నిజామాబాద్
నిషిత డిగ్రీ కాలేజ్ విద్యార్థులచే స్వచ్ఛభారత్….


జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్రంలో బుధవారం జిల్లా కేంద్ర నిషిత డిగ్రీ కాలేజ్ విద్యార్థులు విద్యా సంవత్సరంలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్థానిక వివేకానంద చౌరస్తా లో గ్రామపంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. సుమారు 70 మంది విద్యార్థులచే వివేకానంద చౌరస్తా నుండి మెయిన్ రోడ్డు వెంబడి చీపుర్లు, తట్టాలు పట్టుకొని చెత్తను తొలగించారు. విద్యార్థులతో పాటు స్థానిక సర్పంచ్ సిలిండర్ లింగం తమ పంచాయతీ కమిటీ వార్డు సభ్యులతో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా నిషిత కాలేజ్ ఉపాధ్యాయులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా కేంద్ర నిషిత డిగ్రీ కాలేజ్ తరపున విద్యార్థులకు స్పెషల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఆ క్యాంపులో వివిధ రకాల సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలను జరుపుకుంటామని, ఈ సంవత్సరం నందిపేట మండల కేంద్రంలో మా విద్యార్థుల చేత స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వాడకాలను తగ్గించడం, ఇంకుడు గుంతలను వాడి నీటి సమస్యలను అధిగమించడం, మత్తు పానీయాలకు ప్రజలు అలవాటు పడకుండా ఇలా రకరకాల సమస్యలపై సమాజ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వారికి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్నిఈ మండల కేంద్రంలో జరపాలని సర్పంచ్ సిలిండర్ లింగం మమ్మల్ని కోరారని, మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలపడంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. మండల కేంద్ర గ్రామ పంచాయతీ కమిటీకి , సర్పంచ్ సిలిండర్ లింగం కు మా కాలేజీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ…. నందిపేట మండల కేంద్రంలో నిషితా కాలేజ్ విద్యార్థులు స్వచ్ఛభారత్ అనే కార్యక్రమంతో గ్రామంలో శ్రమదానం చేయడం, సమాజాభివృద్ధి కోరుతూ ప్రజలకు అవగాహన కార్యక్రమమం చేపట్టడం చాలా సంతోషమైన విషయమని, అందులో మా నందిపేట మండల కేంద్రాన్ని ఆ డిగ్రీ కాలేజ్ వారు ఎన్నుకోవడం పట్ల మా పంచాయతీ కమిటీ నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ గ్రామపంచాయతీ కమిటీ తరఫున సదుపాయాలు కల్పిస్తామని, వారు చేపట్టే ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమం వల్ల చాలామందిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానుని అన్నారు. ప్రతి ఒక్కరూ నాకెందుకులే అనుకొని తమ పరిసరాలను పట్టించుకోవడంలేదని, ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతేనే గ్రామం స్వచ్ఛంగా ఉంటుందని గ్రామం స్వచ్ఛంగా ఉంటేనే దేశంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. పంచాయతీ సెక్రటరీ మహేందర్, వార్డు సభ్యులు అన్వేష్, చింత శ్రీను, పాష, రెమ్మ రవి, కంతం చిన్నయ్య, వినీత్, ఫేమస్ ఇమ్రాన్, తమ్మల దేవేందర్, శ్రీకాంత్, నిషిత కాలేజ్ అధ్యాపకులు, విద్యార్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం


అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సిపి సాయి చైతన్య.
జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.
పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.








