నిజామాబాద్
శ్రీ వాణి విద్యా నిలయంలో ఘనంగా ఉత్కర్ష సమారోహ్


శ్రీ వాణి విద్యా నిలయంలో ఘనంగా ఉత్కర్ష సమారోహ్….


జనంవెలుగు, నిజామాబాద్:- మోస్రా మండలం లోని శ్రీ వాణి విద్యా నిలయం లో ఉత్కర్ష సమారోహ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మండల విద్యాధికారి నాగనాథ్ మాట్లాడుతూ పాఠశాల లో విద్య తో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలతో కూడిన విద్య ను అందిస్తున్నందుకు పాఠశాల యాజమాన్యం ను అభినందించారు. స్కూల్ కరెస్పాండంట్ విఠల్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో శారీరకంగా, మానసికంగా, దృడంగా చేస్తూ విద్యార్థుల అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యార్థుల తల్లి దండ్రుల ప్రోత్సాహం ఇంకా ఉంటే విద్యార్థులను సాంకేతిక రంగంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తల్లి దండ్రులు ప్రత్యక్ష దైవాలంటూ వారికి, వారి పిల్లలతో పాద పూజ చేయించటం హై లైట్ గా నిలిచింది.
ఈ కార్యక్రమంలో మోస్రా మండల విద్యాధికారి నాగనాథ్, మోస్రా గ్రామ కమిటీ చైర్మన్ బిల్లా పోతారెడ్డి, ఉమ్మడి వర్ని మండల మార్కెటింగ్ వైస్ చైర్మన్ కె లక్ష్మణ్, మోస్రా గ్రామ సర్పంచ్ గుతపే భూపాల్ రెడ్డి,రాజీవ్ నగర్ తండా గ్రామ ఉప సర్పంచ్ మోతిరామ్, ముత్తకుంట గ్రామ సర్పంచ్ సావిత్రి గాలయ్య, పాఠశాల డైరెక్టర్ గంగాధర్, కరెస్పాండంట్ తమ్మలి విట్టల్, వైస్ కరెస్పాండంట్ భారతి, మండలాల్లోని ప్రైవేట్ విద్యా సంస్థల కరెస్పాండంట్ లు బాలరాజ్ గౌడ్, జనార్దన్, నగేష్, పౌల్ రాజ్, లక్ష్మా రెడ్డి, సాయిలు, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








