Connect with us

Crime

గ్రామాభివృద్ధి కమిటీల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం : పోలీస్ కమీషనర్ హెచ్చరిక

janamvelugunews

Published

on

Views: 1

గ్రామాభివృద్ధి కమిటీల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం : పోలీస్ కమీషనర్ హెచ్చరిక

జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 9: గ్రామాభివృద్ధి కమిటీల (VDC) అక్రమ కార్యకలాపాలను భరించేది లేదని, చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ అన్నారు.

15 సంవత్సరాల క్రితం గ్రామాభివృద్ధి అవసరాల కోసం ఏర్పడిన ఈ కమిటీలు, కాలక్రమేణా అధికారాలను దుర్వినియోగం చేసేందుకు మొదలుపెట్టాయని పోలీస్ కమీషనర్ కార్యాలయం వెల్లడించింది. గ్రామాలలో జరుగుతున్న భూ తగాదాలు, కుటుంబ వాదనలు, వివాహ సంబంధ విషయాలు వంటి సివిల్ సమస్యలను కమిటీలు తాము పరిష్కరిస్తున్నట్టు ప్రకటిస్తూ, తమ నిర్ణయాలను అందరూ పాటించాలని గ్రామస్థులను భయపెడుతున్నట్టు చెప్పారు.

ఇంతటితో ఆగకుండా, గ్రామంలో బెల్టు షాపులు, కూల్ డ్రింక్స్ షాపులు, కిరాణ షాపులు, కోడిగుడ్డు ధరలు వంటి వాటిపై వేలం నిర్వహిస్తూ అధిక ధర చెల్లించిన వారికి మాత్రమే వ్యాపారం చేసే హక్కు ఇస్తున్నట్టు వెల్లడించారు. గ్రామస్థులపై ఆర్థిక భారం మోపుతూ, పంచాయితీల సమయంలో రెండు వర్గాల నుండి డబ్బులు వసూలు చేసి పంచాయితీ నిర్వహించడం వీరి నిత్యకృత్యంగా మారిందని పోలీస్ కమీషనర్ తెలిపారు.

ఈ చర్యలు పూర్తిగా చట్టవ్యతిరేకమని స్పష్టం చేశారు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించి, ఎలాంటి సమస్యలైనా సంబంధిత ప్రభుత్వ శాఖల వద్ద పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధి కమిటీల అక్రమ చర్యల వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే, తమ దగ్గర పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించాలన్నారు.

భవిష్యత్తులో ఎవరు బహిష్కరణలు జరిపినా, చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

| Nizamabad crime అంతరాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ల, రాగి తీగల దొంగల ముఠా అరెస్టు

janamvelugunews

Published

on

Views: 4289

అంతరాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ల, రాగి తీగల దొంగల ముఠా అరెస్టు

జిల్లా పోలీసు కమీషనర్ సాయి చైతన్య

జనం వెలుగు ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్, నందిపేట్, బోధన్ రూరల్, ఎడపల్లి, నిర్మల్ జిల్లాలోని బాసర,మూధోల్, బైంసా, కుంటాల,నర్సాపూర్ జి తథితర మండలాల శివారులో ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన రాగి తీగ లను దొంగ తనాలకు పాల్పడే అం తరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేసినట్లు నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య తెలిపాడు. జిల్లా కేంద్రంలోని పోలీసు కమీ షనరేటు కార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెల్లడించాడు.

ఎలక్ట్రిసిటి డిపార్ట్ మెంట్ కు సంబంధించిన అధికారులు తమ ఆధీనంలో గల ట్రాన్స్ ఫా ర్మర్ల నుండి రాగి తీగలను దొంగలు దొంగలించుకు పోయారని గతంలో ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నామోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఉత్తర రూరల్ సిఐ బి శ్రీనివాస్, నవీపేట్ ఎస్ఐ కే శ్రీకాంత్ అధికారులు దర్యాప్తు చేయడం జరిగిందని ఆయన తెలిపాడు.

అఫ్జల్ ఖాన్ ఆటో డ్రైవర్ నిజామాబాద్, అన్సార్ అలియాస్ హుస్సేన్ ఖాన్ ఆటో డ్రైవర్ రేంజల్ మండలం, షేక్ తాహేర్ ఆటో డ్రైవర్ నిజామాబాద్, అర్బాజ్ ఖాన్ అలియాస్ అల్బాజ్ మేస్త్రి భైంసా, ప్రస్తుతం ధర్మపురి హిల్స్ నిజామాబాద్, సిద్దిక్ ఖాన్ ఆటో డ్రైవర్ రేంజల్ మండలం, మహమ్మద్ అఫ్సర్ ఆటో డ్రైవర్ భైంసా ప్రస్తుతం ఫరారిలో ఉన్నాడని ఆయన తెలిపాడు. మహబూబ్ ఖాన్ స్క్రాప్ షాప్ వ్యాపారం, భైంసా, బోర్గే బాలాజీ స్టీల్ షాప్ దుకాణం, అర్సపల్లి నిజామాబాద్, షేక్ ఆరీఫ్ పాత ఇనుప సామాన్ల వ్యాపారం, ఇత్వార బజార్ నాందేడ్, మహారాష్ట్ర, మహమ్మద్ రజా పాత ఇనుప సామాన్ల వ్యాపారం, వెంగళరావు కాలనీ నిందితుల నుండి సొమ్మును రికవరీ చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపాడు. 20 క్వింటాళ్ళ రాగి తీగలు, 2 లక్షల 75 వేల రూపాయల నగదు,రెండు టు వీలర్ వాహనాలు, ఒక ఆటో, దొంగ తనానికి వాడిన హక్సు బ్లేడ్లు 05 పని ముట్లు ఉన్నాయని ఆయన తెలిపాడు.

అఫ్జల్ ఖాన్ కు సంబంధించిన ఆటోలో అందరూ కలిసి వచ్చి ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన రాగి తీగలను దొంగ తనం చేసే వారని, వీరి మీద సుమారు 34 కేసులకు సంబంధించి సుమారు 10 క్వింటాళ్ళ రాగి తీగలను దొంగిలించడం జరిగిందని, ఈ రాగి తీగలను నిజామాబాద్ లోని ఏపిఎచ్బి కాలనీలో చిన్న రూంను అద్దెకు తీసుకుని అక్కడ దాచి పెట్టి,వాటిని గోనె సంచులలో నింపుకుని తరలించుకు పోయి అమ్ముకుని సొమ్ము చేసుకునే వారని ఆయన తెలిపాడు. భైంసాకు చెందిన మహబూబ్ ఖాన్ కిలోకు 800 రుపాయల వంతున అమ్మేవారని, నిజామాబాద్ కు చెందిన బాలాజీకి, రహన్ రజాకు, నాందేడ్ కు చెందిన ఆరిఫ్ లకు అమ్మగా వచ్చిన డబ్బులను జల్సాలకు, ఇతర వాటికి ఖర్చులు చేసే వారని ఆయన తెలిపాడు.

పోలీసులు తమ చాక చక్యంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గ్యాంగ్ ను పట్టుకుని నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన 34 కేసులను డిటెక్టు చేయడం జరిగిందని నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్ తరలించడం జరిగిందని ఆయన తెలిపాడు.ఈ కేసును చేదించిన నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ యాదవ్ ఆద్వర్యంలో టీంలుగా ఏర్పడి ఉత్తర రూరల్ సిఐ బి శ్రీనివాస్,నవీపేట్ ఎస్ఐ కే శ్రీకాంత్,ఎస్ఐ యాదగిరి గౌడు, ఎస్ఐ రాజశేఖర్, మాక్లూర్ ఎస్ఐ గంగాధర్,5 వ టౌన్ ఏఎస్ఐ గఫార్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుల్లు రాజారెడ్డి, సందీప్, అబ్బులు,శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ తదితరులను సిపి అభినందించాడు.

Continue Reading

Crime

|nandipet crime నందిపేటలో పట్టుబడ్డ ఆల్ఫాజోలం

janamvelugunews

Published

on

Views: 3038

నందిపేటలో పట్టుబడ్డ ఆల్ఫాజోలం

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం జోజిపేట్ గ్రామంలోని కళ్ళు డిపో వద్ద బుధవారం నందిపేట ఎస్సై రామ్ పోలీస్, ఎక్సైజ్ సిబ్బందితో దాడి నిర్వహించారు. దాడిలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం(కల్తీ కళ్ళు తయారు చేసేందుకు ఉపయోగించే మత్తు పదార్థం)167.5 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్సై రామ్ మాట్లాడుతూ నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల జోజిపేట గ్రామంలో ని కళ్ళు డిపో వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడి చేయడం జరిగిందని, ఆ దాడిలో ముగ్గురు వ్యక్తులపై అనుమానం వచ్చి విచారించగా వారి వద్ద కల్తీ కళ్ళు తయారు చేసేందుకు ఉపయోగించే మత్తు పదార్థాలను పట్టుకోవడం జరిగిందని, సికోటి రవీందర్ గౌడ్, బత్తిని భరత్ కుమార్ గౌడ్, ధర్మేందర్ లను అదుపులోకి తీసుకున్నామని, ప్రధాన నిందితుడు జయవర్ధన్ గౌడ్ పరారీలో ఉన్నాడని, వీరిపై ఎన్ డి పి ఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నామని వీరి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, దొరికిన మత్తు పదార్థం విలువ ఒక లక్ష 67 వేయిలు ఉంటుందని ఆయన అన్నారు.

Continue Reading

Crime

| Nizamabad ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి బాధాకరం

janamvelugunews

Published

on

Views: 6413

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి బాధాకరం

 సంతాపం ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 01 : ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందని, చికిత్స పొందుతూ మృతి చెందడం దురదృష్టకరం అన్నారు.

మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, సౌమ్య మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Continue Reading