నిజామాబాద్
యువత గంజాయి, డ్రగ్స్ కు దూరం ఉండండి.


మన ఊరు -మన భద్రత -మన బాధ్యత.
సిపి సాయి చైతన్య వెల్లడి.
జనం వెలుగు ఆర్మూర్: సమాజంలో ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా పోలీసు కమీషనర్ సాయి చైతన్య అన్నాడు. ఆర్మూర్ పట్టణంలో గురువా రం నిర్వహించిన అరైవ్-అలైవ్ కా క్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించాడు. సేఫ్టీ, సైబర్ క్రైమ్ ప్రివెన్షన్, డ్రగ్స్ నియం త్రణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పై గ్రామ సర్పంచులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆయ న తెలిపాడు. వాహన దారులు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపాడు. వ్యవసాయాదరులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని, ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని, యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని, ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై ఆయన అవగాహన కల్పించాడు.అధిక వేగం,క్రమశిక్షణ లోపం,అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని ఆయన వివరించాడు. ఆరోగ్యంపై శ్రద్ధ,ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాల ను నివారించవచ్చని ఆయన పేర్కొన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపాడు.ఆ తరువాత అరైవ్-అలైవ్ సంబందించిన ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్), జి. బస్వా రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లహరి రఘు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాటిపల్లి గంగా రెడ్డి, ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసిపి, వెంకటేశ్వర్లు, ఆర్మూర్ టౌన్ సిఐ సత్యనారాయణ, ఆర్మూర్ రూరల్ సిఐ జి. జాన్ రెడ్డి,మరియు ఐ-రాడ్ మేనేజర్ శ్రీవర్ష,ఆర్మూర్ డివిజన్ ఎస్ఐలు రజనీకాంత్,సంజీవ్, అనిల్, రాము, శ్యామ్ రాజ్, శైలేందర్, కిరణ్ పాల్, రాజేశ్వర్, ఎన్ఎస్సి కౌన్సిల్ మెంబర్స్ సుందర్, క్రాంతి గంగారెడ్డి, నిజంసాగర్ మాజీ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వై.సాయ రెడ్డి, సాగర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లు, వార్డ్ కౌన్సిలర్లు, ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
నిజామాబాద్
| nandipet ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం


ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం
జనంవెలుగు, నందిపేట్:- ప్రజా పాలనలో భాగంగా గురువారం నందిపేట మండల కేంద్ర సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే నినాదంతో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఏడి శ్రీనివాసులు పాల్గొన్న ఈ సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మండల పాలన సిబ్బంది హాజరయ్యారు,
ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది కూడా పాల్గొని అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను ఎలా నివారించవచ్చో, గ్యాస్ సిలిండర్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూయించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.., ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం అనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాప పాలన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు మండల స్థాయి సమావేశం జరుపుకుంటున్నామన్నారు.
ప్రజాభివృద్ధి కొరకు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి మంచి ఫలితాలను అందించేందుకే ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ ప్రజా పాలన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
మండల కేంద్ర సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రజా పాలన కార్యక్రమానికి అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై ప్రజాపాలనలో సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి తక్షణమే
నిర్ణయం తీసుకోవడం వల్ల పరిష్కారం దొరుకుతుందని, లబ్ధిదారులకు అధికారులకు వారధిగా ఈ ప్రజా పాలన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. తాసిల్దార్ సంతోష్ రెడ్డి, ఆర్ ఐ, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
|nizamabad పనుల్లో వేగం పెంచాలి


పనుల్లో వేగం పెంచాలి
* యూజీడీ కనెక్షన్ పనులను పర్యవేక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…
ఇందూరు: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ల పనుల్లో వేగం పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్ లో గురువారం యుజిడి అనుసంధాన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన చోట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో కనెక్షన్ లు ఇస్తున్నారన్నారు.
నగరవాసులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇంటి యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతిలో పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పనులు చేసే బృందాలని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఇపకాయల సుమిత్రా కిషోర్, మఠం పవన్, చింతకాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
|Armoor సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం


సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం
జనం వెలుగు ఆర్మూర్:- నిన్న వెలువడిన సిబిఎస్ఇ 2025- 2026 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో క్షత్రియ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన విద్యార్థుల అభినందన కార్యక్రమం లో విద్యార్థులు తమ స్వీయ అను భవాలను, అధ్యాపకుల కృషిని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏనుగు ప్రణతి 483/500 మార్కులతో ప్రథమ స్థానం, ముకుంద్ హర్షిణి 462/500 మార్కులతో ద్వితీయ స్థానాన్ని (బెస్టాఫ్ 5 ఔట్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్) పొందినారు.
ఈ సందర్భం గా స్కూల్ ప్రిన్సిపాల్ డా. విజయ లక్ష్మి మాట్లాడుతూ 100 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలను సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో స్ఫూర్తి వంత మైన ప్రణాళికను రూపొందించుకొని మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ చదువుతో పాటు సంస్కారాన్ని పాటిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
స్కూల్ కరెస్పాండెం ట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య, సంస్కారవంతమైన నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో క్షత్రియ పాఠశాలను స్థా పించమని జరిగిందని అన్నాడు. ఇట్టి ఫలితాలకు విశేష కృషికి పాటుపడిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించాడు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కోశాధికారి అల్జా పూర్ గంగాధర్, డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్, అధ్యాపాక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.








