Connect with us

వ్యాసాలు

కల్తీ రక్కసిముకల ఆగడాలకు అంతు ఎప్పుడు ?

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్:- ప్రధానమంత్రికి ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ లేఖ

మనం తింటున్న ఆహార పదార్థాలన్నీ ప్రాణాలు తీసే విషా గుళికలూ కావా ?

కల్తీ కల్లోలం కరోనా ,క్యాన్సర్ల కంటే ఘోరం కల్తీ నేరం

కాటేస్తున్న కల్తీ మాఫియా నుండి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడండి ప్రధానమంత్రికి బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి

చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిన చందంగా దేశంలో పోను పోను విజృంభిస్తున్న ఆహార కల్తీ అక్రమాల తీవ్రతకు అనుగుణంగా శిక్షలు పదును తేలాలంటూ కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి నుండి మొదలుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రెటరీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన బహిరంగ లేఖలోకల్తీ దందాల పై ఉక్కుపాదం మోపాలని ప్రజాబంధు సుభాష్ డిమాండ్ చేశారు.

బహుముఖ చర్యల రూపేణా ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన భద్రతను కల్పించాలని సుభాషన్న కోరారు.వాస్తవంలో గాలి, నీరు, తిండి- అన్నింటా కాలుష్యం, కల్తీల ఉరవడి ప్రజా ఆరోగ్యానికి సంబందించిన దేశీయ చట్టబద్ద రక్షణను క్రూరంగా అపహసిస్తోందని ప్రజా నేస్తం బోరన్న గారి నేతాజీ సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు.

పాలు, పాలపొడి, పసుపు, కారం మొదలు వంటనూనెల దాక అన్నింటా పెచ్చరిల్లుతున్న కల్తీ మాఫియా దందా కోట్లాది భారతీయులు ప్రజారోగ్యాన్ని కుళ్లబొడుస్తోందని సామాజిక పరివర్తకుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ ఆరోపించారు.

కఠినమైన చట్టాలు లేక, ఉన్నవే సరిగ్గా అమలుకు నోచక, నిస్తేజమైన నిఘా పర్యవేక్షణ యంత్రాంగం, లోపాయికారీ తోడ్పాటుతో దేశం నలుమూలలా కల్తీ ముష్కరులు రెచ్చిపోతున్న నేపథ్యంలో నేరగాళ్ల ఏరివేతపై ప్రజా ఉద్యమాలను, ప్రజల చైతన్యాన్ని బలోపేతం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని ప్రజాతంత్రవాది, ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ 9701487102 పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 72 శాతంకు పైగా పాల సరఫరాల్లో జరుగుతున్న కల్తీ పసిబిడ్డల ఎదుగుదలను కబళిస్తుండగా, కారం, పసుపు, వంటనూనెల తయారిలో విచ్చల విడిగా రసాయనాల వినియోగం నాడీవ్యవస్థనే ప్రభావితం చేస్తూ క్యాన్సర్లు, పేగుల్లో పుండ్లు ఇతర మాయదారి రోగాలకు కారణభూతమవుతున్న కిరాతక కల్తీ మాఫియా వెన్ను విరిచేలా ఆహార తనిఖీ విభాగాల్ని ప్రక్షాళించాలని కమ్యూనిస్టు పార్టీ సిపిఎంఎల్ సెక్రటరీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ పేర్కొన్నారు.

చట్టాల్లో గరిష్ట దండనకు కల్పించడం, అత్యాధునిక కల్తీ నిర్దారణ ప్రయోగశాలల్ని ఏర్పరచడం, కల్తీ మాఫియాపై ఉప్పందగానే దాడి చేసి కల్తీ దొంగల దారులన్నీ మూసివెయ్యడం ద్వారా కల్తీ చేద్దామంటేనే హడలెత్తిపోయే వాతావరణం కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడాలని వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుడు సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ కోరారు.

ప్రతి మనిషికి ఆరోగ్యంగా జీవించే హక్కు ఉందని , నాణ్యమైన ఆహారాన్ని తినే హక్కూ వారికి ఉందని ప్రజల హక్కులను పరిరక్షించాల్సింది మాత్రం ప్రభుత్వమేనని బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు. ప్రజలు వాస్తవంగా రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులను అనుభవిస్తున్నారా లేదా అన్నది ప్రభుత్వ పరిపాలన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు నిరంతరం నిరుపేదల హక్కుల కోసం పోరాడే వర్గ పోరాట విప్లవ నేత బోరన్నగారి సుభాష్ పేర్కొన్నారు .

ఉదయాన్నే నిద్రలేచి కమ్మని కాఫీ తాగి రోజును మొదలు పెట్టాలని చాలామంది అనుకుంటారు. కానీ, ఆ కాఫీ పౌడరు చింతపిక్కలు, గంజి పౌడరుతో కల్తీ అవుతోంది. టీ పౌడరులో బొగ్గు, తారు రంగు కలిసిపోతోంది. వాటిని తాగినవారు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఆపిల్ జ్యూస్ తాగుదామనుకుంటే అందులో యాంటీబయాటిక్స్ ఎక్కించి, పురుగుమందుల బోరిక్ యాసిడ్, సంరక్షక (ప్రిజర్వేటివ్) ఫార్మాలిన్ వంటి ఘోరమైన రసాయనాలను పాలలో కలిపి ఉండవచ్చు. గేదెలకు, ఆవులకు విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్ ఎక్కించి పురుగుమందుల బోరిక్ యాసిడ్, సంరక్షణ (ప్రిజర్వేటివ్) ఫార్మాలిన్ వంటి ఘోరమైన రసాయనాలను పాలలో కలిపి ఉండవచ్చు. ఇక మిగిలింది మంచి నీళ్లు మాత్రమేనని వాటిలోనూ సముద్రపు నీటిలో ఉండే బ్రోమేట్ ఉంటే క్యాన్సరును కోరి తెచ్చుకోవడమే అవుతుందని ప్రజాయితాన్నికాంక్షించే ప్రజాతంత్ర వాది ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ 9848540078 ఆవేదన వ్యక్తం చేశారు .

హోటళ్లలో ఎలాంటి నూనె వాడుతున్నారో తెలియదు. మార్కెట్లో నూనె తెచ్చుకొని ఇంట్లోనే వండుకు తిందామనుకుంటే, అవి కూడా జంతువుల కొవ్వుతో కల్తీ అవుతున్నాయన్న వార్తలు తనలాంటి కోట్లాదిమంది సామాన్య భారతీయులను బెంబేలెత్తిస్తున్నాయని అనుదినం జన స్వరమై ప్రజా సమస్యలపై పాలకవర్గాలను నిల దీస్తూ వందల వేల ఉత్తరాలు రాస్తున్న విప్లవాల నిప్పురవ్వ జనహితాన్ని కాంక్షించే ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ పేర్కొన్నారు.

ప్రకృతి వరప్రసాదమైన పండ్లను కూడా ప్రమాదకరమైన కార్బైడ్ రసాయనాల ద్వారా కృత్రిమంగా మాగపెడుతున్నారని కల్తీలేని పదార్ధాలు అందజేయగలమన్న భరోసా ఇచ్చే యంత్రాంగం ప్రస్తుతం లేదని , ప్రభుత్వం రూపొందించిన విధానాలనుఅమలుపరచేటప్పుడు, సంబంధిత విధాన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం లేదని మానవ హక్కుల ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ 8328277285 ఆరోపించారు .

సరైన నిఘా పర్యవేక్షణ లోపాలు అడుగడుగునా కొరవడుతున్నాయని , ఈ తరహా ధోరణులు ప్రభుత్వ పాలన యంత్రాంగంలో అవినీతి వ్యాప్తికీ కారణమవుతున్నాయని, వీటన్నింటి ఫలితమే ఈ కల్తీ మహమ్మారని వినియోగదారుల చైతన్య వేదిక గౌరవ అధ్యక్షుడు కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలస్పష్టం చేశారు.

ప్రభుత్వ సామర్ధ్యంను బలోపేతం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్న ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ భారత్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ విస్తృతంగా జరిపిన సర్వే ప్రకారం ప్రస్తుతం దేశంలోని ప్రమాణాల పరంగా చూస్తే 78.4 శాతం పాలల్లో కల్తీ ఉన్నట్లు తేలిందని గత సంవత్సరం పాలు, పాల ఉత్పత్తుల, కూరగాయల నూనెలు, సుగంద ద్రవ్యాలు, పప్పుదాన్యాలు, కూరగాయలు సహా 72,200 నమూనాలను పరీక్షించగా వాటిలో 13,571 నమూనాలు కల్తీవని గుర్తించారని బోరన్నగారి నేతాజీ సుభాష్ పేర్కొన్నారు .

ప్రపంచ ఆహార భద్రత సూచిలో ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఇండియా ర్యాంకు 16 (ప్రపంచంలో 75వ ర్యాంకు), సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా, చైనా (7), శ్రీలంక (11), భారత్ (16) కన్నా మెరుగ్గా ఉన్నాయి. దరిమిలా ఇండియా ప్రపంచంలోనే ఆహార నాణ్యతను ఉల్లంఘించే దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది. గత సంవత్సరం దేశంలో ప్రతి అయిదు ఆహార నమూనాల్లో ఒకటి నాణ్యత పరిక్షలో విఫలమైంది. ఈ పరిణామాలు తనలాంటి కోట్లాదిమంది సామాన్య భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయని ప్రజా బంధువు బోరన్నాగారి నేతాజీ సుభాష్ పేర్కొన్నారు.

ఆహార కల్తీ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని…ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ఏటా 60కోట్ల మంది ఆహార సంబంద వ్యాధుల బారిన పడుతున్నారు. 4.2 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మరణాల్లో ఎక్కువ శాతం ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లోనే సంభవిస్తున్నాయని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న తన కన్నీటి లేఖల తీవ్రమైన దుఃఖాన్ని, బాధను వ్యక్తం చేశారు. ఇవన్నీ పాలకవర్గాలు చేస్తున్న హత్యలుగా బోరన్నగారి నేతాజీ సుభాష్ పేర్కొన్నారు.

అధిక లావాదేవీలు, అంతులేని అవినీతి కలగలిసి సృష్టించిన మహమ్మారే మన దేశంలో , మన రాష్ట్రంలో ఈ కల్తీ ఆహారం. కల్తీ వస్తువులు కల్తీ సరుకులు కల్తీ మందులు అని బోరన్నగారి నేతాజీ సుభాష్ స్పష్టం చేశారు.

పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వంటి చట్టాలు చాలా దేశంలో ఉన్నాయి. కఠినమైనఆహారభద్రతాప్రమాణాలను వాటిలో పొందుపరచారు కానీ, మొత్తం దేశంలో కేవలం 148 ఆహార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఏ విధంగా చూసినా ఈ సంఖ్య చాలా తక్కువ. ఉన్న ఆహార పరీక్షా కేంద్రాల్లో సైతం కొన్ని వాడుకలో లేవు. మరికొన్నింటిలో ఆహార ప్రమాణాలకు అనుగుణంగా పరీక్ష చేయడానికి కావలసిన సదుపాయాలు లేవు . దీనివల్ల ఉద్యోగ సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుంది . శాంపిల్ నమూనాలు ప్రయోగశాలల్లో పేరుకుపోయాయి. భారత్ కంటే చైనా ఈ విషయంలో ఎంతో ముందుంది. చైనాలో ప్రతి రెండు లక్షల మందికి ఒక పరీక్షశాల ఉంది. 5,790 గుర్తింపు పొందిన ప్రయోగశాలలు చైనాలో ఉన్నాయి. ఇండియాలో ఉన్నవాటిలో కేవలం 70 పరీక్షా కేంద్రాలకు మాత్రమే గుర్తింపు ఉందని వెంటనే దేశవ్యాప్తంగా ఆహార ప్రమాణాలకు అనుగుణంగా కావలసిన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇప్పుడున్న వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

మన దేశంలో వినియోగ ప్రమాణాల విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉండటం వల్ల అది సమస్యలు సృష్టిస్తోందని కల్తీ, మాఫియాకు అవకాశాలు కల్పిస్తుందని , మ్యాగీ ఉదంతం, ఆహార కల్తీ అంశం పార్లమెంటు నుండి మొదలు అన్ని రాష్ట్రాల అసెంబ్లీసమావేశాల్లోచర్చించాలని ,మ్యాగీపై నిషేధం ఎందుకు విధించారో, ఆ వస్తువులో ఎటువంటి మార్పు లేకుండా తిరిగి దానిపై నిషేధం ఎందుకు తొలగించారో ఇప్పటికీ స్పష్టత లేదని ,మ్యాగీలో ఎంత శాతం మేర సీసం, మొనోసోడియం, గ్లుటమేట్ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి అనే విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా స్పందిస్తుందని ఒక రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఆహార కల్తీ వస్తువు మరోచోట మంచిచేస్తుందా? అనిప్రజా హితం కాంక్షిస్తూ కార్మిక , కర్షక, శ్రామిక ప్రజా ఉద్యమకారుడు, సామాజిక పరివర్తకుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న 9848540078 దోపిడి పాలకవర్గాలను ప్రశ్నించారు.

దేశమంతటికీ ఒకే వినియోగ ప్రమాణాలు వర్తింపజేయాలని , ఒకే దేశం , ఒకే చట్టం , ఒకే ప్రమాణాలు ఉండాలని అఖండ భారత్ నిర్మాణం అంటే ఆరోగ్యవంతమైన ఎలాంటి కల్తికి చోటు లేని భారతదేశ నవ నిర్మాణం జరగాలని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ ఆకాంక్షించారు.

ఆరోగ్య తనిఖీ అధికారులకు గల విచక్షణ, వారిపై నిఘా, నియంత్రణ వ్యవస్థ సమర్థవంతంగా లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆహార భద్రతా విధానం విఫలమవుతుందని,దీన్ని తిరిగి పట్టాలెక్కించాలంటే తగినంత సిబ్బందిని నియమించాలని,ఎక్కడి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నారు, ఆకస్మిక దాడి చేసినప్పుడు నిజంగానే వారు శాంపిల్స్ తీసుకుంటున్నారా, లేక ఏజెన్సీ, కంపెనీ ‘లాభాల’ కోసం పనిచేస్తున్నారా ? అని గమనించే సమర్థవంతమైన ప్రజావేగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఆధునిక వసతులతో తగినన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా కల్తీ జరిగినట్లు, చేస్తున్నట్లు గుర్తిస్తే అధిక జరిమానా వేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన విధంగా నిఘా, నియంత్రణవ్యవస్థనుపటిష్టపరచా లని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

ఆహార పదార్థాలను నిత్యవసర వస్తువులను అన్ని రకాల సరుకులను మందులను కల్తీ చేయడంవల్ల జరిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని , కల్తీ చేసిన వారిమీద చట్టపరంగా తీసుకునే కఠిన చర్యల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, కల్తీ మాఫియా ఆస్తులను జప్తు చేయాలని భవిష్యత్తులో కల్తీ వ్యాపారం చేసే వారు ఎటువంటి వ్యాపారాలు చేయకుండా కట్టడి చేయాలని ,తద్వారా పాలనా యంత్రాంగం సామర్థ్యం పెరుగుతుందని, అప్పుడే ఈ కల్తీ మహమ్మారికి కళ్లెం వేయడం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి కి రాసిన లేఖలో పేర్కొన్న ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ ఈదిశగా ప్రజలను నిత్యం చైతన్యం చేయాలని, అందుకు సభలు సమావేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, యాడ్స్ లాంటి ఎటువంటి వ్యాపార ప్రయోజనాలు ఆశించకుండా ఉచితంగా ప్రచార కార్యక్రమాలను ప్రచారం చేయుటకు అన్ని రకాల మీడియా సంస్థలను ఆదేశించాలని ప్రభుత్వమే వినియోగదారుల చైతన్య వేదికలను ఏర్పాటు చేయాలని ఒకే దేశం ఒకే చట్టం .ఒకే ప్రమాణాలు ఆరోగ్యవంతమైనటువంటి నూతన భారత దేశ నిర్మాణానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని మెరుగైన సమాజాన్ని కాంక్షించే విప్లవ కమ్యూనిస్టు ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.

భారతదేశంలో గల్లి నుండి ఢిల్లీ వరకు తిష్ట వేసి ఉన్న బద్మాష్ కల్తీ మాఫియా ముఠాల నుండి, తనలాంటి కోట్లాదిమంది సామాన్య భారతీయుల ఆరోగ్యాన్ని ఖరాబు చేస్తున్న , ప్రతి సంవత్సరం లక్షల మంది చావులకు కారణం అవుతున్న , లక్షల కోట్ల ఆర్థిక వనరులను కొల్లగొడుతున్న సకల కల్తీ మాఫియా పై ఉక్కు పాదం మోపాలని ప్రతిక్షణం ప్రజాహితం వినిపించే ప్రజాతంత్రవాది, ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ప్రజానుకుల విధానాల కోసం ప్రధానమంత్రి నుండి మొదలుకొని ముఖ్యమంత్రిల వరకు ఇప్పటికే వేలాది లేఖలు రాస్తున్న రివల్యూషనరీ శ్రామిక వర్గ తిరుగుబాటు జ్వాలా సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ప్రజా నేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 8328277285 , 9848540078 మరోసారి ప్రధానమంత్రి కి నేడు రాసినబహిరంగలేఖల..భారతప్రభుత్వాన్ని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్ చేశారు. ప్రజలలో కూడా వినియోగదారుల హక్కుల చైతన్యం పెరగాలని, కల్తీ మాఫియా పై ప్రజల ప్రతిఘటన కొనసాగాలని ప్రజలకు, ప్రజాతంత్ర వాదులకు బోరన్నగారి నేతాజీ సుభాష్ పిలుపునిచ్చారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

భూమి, భుక్తి, విముక్తి ఆ పోరాట నినాదంగా మారింది

janamvelugunews

Published

on

దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రేరణ నిచ్చింది. భూమి, భుక్తి, విముక్తి ఆ పోరాట నినాదంగా మారింది. ఆ అమరత్వాన్ని నేటి తరానికి పరిచయం చేద్దాం.
(దొడ్డి కొమురయ్య వర్ధంతి వ్యాసం)
వడ్డేపల్లి మల్లేశము9014206412

“అమరజీవి నీవు కొమరయ్య
అందుకో జోహార్లు కొమురయ్య
లంచగొండుల అండ దేశముకులకు ఉండ న్యాయ రక్షణ కొరకు నడుము బిగించి తివి గుండాల తుపాకి గుళ్ళకు ఎదురుగా పోరాడి బలి అయిన వీరులలో కొమురయ్య నీ పేరు నిలుపకనే కొమురయ్య నిద్ర పోము మేము కొమురయ్య”

తెలంగాణ ప్రజల బానిస సంకెళ్ల విముక్తికోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఈ నేల మీద సాగిన మహోద్యమం. దొరలు, దేశ్ముఖ్ల, పటేళ్లు, పట్వారీలు, దౌర్జన్యాలను రజాకార్ల బీభత్సకాండను, నిజాం నిరంకుశత్వాన్ని, బాంచన్ నీ కాల్మొక్తా అనే బానిసత్వం నుండి సామాన్య ప్రజలు వెట్టిచాకిరి చేస్తున్న వారు. “నీ జులుం ఏందిరా “అని తిరగబడ్డనేల తెలంగాణ. నాటి కరీంనగర్ జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి ,ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమల వంటి ఎందరో నాయకుల సారధ్యంలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, లెవీ ధాన్యం వసూలుకు నిరసనగా, రజాకార్ల అకృత్యాలకు ప్రతిఘటన గా ఎందరో సాయుధ పోరాట వీరుల ను ఈ ఉద్యమం తయారు చేసినది.

ఈ ఉద్యమంలో తొలి అమరుడు కడివెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య.

దొడ్డి కొమురయ్య అనగానే కడవెండి, కడవెండి అనగానే పోరాటయోధుడు నల్ల నరసింహులు పుట్టిన ఊరు. ఊరి మధ్యలో అమరుడు దొడ్డి కొమురయ్య స్తూపం కడవెండి గ్రామ ప్రదేశంలోనే సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు తో పాటు అనేక నాటి నేటి పోరాట రూపాలు దర్శనమిస్తాయి. అక్కడికి దాదాపుగా పది కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తగా తన పోరాటంలో గెలిచిన కూడా గుండాల చేతిలో అమరుడైన కామారెడ్డిగూడ కు చెందిన బంధగీ సమాధి కామారెడ్డి గూడచౌరస్తా లో ఉంది. వీరనారి చాకలి ఐలమ్మ స్వగ్రామం పాలకుర్తి. 60 గ్రామాలకు అధిపతి గా ఉన్న రామచంద్రా రెడ్డి స్వగ్రామం విస్నూరు దగ్గరే. చరిత్రలో తమకంటూ పోరాట ప్రాధాన్యత లిఖించుకున్న ఈ గ్రామాల్లో అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉండటం ఇప్పటికీ ఆ ప్రాంతంలో చైతన్యం కనబడుతూనే ఉండటం గమనించదగినది. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య నడయాడిన నేల ఆ గ్రామాలకు వన్నె తెస్తే ఆ ప్రాంతాలలో పర్యటిస్తే తప్పకుండా మనం భావోద్వేగానికి గురి అవుతాము. నేను 2017 ప్రాంతంలో ఆ ప్రాంతాలను పర్యటించి చారిత్రక వారసత్వాన్ని, పోరాట గాథలను నాటి వ్యక్తుల నుండి సేకరించి కదలాడిన నేలను ముద్దాడి వారి అమరత్వానికి జోహార్లు అర్పించిన అనుభవంతోనే ఈ వ్యాసాన్ని రాస్తున్నాను.
విసునూరు రామచంద్రారెడ్డి తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తుంటే తన తల్లి జానమ్మ దొరసానికి బదులు “దొర”అని ప్రజలతో పిలువబడుతూ ప్రజలను నానారకాలుగా పీడించేది. జానమ్మ కడివెండి గ్రామములో ఉంటూ లెవీ ధాన్యాన్ని నిర్బంధంగా వసూలు చేస్తూ వెట్టిచాకిరిని నిర్బంధంగా అమలు చేస్తూ ఎదిరించిన వారిని చంపి తన ఆగడాలను నిరాటంకముగా కొనసాగించింది.
దొడ్డి మల్లయ్య తమ్ముడు దొడ్డి కొమురయ్య అన్నకు ఆసరాగా ఉండి అన్యాయాన్ని ఎదిరించి నప్పటికీ జానమ్మ ఆగడాలను భరించలేక దొడ్డి మల్లయ్య ఇస్లాం మతాన్ని స్వీకరించి ఖాదర్ అలీ గా పేరు మార్చుకుని నికృష్టంగా బ్రతుక వలసి వచ్చింది.
1944లో భువనగిరిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కడవెండి గ్రామంలో ఆంధ్ర మహాసభ గ్రామ శాఖను దామోదర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై ఏర్పాటు చేసుకున్నారు. నల్లనరసింహులు కార్యదర్శి. ఉద్యమం ఫలితంగా నాటి అధికారులతో జానమ్మ ఆగడాలపై ఒత్తిడి తెచ్చిన కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు కడివెండిలో పర్యటించి ప్రజల నుండి జానమ్మ అక్రమంగా సంపాదించిన 80 పుట్ల ధాన్యాన్ని జప్తు చేసి వెళ్ళారు. ఈ అవమాన భారాన్ని అటు రామచంద్రారెడ్డి ఇటు జానమ్మ తట్టుకోలేక పోయింది. ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులతో అరెస్టు చేయించారు. అప్పటిదాకా సంఘం కార్యకర్తల దగ్గర కర్ర బలమే తప్ప ఆయుధాలు లేవు. ఐక్యత వారి ఆయుధం పోరాట స్ఫూర్తి వారికి కొండంత అండ.
సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని విసునూరు రామచంద్రారెడ్డి మామ గడ్డం నరసింహ రెడ్డి నేతృత్వంలో గుండాల ఆధ్వర్యంలో 40 మంది కడవెండి గ్రామం పైజులై 4, 1948 నవిరుచుకుపడ్డారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆర్గనైజర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వందల మందికి పైగా ప్రజలు దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ ఆంధ్ర మహాసభ, గ్రామ సంఘం వర్ధిల్లాలి, దేశ్ముఖ్ల దౌర్జన్యాలు నశించాలి. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తుండగా దొడ్డి కొమురయ్య తన అన్న దొడ్డి మల్లయ్యతో సహా ఊరేగింపు ముందు వరుసలో నిలిచారు. ఊరేగింపు జానమ్మ గడి దగ్గరికి రాగానే నరసింహారెడ్డి ముస్కిన్ అలీ అనుచరుల గుండాలు జరిపిన కాల్పుల్లో జై ఆంధ్ర మహాసభ అంటూ దొడ్డి కొమరయ్య వీర మరణం చెందారు.
దొడ్డి కొమురయ్య శవాన్ని జనగామ తీసుకెళ్ళి గత్యంతరం లేని పరిస్థితుల్లో కడవెండి గ్రామానికి తీసుకురాలేక నెల్లుట్ల గ్రామం వద్ద పూడ్చి పెట్టారు. కేవలం విసునూరు జాగీర్దార్ హయాంలో జరిగిన ఈ అరాచకం కొమురయ్య అమరత్వం నాటి తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న వెట్టిచాకిరి, బానిసత్వ నిర్మూలన కోసం విముక్తి కోసం తెలంగాణ వ్యాప్తంగా మహోద్యమంగా మారింది. ఆ ఉద్యమమే తదనంతరకాలంలో 1947 సెప్టెంబర్లో ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు రాష్ట్ర నాయకత్వం తెలంగాణ సాయుధ పోరాటంగా పిలుపునివ్వడంతో 1951 వరకు ఈ ఉద్యమం కొనసాగింది. ఆ ఉద్యమం కొనసాగుతున్న కాలంలో పటేల్ పట్వారీ ల దోపిడీ నుంచి రజాకార్ల దుర్మార్గo నుండి వందలాది గ్రామాలను విడిపించి భూస్వాముల నుండి నిర్బంధంగా గుంజుకున్న పది లక్షల ఎకరాలను పేద ప్రజానీకానికి పంచిపెట్టి విప్లవోద్యమానికి సార్ధకత చేకూర్చినారు. ఈ ఉద్యమంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టు, ఆంధ్ర మహాసభ కార్యకర్తలు అమరులైన ప్పటికీ భూస్వాముల ఆగడాలను నిలువరించడం దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయం. దొడ్డి కొమురయ్య అమరత్వానికి నేటికీ 76 ఏళ్లు నిండినవి. నాటి ఉద్యమ అవసరాల రీత్యా పేద ప్రజానీకం ఏరకంగా ఉద్యమంలో చేరి ప్రజల విముక్తి కోసం పనిచేశారో నాటి ఉద్యమ స్థితిగతులను పోరాటపటిమను నేటి యువత అధ్యయనం చేసినట్లయితే నేడు రాష్ట్రంలో దేశంలో కొనసాగుతున్న గడ్డు పరిస్థితులను ఎదిరించడం లో కృతకృత్యుల0 కాగలము. దొడ్డి కొమురయ్య నాడు తూటాలకు బలి కావడంతో గ్రామగ్రామాన ఊరూరా ప్రజాఉద్యమం ఎగిసిపడింది. నాటి ఆంధ్ర మహాసభ 1948 జూలై 26 వ తేదీన సంస్మరణ సభ ఏర్పాటు చేయడానికి పూనుకుంటే దానికి వేలాదిగా అనేక గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ ఊరేగింపులు ఒక్క చోటనే కాకుండా రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ భారీ ఎత్తున నిర్వహించబడినవి. రాష్ట్రవ్యాప్తంగా దావానలంలా వ్యాపించిన ఊరేగింపు కథనాలు ఉద్యమ తీవ్రతను పెంచడమే కాకుండా ప్రజానీకానికి ఎక్కడికక్కడ కదిలేలా ప్రోత్సహించినవి. 1919 లో సూర్యాపేట లో జన్మించిన ఆవుల పిచ్చయ్య ఒక పేద కుటుంబానికి చెందిన వాడు. పెద్దగా చదువుకోకపోయినా అప్పటికీ నాటి సమకాలీన పరిస్థితులను అధ్యయనం చేసి తాను కూడా స్వయంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 1949 వరకు జైలు శిక్ష అనుభవించాడు. ఒక రచయితగా, కథకునిగా ఆవుల పిచ్చయ్య తాను పరిశీలించిన అంశాలను దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని నాడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఊరేగింపు లను “ఊరేగింపులు “అనే పేరుతో కథ రాసి నేటి తరానికి నాటి అనుభవాలను అందించాడు.
ఆ కథను చదవడం ద్వారా కూడా నాటి సమకాలీన పరిస్థితులు ఎలా ఉండేవి?. దొడ్డి కొమురయ్య అమరత్వం, వీరత్వం, పోరాటం, ప్రతిఘటనను ఈనాటి తరం తెలుసుకోవచ్చు. అవినీతి, అన్యాయం, అక్రమార్జన, దోపిడీ దౌర్జన్యాలు ఏ కాలంలోనైనా వ్యవస్థలో కొనసాగినప్పుడు పాలకులు ఆ దుర్మార్గానికి పూనుకున్నప్పుడు ప్రజలకు గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరాటమే ఏకైక మార్గం. ఈ చారిత్రక సత్యాన్ని 76 సంవత్సరాలకు పూర్వమే నాటితరం అమలు చేసి చూపింది.
మరి నేడు రాష్ట్రంలో దేశంలో ఎన్నో అకృత్యాలు, అసమానతలు, అంతరాలు, వివక్షత కొనసాగుతున్నప్పటికీ ప్రజానీకం స్పందించకపోవడం, పట్టించుకోకపోవడం బాధాకరం. నాటి ఉద్యమంలో పాల్గొన్న వారిలో చాలా మంది నిరక్షరాస్యులే కేవలం 4 శాతం గా ఉన్నటువంటి అక్షరాస్యత ఆనాడు కొనసాగితే నేడు 75 శాతం అక్షరాస్యత ఉన్నప్పటికీ సమకాలీన పరిస్థితుల పట్ల స్పందించక పోవడం విచారకరం ఆ వైపుగా ప్రజానీకం, ఉద్యమ శక్తులు, ప్రజాసంఘాలు, అఖిల పక్షాలూ ఆలోచించవలసి ఉంది. అప్పుడే మనము దొడ్డి కొమురయ్య అమరత్వానికి నిజమైన నివాళి అర్పించి నట్లు అవుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Continue Reading

వ్యాసాలు

సిబ్బంది అధికారులకు లేని తొందర శాసనసభ్యుల భర్తీ కోసం ఎందుకు ?

suresh sitharla

Published

on

మెజారిటీ ఖాళీలతో బీసీ సంక్షేమ శాఖ ప్రజలను ఎలా ఉద్ధరిస్తుంది? అధికారులు లేకుంటే పాలన గాడి తప్పినా ప్రభుత్వ స్పందన ఏది?

వడ్డేపల్లి మల్లేశము 9014206412

 జనం వెలుగు:-  ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిపాలన ప్రజలకు చేరువ కావాలంటే ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు సిబ్బంది యొక్క ఆవశ్యకత ఎ నలేనిది. ఈ విషయం ప్రభుత్వాలకు తెలియనిది కాదు కానీ ప్రతిష్ట కోసం కొత్త జిల్లాలను కొత్త రాష్ట్రాలను కొత్త ప్రాంతాలను ఎంపిక చేసిన స్థాయిలో అధికారులు సిబ్బందిని నియామకం చేయకపోవడం అనేది భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అప్రజా స్వామిక విధానం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులను ఆకలింపు చేసుకొనక ముందే జిల్లాల సంఖ్యను పెంచడంతో సిబ్బంది యొక్క అవసరం మరింతగా పెరిగింది కానీ ఆ స్థాయిలో సిబ్బంది నియామకం జరపకపోవడం పది జిల్లాల నుండి 33 జిల్లాలకు పెరిగిన నేపథ్యంలో సిబ్బంది యొక్క అవసరాన్ని ప్రభుత్వం అతిగా గుర్తించకపోయిన కారణంగా నేడు సర్వత్ర ఖాళీలతోనే పరిపాలన కొనసాగుతున్నది. “బీ సీ సంక్షేమ శాఖలో అధికారులేరి” అనే పత్రిక ప్రకటన 8 జనవరి 2023 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన విషయం మనందరికీ తెలిసినదే . ఒక శాసనసభ్యుని పదవి ఏరకంగానో ఖాళీ అయితే ఆరు మాసాలలోగా తిరిగి భర్తీ చేయాలి అనే ప్రభుత్వ నిబంధనను తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వాలు అధికారులు సిబ్బంది ప్రధానమైనటువంటి కార్యదర్శులు స్థాయి విషయాన్ని మరిచిపోయి సంవత్సరాల తరబడిగా అధికారులు లేకుండానే మొక్కుబడి పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం ఎందుకు గుర్తించకూడదు? .ఉప ఎన్నికలకు పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు ఇస్తున్న విలువను అధికారుల భర్తీకి ఇవ్వకపోవడం అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమించినది. ఈ సందర్భానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వాలు జవాబు చెప్పవలసినది పోయి అరకొ ర వసతులు సౌకర్యాలు ఇబ్బందులతో ప్రజల సమస్యలు దాటవేత ధోరణిలోనే కొనసాగితే తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా సమర్ధించుకుంటుంది తన పరిపాలనను దేశానికి ఆదర్శం చేస్తుందో అర్థం కావడం లేదు.
ఇటీవల కాలంలో దాదాపుగా రాష్ట్రంలో హుజూర్నగర్ ,మునుగోడు, హుజురాబాద్ ,దుబ్బాక, నాగార్జునసాగర్ వంటి నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసినదే అతి ఖరీదైన ఉప ఎన్నికలుగా కూడా వీటికి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్నది. అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా సవాలుగా తీసుకునే ప్రయత్నం చేసినవే కానీ ఒక్క శాసనసభ్యుడు లేకపోతే ప్రత్యామ్నాయము ద్వారా పరిపాలన కొనసాగించవచ్చు అని రుజువు చేయలేక పోయినవి . అదే రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా స్థాయి, విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు వంటి ఉన్నత పదవుల్లోని సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట ఖాళీగా ఉన్నప్పటికీ పరిపాలన కుంటుపడుతున్న విషయాన్ని ప్రభుత్వం అంగీకరించకపోవడం ప్రజా ప్రతినిధులకు ఇచ్చిన విలువను అధికారులు సిబ్బందికి ఇవ్వకపోవడమేనని తెలుస్తుంది .ఈ అనాలోచిత చర్య మరొక రకంగా ఆలోచించినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలు, నియామక ప్రక్రియ, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి వంటి అనేక అంశాలకు సంబంధించినది అని ఇప్పటికీ కూడా ప్రభుత్వం గుర్తించకపోవడమే చాలా బాధాకరం. ఈ లోపాలను సమీక్షించుకొని కార్యాచరణను ప్రకటించుకోవడానికి పాలకుల తో పాటు నిరుద్యోగ యువత ప్రజా సంఘాలు మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారని ఆశిద్దాం.

బీసీ సంక్షేమ శాఖలో ఖాళీల కలవరం:-

. బీసీ సంక్షేమ శాఖలో ప్రధానంగా బీసీ కమిషన్ కొనసాగుతున్నప్పటికీ దానికి చైర్మన్ ఉన్నారు కానీ సెక్రటరీ ఖాళీ ఉండడంతో ప్రధాన కార్యదర్శి ఈ బాధ్యతను అదనంగా చూస్తున్నారు. 310 గురుకులాలు ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ పరిధిలో పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారులు లేరు. వాస్తవంగా బీసీ సంక్షేమ శాఖకు ప్రధాన సెక్రటరీ , కమిషనర్ , బీసీ ఎంబీ సీ కార్పొరేషన్లకు ఎండీలు ఐఏఎస్లు ఉండాల్సిన అవసరముంది. కానీ నాన్ ఐఏఎస్ లు కూడా లేకుండా ఆ పదవులు వెలవెల పోతున్నవి. బీసీ వర్గాల అభ్యున్నతి సంక్షేమం కు సంబంధించి ప్రణాళికలు రచించి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రకటించవలసినటువంటి సంక్షేమ శాఖలో అధిక ఉన్నతాధికారులు సిబ్బంది కొరత వలన ప్రభుత్వ పథకాలు ఏవి అట్టడుగు స్థాయికి చేరడం లేదనే విమర్శ సర్వత్రా ఉన్నది. గురుకులాలు హాస్టల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఈ వర్గాల ప్రజలు విద్యార్థులు సిబ్బంది ఇబ్బంది పడుతున్న విషయం తెలిసినదే . బీసీ సంక్షేమ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారి వివిధ విభాగాలకు ఇన్చార్జిగా వ్యవహరించడంతో అతడే ప్రతిపాదన పంపడం అతడే తిరిగి ఆమోదించుకోవడం అనే భిన్నమైనటువంటి విచిత్రమైన వ్యవహారం బీసీ సంక్షేమ శాఖలో చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది . ఇక బీసీ సంక్షేమ శాఖలోని అనేక విభాగాలలో ఉన్న అధికారి పోస్టులన్నింటికీ ప్రధాన కార్యదర్శి ఇన్చార్జిగా వ్యవహరించడంతో పాలన ఏ మేరకు ప్రజలకు చేరువవుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా గురుకులాలకు సంబంధించి ప్రత్యేకంగా సెక్రెటరీగా ఒక ఐఏఎస్ సెక్రటరీని, అడిషనల్ సెక్రెటరీని నియమించవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించక మామూలు సిబ్బందితో ఎల్ల తీస్తున్న కారణంగా ఎన్ని రకాల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది అని ప్రజలు విద్యార్థులు కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. ఐఏఎస్ బదులుగా నాన్ ఐఏఎస్ వ్యక్తి బాధ్యత నిర్వహించడం ఒక తప్పిదం అయితే జాయింట్ డైరెక్టర్లు ముగ్గురికి బదులు ఒక్కరే ఉన్నారు. బీసీ కార్పొరేషన్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను రద్దుచేసి వీరి బాధ్యతలను ప్రభుత్వం జిల్లా బీసీ అధికారులకు అప్పగించడంతో జిల్లాల అధికారులకు తలకు మించిన భారం అవుతున్నట్లుగా వాపోతుండడం కూడా గమనార్హం.

అధికారులు సిబ్బంది నియామకంలో అసంబద్ధ విధానం ఎంతకాలం:?

ప్రధానమైన విభాగాలకు అది పతులు లేకపోవడం, ఐఏఎస్ అధికారులు ఉండవలసిన చోట నాన్ ఐఏఎస్ అధికారులు కూడా లేకుండా ఖాళీగా ఉండడం, కొన్నిచోట్ల నాన్ ఐఏఎస్ అధికారులతోనే మొక్కుబడిగా కార్యక్రమాలు నడుపుకోవడం, విభాగాల బాధ్యతలను జిల్లా అధికారులకు అదనంగా అప్పగించడం వంటి అసంబద్ధ విధానాల వలన ఈ శాఖలో పనిచేస్తున్న కొద్దిమంది సిబ్బందికి అయినా అదనంగా పెనుబారం పడుతున్నట్లు దానివలన తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించలేక సిబ్బంది వాపోతున్నట్లుగా తెలుస్తున్నది. మరింత గమ్మత్తయిన విషయం ఏమిటంటే బీసీ సంక్షేమ శాఖ లోనే ఉద్యోగుల కరువు కొనసాగుతున్నదంటే ఈ శాఖ నుండి సిబ్బందిని, అధికారులను ఇతర విభాగాలకు ఇన్చార్జీలుగా నియమించడం వంటి పూర్తి తప్పుడు నిర్ణయాల వలన కూడా క్షేత్రస్థాయిలో ఈ శాఖను సిబ్బంది సమస్య వెంటాడుతుండగా ఆయా విభాగాలలో ప్రజలకు సమకూర్చవలసినటువంటి కార్యకలాపాల విషయంలో మరింత తాత్సారం జరుగుతున్న కారణంగా ముఖ్యంగా మెజారిటీ 56% గా ఉన్నటువంటి బీసీ వర్గాలకు అందవలసినటువంటి రాజ్యాంగ పలాలు అందకుండా పోవడం కూడా ప్రభుత్వ కుట్ర లో భాగమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు .ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చాలా పాఠశాలల్లో, హాస్టల్లో, గురుకులాలలో అరకొ ర సిబ్బందితో చాలీచాలని వసతులతో కార్యకలాపాలు కొనసాగుతుంటే అక్కడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా మనం ప.త్రికలద్వారా వింటూ ఉన్నాం. మొత్తం మీద బీసీ సంక్షేమ శాఖ మెజారిటీగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన సకల సమస్యలను పరిష్కరించే క్రమంలో సిబ్బంది సమస్య వెంటాడుతున్న కారణంగా పరిమితమైనటువంటి కార్యకలాపాలకు మాత్రమే మొక్కుబడిగా మిగిలిపోవడంతో బీసీ వర్గాలు రాజ్యాంగబద్ధంగా సంక్రమించవలసినటువంటి ఫలాలను అందుకోవడంలో తీవ్ర అసౌకర్యంతో పాటు ఉత్కంఠను ఎదుర్కొంటున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు .ఉన్నతాధికారులు లేకపోవడం ఒక లోపం అయితే కిందిస్థాయి జిల్లా స్థాయి సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ఇన్చార్జిల పరిపాలన కారణంగా కూడా పాలన సవ్యంగా జరగడం లేదనే ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి తెలిసి ఉండి కూడా సిబ్బందిని నియమించకపోవడంలోని ఆంతర్యం ఏమిటి ? ప్రజా సంఘాలు, అఖిలపక్షాలు ప్రభుత్వం మీద ఈ విషయంలో ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? ముఖ్యంగా అధికార పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతున్నటువంటి వామపక్షాలు సిబ్బంది నియామకం విషయంలో పూర్తిగా అనాలోచితంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చారిత్రక తప్పిదంగా భావించవచ్చు ..
బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్లు ప్రధానంగా ఆ వర్గాలకు చెందినటువంటి ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకొని తగిన ప్రణాళిక రూపకల్పన చేయడం ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ఎక్కువ ప్రాధాన్య తీయవలసి ఉంటుంది. కానీ మేనేజింగ్ డైరెక్టర్లు లేకపోవడం, కార్యదర్శులు లేకపోవడం, చైర్మన్లు కూడా లేకపోవడం వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి బీసీ సంక్షేమ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం ద్వారా ప్రభుత్వం బేషరతుగా బీసీ వర్గాలకు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించి రుజువు చేసుకోవలసిన అవసరం చాలా ఉన్నది . అన్ని శాఖలతోపాటు మెజారిటీ ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీసీ సంక్షేమ శాఖను కూడా నిర్లక్ష్యాన్ని గురి చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని ఎండ కట్టడంలో అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు ముఖ్యంగా చట్టసభ లోపల ఎందుకు విఫలమవుతున్నాయి? అనే సమస్య ఇవాళ ప్రధానంగా ప్రజలను వేధిస్తున్నది. ముఖ్యంగా సిబ్బంది నియామకం పైన కేంద్రీకరించి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని తీసుకోవాలని ఈ విషయంలో వామ పక్షాలు ముందుంటే సంతోషించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామికవాదులతో పాటు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న విషయాన్ని రాజకీయ పక్షాలు ఆకలింపు చేసుకుంటే మంచిది. లేకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుందని ఇప్పటికైనా గుర్తించడం శ్రేయస్కరం .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Continue Reading

ARTICLE'S

సాహితీవేత్తకి సన్మానం

Published

on

డా. తుమ్మల దేవరావ్ కు సాహితీ మిత్రుల సన్మానం

జనం వెలుగు నిర్మల్ బ్యూరో:-  జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుఱ్ఱం జాషువా కవిత పురస్కారం కు ఎంపికైనందున నిర్మల్ సాహితీ మిత్రులు మునిమడుగుల రాజరావ్, పత్తి శివప్రసాద్, నెరేళ్ల హన్మంతు, మచ్చేందర్ తదితరులు డా. తుమ్మల దేవరావ్ ను ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారాలతో పాటు నిర్మల్ జిల్లా కీర్తిని ఇనుమడింప జేశారని కొనియాడారు. చరిత్ర పరిశోధనల ద్వారా 15 శాసనాలను వెలుగులోకి తేవడం, తుమ్మల రాసిన కవిత్వం రాష్ట్ర స్థాయిలో చర్చనీయంగా మారుతుందని వీరి కథలకు పురస్కారం తో అనేక సాహితీ, చారిత్రక వ్యాసాలు ప్రచురితం అవ్వడం అభినందించారు. ఇందులో సాహితీ మిత్రుల సహాకారంతోనే తను రచనలు చేస్తున్నానని సన్మాన గ్రహీత తుమ్మల దేవరావ్ అన్నారు.

Continue Reading