Connect with us

Politics

సౌత్ లో కమలం వికసిస్తోందా…

janamvelugunews

Published

on

సౌత్ లో కమలం వికసిస్తోందా…

జనంవెలుగు, బెంగళూరు, జూన్ 24:- బీజేపీని ఉత్తరాది పార్టీ అంటారు. దక్షిణాదిన కూడా విస్తరించాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో చాలా వరకూ ముందడుగు వేసింది.  వచ్చే ఎన్నికల నాటికి కొన్ని రాష్ట్రాలను కమ్మేసినా ఆశ్చర్యం లేదన్న ఫలితాలు వచ్చాయి. సీట్ల పరంగా  మాత్రమే కాదు.. ఓట్లు పరంగా కూడా. నిలకడగా పెరుగుతున్న బీజేపీ ఓటు బ్యాంక్ దక్షిణాదిలో  ఆ పార్టీ పవర్ గా మారుతోంది. గతంతో పోలిస్తే ఈ సారి సీట్లు పెద్దగా పెరగలేదు కానీ.. ఓట్లు మాత్రం ఊహించని విధంగా పెరిగాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూస్తే మొత్తంమీద బిజెపికి యూపీ, మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ తగిలింది.  కేవలం 240 స్థానాలు మాత్రమే తెచ్చుకోగలిగింది. 2014, 2019 ఎన్నికలలో వచ్చిన ఫలితాలను చేరుకోలేకపోయింది. నరేంద్ర మోడీ ఇప్పుడు నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌  సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సి వచ్చింది.  ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తీవ్రంగా నష్టపోయింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలలోనూ దెబ్బతిన్నది.  కానీ ఒడిషాలో బిజెపి మున్నెన్నడూ లేని విజయాలు సాధించింది. 21 లోక్‌సభ స్థానాలలో 20 తెచ్చుకోవడమే గాక మొట్టమొదటి సారిగా  అక్క ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఇక ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో  బీజేపీ  క్రమంగా బలపడుతోంది.   సీట్ల వారీగా చూసినప్పుడు బిజెపి ఈ ప్రాంతంలో పెద్ద పురోగతి సాధించినట్టు కనిపించకపోవచ్చు. ఎందుకంటే అయిదు దక్షిణాది రాష్ట్రాలలో కలిపి దానికి 2019లో 29 సీట్లు వస్తే ఇప్పుడు 2024 లోనూ ఆ సంఖ్య పెరిగింది లేదు. కానీ రాష్ట్రాల వారీ పరిస్థితులు, ఓట్ల వాటా బాగా లోతుగా విశ్లేషిస్తే  ఓట్ల శాతం గణనీయంగా పెంచుకుంటూ వెళ్తోంది. తెలంగాణలో బిజెపికి 2019లో నాలుగు సీట్లు, 19.45 శాతం ఓట్లు రాగా 2024 ఎన్నికలలో ఆ సంఖ్య రెట్టింపై 8 సీట్లు గెలవగలిగింది. ఓట్ల వాటా కూడా గణనీయంగా 35.19 శాతానికి పెరిగింది. బిఆర్‌ఎస్‌ ఓట్ల వాటా దారుణంగా పడిపోవడం బిజెపికే మేలు చేసింది.  కర్ణాటకలో  బిజెపికి కొంత బలం పోగొట్టుకున్నది. కానీ ఓట్లు కోల్పోలేదు.  2019 ఎన్నికలలో అది 25 సీట్లు 51.38 శాతం ఓట్లు తెచ్చుకుంటే ఇప్పుడు 17 సీట్లకు పరిమితమై 46.09 శాతం ఓట్లు   తెచ్చుకోగలిగింది. అయితే జత కలిసిన జేడీఎస్  5.64 శాతం ఓట్లు తెచ్చుకోవడంతో మొత్తం ఎన్‌డిఎ ఓట్ల శాతం 51.73 అయింది. అంటే బలం నిలబడినట్లే.  తమిళనాడులో బీజేపీ  ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది.  2019లో అయిదు సీట్లకు పోటీ చేసిన బిజెపి ఓట్ల శాతం 3.66 శాతం అయితే ఇప్పుడు 11.24 శాతానికి పెరిగింది. పది నియోజక వర్గాలలో బిజెపి రెండవ స్థానంలో వచ్చింది.   అంటే కొన్ని సీట్లలో అది ఎఐడిఎంకె ఓట్లను తెచ్చుకోగలిగిందని అర్థమవుతుంది.  కేరళలో బిజెపి త్రిసూర్‌ సీటు గెలిచి మొదటిసారి ఒక లోక్‌సభ స్థానం పొందగలిగింది.   2019లో 12.9 శాతం ఓట్ల శాతం వుంటే ఇప్పుడు 16.67 శాతానికి పెరిగింది. మొత్తం ఎన్‌డిఎ వాటా 19.2 శాతానికి అంటే కేరళలో ఎన్నడూ రానంత అధికంగా పెరిగింది.   బిజెపి చాలా బలహీనంగా వున్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పొత్తు వల్ల లాభపడింది. 2019లో కేవలం 0.96 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు మూడు పార్లమెంటు సీట్లు గణనీయమైన ఓట్లను సాధించింది. బీజేపీ కర్ణాటకలో రెండు దశాబ్దాల కిందటే బీజేపీ  బలమైన పునాది ఏర్పర్చుకుంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కూడా నెమ్మదిగా అప్పుడప్పుడూ ఆగుతూనైనా బిజెపి ముందుకు సాగుతున్నది.   బీజేపీ రాజకీయాలు చాలా దూరదృష్టితో ఉంటాయి.  వచ్చే ఎన్నికల నాటికి హిందీ రాష్ట్రాల్లో దెబ్బతిన్నా సౌత్ లో భారీ విజయాలతో నాలుగోసారి గెలవాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్లాన్ చేసుకుటున్నారు. దక్షిణాదిలో ఆ పార్టీ వ్యూహం అదే్ నిరూపిస్తోంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది

janamvelugunews

Published

on

తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.

జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.

సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.

ఆర్మూర్లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.

Continue Reading

Politics

| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు

జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం

మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి

జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.

Continue Reading

Politics

| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది

janamvelugunews

Published

on

మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం

జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.

చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.

మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్‌లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.

*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం

Continue Reading