Connect with us

నిజామాబాద్

సంక్షేమ వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి

janamvelugunews

Published

on

సంక్షేమ వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

హాస్టళ్ల నిర్వహణ తీరుపై సంక్షేమ అధికారులతో సమీక్ష

నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

జనంవెలుగు, నిజామాబాద్, సెప్టెంబర్ 18:- సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల పనితీరు మెరుగుపడేలా సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు. విద్యా వ్యవస్థను పటిష్టపర్చడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల నిర్వహణ తీరుతెన్నులపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో నెలకొని ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని, గడిచిన మూడు సంవత్సరాల నుండి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో సాధించిన ఉత్తీర్ణత గురించి ఒక్కో హాస్టల్ వారీగా వివరాలు ఆరా తీశారు. ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు తదితరులు హాస్టళ్లను తనిఖీ చేసిన సందర్భంగా గమనించిన లోటుపాట్లను ప్రస్తావిస్తూ, వాటిని చక్కదిద్దుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన గురుతర బాధ్యత సంక్షేమ అధికారులపై ఉందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలన్నారు. కేవలం సగటు ఉత్తీర్ణతతోనే సరిపెట్టుకోకుండా, ప్రతి విద్యార్ధి మెరిట్ సాధించేలా చొరవ చూపాలని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుండే చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉండే బ్రాండెడ్ వస్తువులనే వినియోగించాలన్నారు. ప్రతి వసతి గృహంలో సరిపడా తాగునీరు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ లు అందుబాటులో ఉండాలని, టాయిలెట్స్, వాష్ ఏరియా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా మౌలిక సదుపాయాల కొరత నెలకొని ఉంటే, ప్రభుత్వ పరంగా సౌకర్యాల కల్పనకు తాము చొరవ చూపుతామని, విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన అందేలా సంక్షేమ అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రైవేట్ బడులతో పోలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలలో పనిచేసే అధ్యాపకులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు ఎక్కువ ప్రతిభ కలిగి ఉంటారని, తదనుగుణంగా విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, అన్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో పిల్లలకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యా బోధన, సరైన వసతి సదుపాయాలు అందుబాటులో ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. తనతో పాటు జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఎక్కడైనా నిర్వహణపరంగా లోపాలు వెల్లడైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది సైతం తలెత్తకుండా సమర్ధవంతంగా వసతి గృహాలను నిర్వహించాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యమైన సరుకులు, కూరగాయలను వినియోగించాలని హితవు పలికారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యాధికారిని సంప్రదించి చికిత్స చేయించాలని, పై అధికారులకు సమాచారం తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి హాస్టల్ లో ఎల్లవేళలా అధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ జరపాలని, రాత్రి వేళల్లోనూ తప్పనిసరిగా హాస్టల్ లోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, కళాశాలల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా ఎక్కడైనా లోటుపాట్లు జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంస్థల ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, సంక్షేమ శాఖల అధికారులు, ఆర్.సీ.ఓలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

అరణ్య అర్బన్ పార్కును వర్చువల్ గా ప్రారంభోత్సవం చేసిన సీ.ఎం

janamvelugunews

Published

on

అరణ్య అర్బన్ పార్కును వర్చువల్ గా ప్రారంభోత్సవం చేసిన సీ.ఎం

పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు

నిజామాబాద్ జూన్ 18: నిజామాబాద్ నగర శివారులో గల మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పన, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, వి. భుజంగ రావు, అదనపు డీసీపీ శుభం ప్రకాష్ నగ్రాలే, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పర్యటించి అర్బన్ పార్క్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్రాక్, ప్లే జోన్ ఏరియా, కల్వర్టులు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, సోలార్ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని కాపాడడానికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అటవీ శాఖ కార్యక్రమాలను సైతం ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చెట్లు నరకడం ఎంతో సులభం అని, కానీ పర్యావరణానికి, ప్రాణికోటికి ఎంతో మేలు చేకూర్చే మొక్కలు నాటి, వాటిని కాపాడడం గురించి ఎంతో మంది తమకు ఎందుకులే అని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే, పచ్చదనం పెంపొందించబడుతుందని అన్నారు. జిల్లాలో అటవీ శాఖ పరంగా చేపట్టే కార్యక్రమాలకు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, 63వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని, నిజామాబాద్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే 476 ఎకరాల విస్తీర్ణంలో అరణ్య అర్బన్ పార్క్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. దైనందిన కార్యకలాపాలతో అలసిన వారికి అర్బన్ పార్క్ ఆహ్లాదం పంచుతుందని, వ్యాయామం చేసుకునే వారికి మరింత వెసులుబాటు ఏర్పడిందని అన్నారు. అర్బన్ పార్క్ లో మరిన్ని వసతులు అందుబాటులో తెచ్చేలా జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని అన్నారు. అర్బన్ పార్క్ లో అసాంఘిక శక్తులకు ప్రవేశం లేకుండా గట్టి నిఘా ఉంచాలని అటవీ అధికారులకు సూచించారు. అటవీ ప్రాంత సంరక్షణ, విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. అడవులకు నష్టం కలిగించే వారి పట్ల అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయన్న, డీఎఫ్ఓ సుధాకర్, సర్పంచ్ లు కే.లత, గంగాధర్, చిన్నా, విద్యార్థిని, విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

పేదవానికి చదివే వజ్రాయుధం

janamvelugunews

Published

on

పేదవానికి చదివే వజ్రాయుధం

జనంవెలుగు, నందిపేట్ జూన్ 18:- గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట మండల కేంద్రంలో పర్యటించి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జాతీయస్థాయి స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులకు స్థానిక మోడల్ స్కూల్లో మెమొంటోను అందజేశారు.

  8 తరగతి చదువుతున్న చేపూర్ శ్రీహిత, పాణెం హర్షిత, గొల్లపల్లి అలంకృత, రాచ కనిష్క్ లు మోడల్ స్కూల్లో చదివి జాతీయస్థాయి స్కాలర్షిప్ సొంతం చేసుకోవడం చాలా సంతోషం అంటూ వారిని ఘనంగా శాలువాతో సత్కరించి ఆ పిల్లల తల్లిదండ్రులను, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను అభినందించారు.

   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. డబ్బున్న వాడికి డబ్బుతో పాటు విద్యా, వైద్యం, విలాసం ఇలా రకరకాల సదుపాయాలన్నీ సమృద్ధిగా అందుతాయని డబ్బు లేని వానికే విద్యా వైద్యం విలాసం ఇలా అన్ని భారంగా మారుతాయి అని, అందుకే ప్రతి పేదవానికి విద్య అనేది వజ్రాయుధం లాంటిదని, విద్యతోనే ధనికునితో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొచ్చని,

   సమాజంలో మంచి గౌరవం అందుతుందని అందు కొరకు అహర్నిశలు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. కటిక పేదరికమైన చదువు అనే వజ్రాయుధంతో తలరాతను మార్చుకోవచ్చని, అందుకే ఏ ఒక్క విద్యార్థి కూడా నిరాశ నిస్సృహ చెందకుండా చదువుపై మంచి ద్యాస పెట్టి లక్ష్యాలను చేదించాలని,

    నిరుపేదగా పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది విద్యార్థుల ఘాతను ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను చేదించాలన్నారు. మొన్నటికి మొన్న ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ అనే ఒక 15 ఏళ్ల కుర్రాడు సిక్సులు బాదుతుంటే యావత్ ప్రపంచమంతా నివ్వరపోయిందని, అతి చిన్న వయసులో ఎన్నో రికార్డులను అధిగమించాడని,

    ఆ బుడ్డోడు సాధించిన ఘనతల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు పడ్డ బాధలు, ఆ బాలుడి పట్టుదల ఆ ఘనతను సాధించేలా చేసిందని ఉదాహరించాడు. జాతీయస్థాయి స్కాలర్షిప్ పొందిన పిల్లలు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాలు సంవత్సరంకు 12 వేల రూపాయల చొప్పున 48 వేల రూపాయలను పొందుతారని ఆయన అన్నారు.

   అందుకే నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకు అనునిత్యం అసెంబ్లీలో నిరుపేదలకు విద్య, వైద్యంపైనే మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. నిరుపేదలంటే ఇష్టమని ఆ నిరుపేదలకు విద్యా వైద్యం అందకపోతే ఊరుకోనని, పేద విద్యార్థుల కొరకు అహర్నిశలు పాటుపడతానన్నారు.

  అలాగే గురువులు కూడా ప్రతి పేద విద్యార్థిని తమ పిల్లలుగా అనుకొని నిత్యం వారి వెన్నంటా ఉండి మంచి విద్యా బోధన చేస్తూ మెరకల్లాంటి విద్యా కుసుమాలను తయారు చేయాలని, కుల మత ధన తారతమ్యాలను పక్కనపెట్టి, మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ దేశభక్తి గల పౌరులను తయారుచేసి దేశానికి అందించాలని విజ్ఞప్తి చేశారు.

  ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈఓ అవధూత గంగాధర్, సర్పంచ్ సిలిండర్ లింగం, మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్, నందిపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పటేళ్ల రాజు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి

janamvelugunews

Published

on

టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి

నిజామాబాద్ ఆర్ టి సి నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి బాధ్యతల చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా భాద్యతలు చేపట్టిన వెంటనే పి. జ్యోతి నిజామాబాద్ బస్ స్టేషన్, డిపోలను సందర్శించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణీకుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో పర్సనల్ ఆఫీసర్ పద్మజ, ఏ.ఓ. బి. స్వరూప, నిజామాబాద్ 1 డి ఎం ఆనంద్, నిజామాబాద్ 2 డి ఎం, జి ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి, బాన్స్ వాడ డి ఎం రవికుమార్, కామారెడ్డి డి ఎం దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, నిజామాబాద్ 1డిపో సి ఐ జనాభాయి, ఎం ఎఫ్ వసుంధర, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading