Connect with us

Education

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక

janamvelugunews

Published

on

మధుర జ్ఞాపకాలను మిగిల్చిన ఆల్ఫోర్స్ చమక్ – 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక

జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- పాఠశాల విద్య మధురానుభూతులను మిగులుస్తాయని చాలా కీలకంగా వ్యవహరిస్తూన్నాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి స్థానిక అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ ప్రాంగణంలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు చదువుల తల్లి సరస్వతిమాత విగ్రహానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని వారు చెప్పారు. తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతుందని మరియు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. 10వతరగతిలో అత్యుత్తమ మార్కులను సాధించి విద్యార్థి జీవితంలో పొందేటువంటి మొట్టమొదటి పట్టాను చాలా ప్రశంసనీయంగా చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు నిర్దేశించినటువంటి ఆశయాలను సరియైన క్రమంలో పయనించి వాటిని సాధించే దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఎంతో మంది మహానుబావులు వారి ఉపాధ్యాయుల మార్గాలను పాటించి, అవలంబించిన విధానాలను చాలా బాగా అమలుపర్చి ఉత్తమంగా ఉండాలని చెప్పారు.విద్యార్థులకు పాఠశాలలో చదువుకున్న రోజులు చాలా మధుర జ్ఞాపకాలను మిగిలుస్తాయని వారు చెప్పారు. ప్రత్యేకంగా విద్యార్థులకు లక్ష్యాలను సాధించే విదానాలను సమగ్రంగా సముచితంగా తెలియపర్చాలని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి చాలా సవాళ్ళతో కూడుకున్నదని, అంతటి సవాళ్ళను సులభంగా ఎదురకునేటట్టు సందేశాలను ఇస్తున్నామని ప్రత్యేకంగా విద్యార్థులకు వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ పారితోషికాలను అందజేస్తున్నామని వారు చెప్పారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ఉత్తమంగా విద్యను అందించినందుకు మరియు ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేసిన విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డిని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడంతో పాటు జ్ఞాపా కలను ప్రధానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి రామ్సియరామ్, ఓమ్నారహ, కొమ్మా ఊయాల, స్నేహమేరా శాశ్వతం, చిన్ని చిన్ని ఆశ నృత్యాలు చాలా ఆకర్షనీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Education

|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి

janamvelugunews

Published

on

భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.

కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.

సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.

కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

Education

| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు

janamvelugunews

Published

on

పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు

జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది.  విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Crime

రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి

janamvelugunews

Published

on

రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలిగిచూసింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటుచేసుకున్నా ఇప్పటివరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద, మండల వైద్యాధికారి, ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంఇఓను చారవాణిలో సంప్రదించగా ఘటన వాస్తవమేనని తెలిసిందని ఈ రోజు వెళ్లి విచారించి నివేదిక పంపిస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందని, అందుకే అతడిని పాఠశాల నుండి వెళ్లిపోమని చెప్పినట్లు వివరించారు.

Continue Reading