నిజామాబాద్
ఘనంగా సెయింట్ జేవియర్స్ 43 వ వార్షికోత్సవం




జనంవెలుగు, నిజామాబాద్:- స్థానిక జిల్లా కేంద్రంలోని సాయి నగర్ వర్ని రోడ్, జనార్దన్ గార్డెన్స్ లో సెయింట్ జేవియర్స్ హై స్కూల్ 43 వ వార్షికోత్సవం శనివారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి పార్శి అశోక్ మాట్లాడుతూ సెయింట్ జేవియర్స్ హై స్కూల్ లో విలువలతో కూడిన విద్య ను అందిస్తున్నారని, రోబోటిక్, ఏ ఐ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్), అబాకస్ లాంటి ఆధునిక విద్యను పాఠశాలలో అమలు పరుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసారు.
ఇప్పటి విద్యార్థులకు నూతన విద్యా విధానాలను అమలు పరిస్తేనే పిల్లల భవిష్యత్తు స్వర్ణమయం అవుతుందాన్నారు. పిల్లలు ఎంత ఎదిగినా కానీ తల్లి దండ్రుల పర్యవేక్షణ లో అను నిత్యం ఉండాలన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా పిల్లల నడవడిక ఉండేలా అటు తల్లి దండ్రులు, ఇటు ఉపాధ్యాయులు చూడాలని అయన తెలిపారు.
పుస్తక విద్య తో పాటు విద్యార్థి అల్ రౌండ్ డెవోలోప్మెంట్ అయ్యేలా ప్రతి ఉపాధ్యాయుడు చర్య తీసుకుని విద్యను భోదించాలన్నారు. పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు మాట్లాడుతూ విద్యాలయాన్ని నెలకొల్పి 43 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసారు, పాఠశాల లో చదివిన విద్యార్థులు ఉన్నత పదవుల్లో వున్నందుకు చాల సంతోషంగా ఉందని తెలిపారు.
వర్ని రోడ్ ఏరియా లో పాఠశాల ను నెలకొల్పి ఇక్కడి విద్యార్థుల పట్ల అను నిత్యం ప్రత్యేక శ్రద్ద వహిస్తూ పాఠశాల ను ఉన్నత స్థాయిలో ఉంచిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ లతా గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక విద్య తో పాటు సాంస్కృతిక, క్రీడా రంగంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని అన్నిరంగాల్లో ఉన్నత స్థాయిలో ఉంచుతున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి పార్శి అశోక్, నిజామాబాద్ మండల విద్యా శాఖాధికారి ఎం. సాయరెడ్డి, స్థానిక కార్పొరేటర్ అర్చన,తెలంగాణ రాష్ట్ర ట్రస్మా కోశాధికారి ఎస్ జయసింహా గౌడ్, రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ రంజిత్ సింగ్ ఠాకూర్, జిల్లా ట్రస్మా అధ్యక్షులు ఆర్. నిత్యానందం, పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు, పాకాల పుష్ప, ప్రిన్సిపాల్ లతాగౌడ్, మల్లిఖార్జున్ గౌడ్, ఉపాధ్యాయులు, సతీష్, శ్యామల, సుజాత, సంతోషి, రజిత, అరుంధతి, ఫర్హానా, శ్రీవాణి, సునీత, అశ్విని, దీపిక, సవిత, మీనా, సుమేరా, జీబా, లలిత, తదితరులు, విద్యార్థుల తల్లి దండ్రులుపాల్గొని వార్షికోత్సవాన్ని విజయవంతం చేసారు.
నిజామాబాద్
DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి


DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే
జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజామాబాద్
కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ


కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ
డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ
దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్ చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.








