Connect with us

నిజామాబాద్

|armoor సుప్రీంకోర్టు తీర్పుతో దళిత క్రైస్తవులు తీరని అన్యాయం

janamvelugunews

Published

on

సుప్రీంకోర్టు తీర్పుతో దళిత క్రైస్తవులు తీరని అన్యాయం

క్రైస్తవ హక్కుల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అశోక్

క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్

రమేష్ జాన్,దళిత సంఘ నేతలు

జనం వెలుగు ఆర్మూర్:- దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీలుగా వర్తించరని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో దళితులకు తీరని అన్యాయం జరుగుతోందని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ అశోక్, క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యాల శ్రీనివాస్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సి హోదా రద్దు చేయడంపై సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలని వారు కోరారు.

మతం వేరు కులం వేరు అని ఈ రెండింటిని వేరువేరుగా చూడాలని వారన్నారు. క్రైస్తవ మతంలోకి మారితే దళితులకు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వలన అణగారిన దళితులకు తీవ్ర అన్యాయం జరిగినట్లేనని వారు తెలిపారు. హిందువులలోని ఇతర కులస్థులు క్రైస్తవ మతంలోకి మారినప్పటికి వారిని బీసీలుగానే పరిగణలోకి తీసుకుంటున్నారని, కేవలం దళితులు మతం మారితేనే ఎస్సి హోదా పోతుందా అని వారు ప్రశ్నించారు.సుప్రీంకోర్టు తీర్పు మత స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను భంగం కలిగించడంతో పాటు, హక్కులను కాలరాస్తుందని వారు చెప్పారు. దళితులు కాకుండా ఇతరులు క్రైస్తవులుగా మారితే వారికి రిజర్వేషన్లు ఎందుకు వర్తిస్తాయని, మతం వేరు కులాలు వేరు కాబట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ చట్టాలను వర్తింపజేయాలని వారన్నారు.

సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల పట్ల వెలువరించిన తీర్పును వెనక్కి తీసుకొని తొలగించాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారన్నారు. రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం, ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ మండల చైర్మన్ మూగ ప్రభాకర్, మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లను తొలగిస్తామనడం సమంజసం కాదన్నారు.అగ్రవర్ణా లకు సహితం రిజర్వేషన్లు అమలు చేస్తూ అణగారిన వారికి రిజర్వేషన్లు తొలగిస్తే సమిష్టిగా ఉండి ఉద్య మిస్తామని వారన్నారు. దళిత క్రైస్త వులపై ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం పునః సమీక్షించాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ క్రైస్తవ అసోసియేషన్ మండల అధ్యక్షులు జాన రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పాస్టర్ రాజ్ పాల్ దినకర్, పాస్టర్ ప్రకాష్, పాస్టర్ ఆగస్టిన్ తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

| nandipet ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం 

janamvelugunews

Published

on

ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం 

 జనంవెలుగు, నందిపేట్:- ప్రజా పాలనలో భాగంగా గురువారం నందిపేట మండల కేంద్ర సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే నినాదంతో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఏడి శ్రీనివాసులు పాల్గొన్న ఈ సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మండల పాలన సిబ్బంది హాజరయ్యారు,

ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది కూడా పాల్గొని అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను ఎలా నివారించవచ్చో, గ్యాస్ సిలిండర్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూయించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.., ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం అనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాప పాలన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు మండల స్థాయి సమావేశం జరుపుకుంటున్నామన్నారు.

ప్రజాభివృద్ధి కొరకు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి మంచి ఫలితాలను అందించేందుకే ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ ప్రజా పాలన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

మండల కేంద్ర సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రజా పాలన కార్యక్రమానికి అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై ప్రజాపాలనలో సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి తక్షణమే

నిర్ణయం తీసుకోవడం వల్ల పరిష్కారం దొరుకుతుందని, లబ్ధిదారులకు అధికారులకు వారధిగా ఈ ప్రజా పాలన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. తాసిల్దార్ సంతోష్ రెడ్డి, ఆర్ ఐ, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

|nizamabad పనుల్లో వేగం పెంచాలి

janamvelugunews

Published

on

పనుల్లో వేగం పెంచాలి
* యూజీడీ కనెక్షన్ పనులను పర్యవేక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

ఇందూరు: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ల పనుల్లో వేగం పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్ లో గురువారం యుజిడి అనుసంధాన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన చోట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో కనెక్షన్ లు ఇస్తున్నారన్నారు.

నగరవాసులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇంటి యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతిలో పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పనులు చేసే బృందాలని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఇపకాయల సుమిత్రా కిషోర్, మఠం పవన్, చింతకాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

|Armoor సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం

janamvelugunews

Published

on

సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం
జనం వెలుగు ఆర్మూర్:- నిన్న వెలువడిన సిబిఎస్ఇ 2025- 2026 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో క్షత్రియ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన విద్యార్థుల అభినందన కార్యక్రమం లో విద్యార్థులు తమ స్వీయ అను భవాలను, అధ్యాపకుల కృషిని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏనుగు ప్రణతి 483/500 మార్కులతో ప్రథమ స్థానం, ముకుంద్ హర్షిణి 462/500 మార్కులతో ద్వితీయ స్థానాన్ని (బెస్టాఫ్ 5 ఔట్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్) పొందినారు.

ఈ సందర్భం గా స్కూల్ ప్రిన్సిపాల్ డా. విజయ లక్ష్మి మాట్లాడుతూ 100 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలను సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో స్ఫూర్తి వంత మైన ప్రణాళికను రూపొందించుకొని మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ చదువుతో పాటు సంస్కారాన్ని పాటిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

స్కూల్ కరెస్పాండెం ట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య, సంస్కారవంతమైన నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో క్షత్రియ పాఠశాలను స్థా పించమని జరిగిందని అన్నాడు. ఇట్టి ఫలితాలకు విశేష కృషికి పాటుపడిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించాడు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కోశాధికారి అల్జా పూర్ గంగాధర్, డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్, అధ్యాపాక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Continue Reading