నిజామాబాద్
సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం


Views: 4
సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజకుమార్ మాట్లాడుతూ…. విద్యార్థుల చదువుకు సంబంధించిన పురోగతి, అలాగే సమస్యలు తదితర విషయాలపై చర్చించడం జరిగిందని, తమ పిల్లలు చదువుకునే చదువు గురించి తెలుసుకొనేందుకు కళాశాలకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని, ఇలాగే తల్లిదండ్రులు, టీచర్లు కలిసి విద్యార్థులపై పర్యవేక్షణ చేస్తే విద్యార్థులు మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ ఓ డి లు లావణ్య, కిషోర్, లక్ష్మణ్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
| nandipet యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు


Views: 224
యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు
నందిపేటలో యూరియా కొరకు రైతుల ధర్నా, యూరియా ఆప్ ను రద్దు చేయాలంటూ నిరసన


జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో నందిపేట మండల రైతులు శుక్రవారం యూరియా దొరుకుత లేదంటూ… యూరియా యాప్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే యూరియా యాప్ ను రద్దుచేసి రైతులకు యూరియా బస్తాలు అందేటట్టు చూడాలని రోడ్డెక్కారు. లక్కంపళ్లి, చిమ్రాజ్పల్లి, నందిపేట రైతులు చేపట్టిన ఈ ధర్నాతో వివేకానంద చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి.
స్థానిక ఎస్సై శ్యామ్రాజ్, ఎస్సై 2 రాము లు జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడించి ధర్నాను విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతు తెల్వెద అబ్బి గంగారం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ విధానం సరైన రీతిలో చేయట్లేదని, రైతుకు యూరియా కావాల్సి వస్తే యాప్ లో బుకింగ్ చేసుకున్న వాళ్లకే యూరియా సరఫరా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే సొసైటీలో యూరియా మాయమైపోతుందని, అసలు నిజమైన లబ్ధిదారులకు యూరియా బస్తాలు అందడం లేదని, ఈ సమయంలో రైతు పొలానికి యూరియా వేయనట్లయితే వరి రైతు తీవ్రంగా నష్టపోతారని, యూరియా దొరకకపోతే రైతుకు ఉరే గతి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆప్ విధానంపై అవగాహన కల్పించ కుండా… సరఫరా చేయడం సరైనది కాదని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడం ఏంటని, చదువుకోని వారికి యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బంది కలుగుతుందని, ఆప్ విధానం కాకుండా ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను కోరారు.
నిజామాబాద్
|nandipet ఘనంగా చత్రపతి శివాజీ జయంతి


Views: 90
ఘనంగా చత్రపతి శివాజీ జయంతి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం షాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని యువత పెద్ద ఎత్తున జై శివాజీ జై భవాని అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం హన్మండ్లు మాట్లాడుతూ అఖండ భారతావనిలో హిందూ ధర్మాన్ని కాపాడిన ఏకైక మహావీరుడు శివాజీ అని, ఆయన ధైర్య సాహసాలను ఎంత పొగిడిన తక్కువేనని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే మొగలుల ప్రయత్నాన్ని తిప్పికొడుతూ ధర్మరక్షణకై యుద్ధ రంగంలో కదం తొక్కిన మహావీరుడని, ఎన్నో విజయాలు సాధించి హిందూ ధర్మాన్ని కాపాడిన ధైర్యశాలి ఆశంబుజీ మహారాజ్ అని కొనియాడారు. నేటి యువత ఆయనని స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తమ వంతుగా కృషి చేయాలని హితవు పలికారు. ఉప సర్పంచ్ నీరడి రాములు, దత్తపురం భోజన్న, ఆమందు వంశీ, దినేష్ గౌడ్, పుల్ల మహేష్, ఉద్గిరి అరవింద్, పిట్ల మోహన్, గ్రామ యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
ఘనంగా శ్రీ సాయి అప్పర్ ప్రైమరీ స్కూల్ కిడ్స్ ఫెస్ట్


Views: 153
ఘనంగా శ్రీ సాయి అప్పర్ ప్రైమరీ స్కూల్ కిడ్స్ ఫెస్ట్
విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి – ప్రముఖ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ ఆకుల విశాల్
జనం వెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 19 :- నగరంలోని గంగస్థాన్ ఫేస్ 2 లో ఉన్న శ్రీ సాయి అప్పర్ ప్రైమరీ స్కూల్ లో గురువారం కిడ్స్ ఫెస్ట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతూ పిల్లల మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిల్లలను అధిక ర్యాంకులు, క్లాస్ ఫస్ట్ కోసం ఒత్తిడికి గురి చేయకుండా, వారికి స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తే వారు అన్ని రంగాల్లో గొప్పగా ఎదుగుతారని తెలిపారు.
నేటి పిల్లలే రేపటి బాధ్యతగల పౌరులని, విద్యార్థి దశలోనే వారి ప్రతిభను గుర్తించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం తమ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్‌గా విచ్చేసిన మూడవ డివిజన్ నూతన కార్పొరేటర్ చింత ప్రసూన శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులను విద్యతో పాటు ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. డివిజన్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రభు, ప్రిన్సిపాల్ జ్యోత్స్న, వైస్ ప్రిన్సిపాల్ సంధ్య, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, శిరీష, రమ్య, ఉమా మహేశ్వరి, సులోచన, సఫీనా, శరణ్య, ప్రియాంక, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








