అయితే కిందిస్థాయి జిల్లా స్థాయి సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ఇన్చార్జిల పరిపాలన కారణంగా కూడా పాలన సవ్యంగా జరగడం లేదనే ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి తెలిసి ఉండి కూడా సిబ్బందిని నియమించకపోవడంలోని ఆంతర్యం ఏమిటి ? ప్రజా సంఘాలు, అఖిలపక్షాలు ప్రభుత్వం మీద ఈ విషయంలో ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? ముఖ్యంగా అధికార పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతున్నటువంటి వామపక్షాలు సిబ్బంది నియామకం విషయంలో పూర్తిగా అనాలోచితంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చారిత్రక తప్పిదంగా భావించవచ్చు ..
బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్లు ప్రధానంగా ఆ వర్గాలకు చెందినటువంటి ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకొని తగిన ప్రణాళిక రూపకల్పన చేయడం ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ఎక్కువ ప్రాధాన్య తీయవలసి ఉంటుంది. కానీ మేనేజింగ్ డైరెక్టర్లు లేకపోవడం, కార్యదర్శులు లేకపోవడం, చైర్మన్లు కూడా లేకపోవడం వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి బీసీ సంక్షేమ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం ద్వారా ప్రభుత్వం బేషరతుగా బీసీ వర్గాలకు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించి రుజువు చేసుకోవలసిన అవసరం చాలా ఉన్నది . అన్ని శాఖలతోపాటు మెజారిటీ ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీసీ సంక్షేమ శాఖను కూడా నిర్లక్ష్యాన్ని గురి చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని ఎండ కట్టడంలో అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు ముఖ్యంగా చట్టసభ లోపల ఎందుకు విఫలమవుతున్నాయి? అనే సమస్య ఇవాళ ప్రధానంగా ప్రజలను వేధిస్తున్నది. ముఖ్యంగా సిబ్బంది నియామకం పైన కేంద్రీకరించి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని తీసుకోవాలని ఈ విషయంలో వామ పక్షాలు ముందుంటే సంతోషించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామికవాదులతో పాటు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న విషయాన్ని రాజకీయ పక్షాలు ఆకలింపు చేసుకుంటే మంచిది. లేకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుందని ఇప్పటికైనా గుర్తించడం శ్రేయస్కరం .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )
ARTICLE'S
సాహితీవేత్తకి సన్మానం


డా. తుమ్మల దేవరావ్ కు సాహితీ మిత్రుల సన్మానం
జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుఱ్ఱం జాషువా కవిత పురస్కారం కు ఎంపికైనందున నిర్మల్ సాహితీ మిత్రులు మునిమడుగుల రాజరావ్, పత్తి శివప్రసాద్, నెరేళ్ల హన్మంతు, మచ్చేందర్ తదితరులు డా. తుమ్మల దేవరావ్ ను ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారాలతో పాటు నిర్మల్ జిల్లా కీర్తిని ఇనుమడింప జేశారని కొనియాడారు. చరిత్ర పరిశోధనల ద్వారా 15 శాసనాలను వెలుగులోకి తేవడం, తుమ్మల రాసిన కవిత్వం రాష్ట్ర స్థాయిలో చర్చనీయంగా మారుతుందని వీరి కథలకు పురస్కారం తో అనేక సాహితీ, చారిత్రక వ్యాసాలు ప్రచురితం అవ్వడం అభినందించారు. ఇందులో సాహితీ మిత్రుల సహాకారంతోనే తను రచనలు చేస్తున్నానని సన్మాన గ్రహీత తుమ్మల దేవరావ్ అన్నారు.








