నిజామాబాద్
| Nizamabad ఆర్ టి సి రీజియన్ లో రోడ్డు భద్రత ముగింపు మహోత్సవం


ఆర్ టి సి రీజియన్ లో రోడ్డు భద్రత ముగింపు మహోత్సవం
జనంవెలుగు, నిజామాబాద్:- జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈనెల 1నుండి 31వరకు ఆర్ టి సి నిజామాబాద్ రీజియన్ పరిధి లోని అన్ని డిపోలలో జరుపుకున్నారు.నిజామాబాద్ 1 డిపోలో శనివారం నాడు ముగింపు మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ విచ్చేసి, డ్రైవింగ్ లో ప్రతిభ కనబర్చి, ప్రమాద రహిత ప్రయాణాన్ని ప్రయాణికులకు అందించిన ఉత్తమ డ్రైవర్ లకు అవార్డులను అందచేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్ పరిది లో ఉన్న 6 డిపోలలో నెల పొడవున ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రత కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సుధీర్ఘ కాలంగా ఎటువంటి ప్రమాదం లేకుండా విధులు నిర్వహిస్తు, ప్రయాణీకుల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిబద్దతో సంస్థ లో పనిచేస్తున్న డ్రైవర్లను గౌరవిస్తూ సన్మానించారు. భద్రత మాసోత్సవల్లో భాగంగా ప్రతి డిపోలో రక్త దాన శిబిరాల్లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాద రహిత ప్రయాణాన్ని అందించిన జోనల్ లో ఒకటి, రీజియన్ లో 3, ప్రతి డిపోలో ముగ్గురిని ఎంపిక చేసి సత్కరించారు.
పాఠశాలస్థాయి విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పిస్తూ చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వ్యాస రచనలో అభిజ్ఞ, స్వాతి గైక్వాడ్, సమీక్ష, చిత్రలేఖనంలో కవిత, రోహిత్ కుమార్, విద్యాసాగర్ లు బహుమతులు గెలుచుకున్నారు. ప్రమాద రహిత డ్రైవర్లు జోనల్ లో యూసుఫ్ (కోరుట్ల) జి జి సింగ్ (ఉట్నూర్) ఎస్ నారాయణ (ఆర్మూర్) నిజామాబాద్ రీజియన్ లో అబ్బాస్ అలీ (బాన్స్వాడ) ముతేన్న (ఆర్మూర్) పి వి రెడ్డి (బాన్స్వాడ), ఆర్మూర్ డిపోలో వి. సుదర్శన్, బి. రాజేందర్, కె. నర్సయ్య, బాన్స్వాడలొ ఎస్ డి కైసర్, హాజీ పాషా, షేక్ షాబుద్దీన్, బోధన్ లో మొహమ్మద్ ముఖేమ్, ఎల్ ఏ పి రెడ్డి, సయ్యద్ అహ్మద్, కామారెడ్డిలో పి. దేవయ్య, అబ్దుల్ జావీద్, కెసి రెడ్డి, నిజామాబాద్ 1లో మొహమ్మద్ కరీం, మొహమ్మద్ హుస్సేన్, ఎన్ సాయిలు అవార్డులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అడిషనల్ కలెక్టర్ అంకిత్, రీజినల్ మేనేజర్ టి. జోస్నా, డీప్యూటీ ఆర్ ఎం ఎస్. మధుసూదన్, పర్సనల్ ఆఫీసర్ పద్మజ,డిపో 1 మేనేజర్ ఆనంద్,డిపో 2 మేనేజర్ సాయన్న లతో పాటు మిగతా డిపో ల మేనేజర్ లు,డిపో 1 ఎం ఎఫ్ వసుందర, సిఐ జనాభాయ్, సిబ్బంది పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేసారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.












