నిజామాబాద్
తల్వేద గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రం ప్రారంభం


Views: 1
తల్వేద గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రం ప్రారంభం
జనం వెలుగు, నందిపేట్: నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు జారీ చేశారు. తల్వేద, లక్కంపల్లి, చింరాజ్‌పల్లి గ్రామాలకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ పత్రాలను ఈ కేంద్రంలో స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
నిజామాబాద్
అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు…


Views: 114
అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు..


జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో గురువారం హనుమాన్ జన్మోత్సవ వేడుకలు, భారీ ఊరేగింపు విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కంటేశ్వర్ నుండి ప్రారంభమైన ఊరేగింపు భక్త జన సందోహల మధ్య, భక్తి గీతాలతో, నృత్యాలతో భక్తి పారవాశ్యం తో ఆర్ ఆర్ చౌరస్తా వరకు చేరుకుంది. నగరం లోని అన్ని హనుమాన్ ఆలయాలలో పెద్ద ఎత్తున పూజలు,అన్న ప్రసాదాలు నిర్వహించారు. నగరమంతా రామ నామ,, హనుమాన్ నామ స్మరణ తో మార్మోగింది. వినాయక్ నగర్ లోని సంకట మోచన హనుమాన్ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఆర్చేస్ట్రా తో భక్తి పాటలు అందరిని మంత్ర ముగ్దులను చేసాయి.ఆలయ పురోహితుల మంత్రోచ్చారనలు, హారతి పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.శ్రీ నటరాజ నృత్య తరంగిని నాట్యాలయం ఆధ్వర్యంలో బంటు సుకన్య నేత్రుత్వంలో సహస్ర, నిహాన్వి, కె. ఆధ్య, టి. ఆద్య, పి. ఆధ్య, రూణి, ప్రేర్, తనిష్క, వేధిత చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఆలయ ఆవరణలో సంసృతి సాంప్రదాయాలు రాబోయే తరానికి తెలియ చేయాలనే ఉద్దేశ్యం తో ప్రతి రోజు సాయంత్రం నృత్య తరగతులు తీసుకుంటున్నట్లు తెలిపారు.హనుమాన్ భారీ ర్యాలీ సందర్బంగా భక్తులు, వచ్చిన భక్తుల కోసం పులిహోర, బాదాం పాలు, జీరా అన్నం, రస్నా, శ్రీరామ రసం, లాంటివి అందించి భక్తుల మన్ననలు పొందారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేసారు.
నిజామాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు


Views: 24
రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు
జనంవెలుగు, నిజామాబాద్:- రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుండి మీ సేవ సేవలపై కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయని, కొత్త రేట్లు పాత ఛార్జిలతో పోల్చవద్దని, వినియోగదారులు ఈ విషయం లో మీ సేవ నిర్వాహకులకు సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. గతం లో కంటే ప్రస్తుతం మీ సేవల రుసుముల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.వినియోగదారులుపాత ఛార్జిలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్షుడు సితారే క్షేవిన్ (రాజ్) విజ్ఞప్తి చేసారు. మేము నిన్ననే దరఖాస్తు చేసుకున్నాం, ఇంత చార్జీలు లేకుండే మీరేంటి బాగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు లాంటి అపోహాలు, వాదనలకు పోకుండా తాజా చార్జీలు చెల్లించి మీ సేవ సేవలు వినియోగించు కోవాలని సూచించారు.ఇన్నేళ్లుగా యూసర్ ఛార్జిల్లో పెంపు లేకుండా ఉన్న మీ సేవల ఛార్జిలను పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవా కేంద్రాలతరపున ధన్యవాదాలు తెలియ చేసారు. వినియోగ దారులు ఎటువంటి ఆటంకం లేకుండా మీ సేవ సేవలను వినియోగించు కోవాలన్నారు.
నిజామాబాద్
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం


Views: 110
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం నిజామాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం


జనంవెలుగు, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్ స్టేషన్ ఆవరణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.10 వేల కోట్ల ఆదా జరిగిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఉమారాణి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల కుటుంబాల ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 8.58 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 290 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణించగా, మొత్తం రూ.10 వేల కోట్ల ఆదా జరిగిందని, నిజామాబాద్ జిల్లాలో మాత్రమే రూ.365.50 కోట్ల ఆదా నమోదైందని వివరించారు.
ఈ పథకాన్ని మహిళలు విస్తృతంగా వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలపడాలని ఆమె ఆకాంక్షించారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోలలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి డిపోలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, ఆర్మూర్ డిపోలో మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, బాన్స్‌వాడ డిపోలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ డిపోలో మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయగౌడ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, జిల్లా కార్యదర్శి మమత, సంధ్యారాణి, సరిత, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు ఆనంద్, ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ జానాబాయి, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజవ్వ తదితరులు పాల్గొన్నారు.
మహిళా కండక్టర్లు సరళ, నాగకుమారి, జ్యోతి మరియు మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








