నిజామాబాద్
| IIIT BASAR బాసర ఐఐఐటీలో విద్యార్థుల మరణాలు అరికట్టడంలో సర్కారు విఫలం


బాసర ఐఐఐటీలో విద్యార్థుల మరణాలు అరికట్టడంలో సర్కారు విఫలం
విద్యాశాఖ మంత్రిని నియమించాలి
బీఎస్పీ నేత అడ్వకెట్ జగన్ మోహన్
జనంవెలుగు, నిర్మల్ : IIIT Basaraలో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ తీవ్రంగా విమర్శించారు.
ఆయన మాట్లాడుతూ, బాసర ఐఐఐటీలో అవినీతి, నకిలీ బిల్లులు, కాంట్రాక్టులలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొందరు అధికారులతో కుమ్మక్కై మెస్ కాంట్రాక్టర్లు నాసిరకమైన ఆహారం అందిస్తున్నారని, దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. సెక్యూరిటీ, హౌస్కీపింగ్ వంటి విభాగాల్లో చిన్న ఉద్యోగాలకే ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
విద్యార్థుల సమస్యలను పక్కదారి పట్టిస్తూ సంస్థను అవినీతి పాలనలో నడిపిస్తున్నారని, ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అవినీతికి ప్రోత్సాహం కలిగించేదిగా ఉందని విమర్శించారు. మంచి భవిష్యత్తు కోసం ఐఐఐటీ బాసరకు వచ్చే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చాలా బాధాకరమని అన్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి పర్మినెంట్ టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న Indian National Congress ప్రభుత్వం, ముఖ్యమంత్రి Revanth Reddy తక్షణ చర్యలు తీసుకుని విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని జగన్ మోహన్ విజ్ఞప్తి చేశారు. ఇకనైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్
అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం


అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సిపి సాయి చైతన్య.
జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.
పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.








