Connect with us

Crime

మా ప్రాణాలకు దిక్కెవరు

janamvelugunews

Published

on

మా ప్రాణాలకు దిక్కెవరు

కావాడాల్సిన అధికారులే కక్కుర్తి

మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం

దాదాపు వందల వాహనాలు నిలిపేశారు

జనంవెలుగు, నందిపేట్:- తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే నల్లమట్టి మాఫియా అని చెప్పవచ్చు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గోదావరి నది ఒడ్డున నల్లమట్టి తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. నిర్మల్- నిజామాబాద్ సరిహద్దు కావడంతో జిల్లా దాటుతున్న నల్లమట్టిని సంపదను దళారులు స్వేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రతి రోజూ దాదాపు వందల టారస్ వాహనాల నల్లమట్టి తరలిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైతులకు, పంట పొలాలకు సహాయపడే ఈ సహజ వనరు దళారుల చేతిలో వ్యాపార వస్తువుగా మారిపోయింది.

నందిపేట్ మండలం బజార్ కొత్తూరుకు చెందిన రైతు, కొత్తూరు నుంచి కొండూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మృత్యువును తలదాటి బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. ఎదురుగా భారీ ఓవర్‌లోడ్, అత్యధిక వేగంతో టారస్ వాహనాలు ఒకదానికొకటి ఓవర్‌టేక్ చేసుకుంటూ ఊగిపోయేలా దూసుకొచ్చాయి. ఆ వాహనాల నుండి ఒక్కసారిగా భారీ మట్టి ముద్ద రోడ్డుపై పడిపోవడంతో, రైతు కేవలం క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు.

రోడ్డు పైన పడి ఉన్న మట్టి బిడ్డల మధ్యన పొరుగు వాహనదారులు నిస్సహాయంగా నిలిచిపోతున్నారు. ఏ మూల నుంచి వెళ్లాలో వారికి దిక్కుతోచని పరిస్థితి. రోజు ఇదే తంతు కొనసాగుతున్నా, అధికారుల తీరు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉన్నా — అధికారులు నిమ్మకునే రేకెత్తినట్టు వ్యవహరిస్తుండటం ప్రజల్లో అనేక అనుమానాలు రేపుతోంది.

“ఈ బారి వాహనాల రెచ్చిపోతున్న తీరు చూస్తే, మృత్యువు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరులో కొనసాగితే వాహనదారులు రోడ్డుపై ప్రాణాలతో తిరగడమే సందేహంగా మారనుంది. రైతు అక్కడికక్కడే వందల సంఖ్యలో వాహనాలను నిలిపేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాలి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

janamvelugunews

Published

on

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రూ.11.10 లక్షల జరిమానా విధింపు – 9 మందికి జైలు శిక్ష

జనం వెలుగు, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గడిచిన వారం రోజుల్లో 138 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.

తేదీ 25-05-2026 నుండి 30-05-2026 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 138 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 9 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.11,10,000 జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

పోలీస్ కమిషనర్ సూచనలు:

• మద్యం సేవించి వాహనాలు నడపరాదు.

• వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలి.

• డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడుతుంది.

• మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా ప్రయోజనాలు లభించవు.

• మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

• ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది.

మోటార్ వెహికల్ యాక్ట్–1988 సవరణ చట్టం–2019 ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చని, రెండోసారి పట్టుబడితే రూ.15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు.

Continue Reading

Crime

|crimenews నందిపేట మండల కేంద్రంలో చోరీ….

janamvelugunews

Published

on

నందిపేట మండల కేంద్రంలో చోరీ….

పొద్దున పొద్దున్నే 10 తులాల బంగారం రెండు లక్షల నగదు అపహరణం….

కట్ట పనికి వెళ్లొచ్చే సరికే కానిచ్చేశారు..

నందిపేట్ మే 28 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర నాగమంతెన సంఘం దగ్గర కాలనీలో నివాసం ఉంటున్న నడ్కుడ రాధా ఇంట్లో చోరీ జరిగింది.

   బుధవారం సుమారు ఉదయం 7- 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సుమారు 10 తులాల వరకు బంగారం 2 లక్షల రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నడ్కుడ రాధ భర్త చనిపోయి చాలా రోజులవుతుంది, తన తల్లి కొడుకుతో నాగ మంతెన సంఘం వద్దగల కాలనీలో నివాసం ఉంటుంది.

    అయితే బుధవారం ఉదయం కట్ట పనికొరకంటూ కొడుకు బండిమీద వెళ్ళింది. కాసేపటికి రాదను దింపేసి రాజు ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్లీ యధావిధిగా పొలం పనికి వెళ్ళాడు. వృద్ధురాలైన రాధాత తల్లి ఇంట్లో ఒక్కతే ఉంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో తల్లి కొడుకులు ఇద్దరు ఇంటికి వచ్చారు. వీరు నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి గురించి చర్చించుకొని మేస్త్రి డబ్బులు కట్టమన్నాడని,

   మేస్త్రీకి డబ్బులు ఇచ్చేందుకు బీరువాలో ఉన్న నగదును చూసుకునేందుకు బీరువా దగ్గరికి వెళ్లగా బీరువా తాళం చేయి కనిపించలేదు. అనుమానం వచ్చి ఒకరికొకరు వాకబు చేసుకున గా బీరువా తాళం చేయి కనిపించే పోయేసరికి బీరువాతాలాన్ని పగలగొట్టి చూడడంతో అందులో ఉన్న బంగారం నగదు కనిపించక పోయేసరికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

   మా అమ్మ నేను బయటకెళ్ళిచ్చేసరికి మా అమ్మమ్మను పక్కింటి వ్యక్తి ఒకరు బయటకు తీసుకెళ్లడం జరిగిందని, ఆ వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు నడ్కుడ రాజు. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Crime

|crimenews మంటగలిసిన మాతృత్వం 

janamvelugunews

Published

on

మంటగలిసిన మాతృత్వం 

ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం 

నందిపేట్ మే 24 జనం వెలుగు: మాతృత్వం మంట కలిసింది.. ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ రెహిమానియా మజీద్ ప్రాంతం

హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా మండుటెండలో విసిరేసి వెళ్లడం జరిగింది. వివరాల్లోకి వెళితే మెయిన్ రోడ్డు లో గల పాత హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో పసికందును ఘర్కశంగా విసిరేశారు.

స్థానిక చిన్నపిల్లలు క్రికెట్ ఆడదామని గేటు పైనుంచి ఆ నిర్మాణస్య ప్రాంతంలో వెళ్లేసరికే అక్కడ ఒక పసి గుడ్డు ఏడుపులు విని వెంటనే అసిఫాన్ అనే బాలుడు వాళ్ళ అమ్మ నాన్నకు తెలపడంతో వెంటనే వాళ్లు ఆ పసి గుడ్డును హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది.

అయినా పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో ఆ పసి గుడ్డు మరణించడం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆడపిల్ల అనే నెపంతోనో.. లేదా అక్రమ సంబంధమో..

తెలియదు కానీ అభం శుభం తెలియని ఆ చిన్నారిని మండుటెండలో విశ్రేయడం మాతృత్వానికే మచ్చ అని ఇటువంటి చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Continue Reading