Connect with us

నిజామాబాద్

నిజామాబాద్‌లో ఘనంగా బీఆరెస్ ఆవిర్భావ దినోత్సవం

janamvelugunews

Published

on

నిజామాబాద్‌లో ఘనంగా బీఆరెస్ ఆవిర్భావ దినోత్సవం

జనంవెలుగు, నిజామాబాద్:- జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పవిత్రమైన దినమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమైందని, ఆయన లేకపోతే భారతదేశ పటంలో తెలంగాణ ఉండేదే కాదని పేర్కొన్నారు.

మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిరంతరం పోరాటం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. గ్రామ గ్రామాన ప్రజలు “కారు, సారు, కేసీఆర్” అంటూ నినాదాలు చేస్తూ, మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పార్టీలు వచ్చినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాయని, కానీ కేసీఆర్ స్థాపించిన టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే ప్రజల ఆశయాలను నెరవేర్చిందని చెప్పారు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన త్యాగాలు, కష్టాలు అపారమని కొనియాడారు.

రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా రైతులు మరియు ప్రజలకు మేలు జరిగిందని, 24 గంటల విద్యుత్ సరఫరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని తెలిపారు.

తెలంగాణ అనే పదమే కేసీఆర్‌కు అంకితమని, ఆయనపై విమర్శలు చేయడాన్ని సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సిర్పరాజు, సుజాత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, అభిలాష్ రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Thammali Pandu

Published

on

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశం

జనంవెలుగు నిజామాబాద్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్ఓ గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, మున్సిపల్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్లతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, పెండింగ్ అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇదిలాఉండగా, ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడం, కొంతమంది ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్, ప్రతి ఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు అయి ఉండాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు.

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు అవగాహన సదస్సులలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసిన NHM ఉద్యోగులు

Thammali Pandu

Published

on

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసిన NHM ఉద్యోగులు 

సర్వీసుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని NHM ఉద్యోగుల విజ్ఞప్తి  

పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు, బోనస్‌లు విడుదల చేయాలని వినతి

ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే

జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని సోమవారం NHM (జాతీయ ఆరోగ్య మిషన్) ఉద్యోగులు కలిసి తమ సమస్యలను వివరించి, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.గత 14 రోజులుగా డిమాండ్ల పరిష్కారం కొరకు సమ్మె చేపడుతున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా NHM ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ ఉద్యోగాలకు తగిన భద్రత, వేతనాలు, ఇతర ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు..

సర్వీసుల క్రమబద్ధీకరణ: రాష్ట్రవ్యాప్తంగా 78 కేడర్లలో పనిచేస్తున్న 17,541 మంది NHM ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించి, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరారు.

సమాన పనికి సమాన వేతనం: రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు సమాన వేతనాలు, పే స్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వుల అమలు: జీవో నంబర్ 60, 1195 ప్రకారం పెరిగిన వేతనాలను తక్షణమే అమలు చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు, బోనస్‌ల విడుదల: 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు, 8 శాతం లయబిలిటీ బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు: మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు.

ఆరోగ్య భద్రత, బీమా సదుపాయాలు: NHM ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) కింద ఆరోగ్య బీమా, జీవిత బీమా సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ భద్రత: ఉద్యోగులకు తగిన ఉద్యోగ భద్రత కల్పించి, ఎలాంటి కారణం లేకుండా విధుల నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి NHM ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను సానుకూలంగా విన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో NHM జిల్లా JAC యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

విజయగాథలకు జాతీయ వేదిక ” మన్ కీ బాత్ “

Thammali Pandu

Published

on

విజయగాథలకు జాతీయ వేదిక ” మన్ కీ బాత్ “

జనంవెలుగు నిజామాబాద్ : – సామాన్యుల విజయ గాథలకు జాతీయవేదికగా “మన్ కీ బాత్” నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.

ఆదివారం దేశ ప్రధాని నరేంద్రమోదీ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దేశ ప్రజలకు కృషి, సేవా స్ఫూర్తి, ఆవిష్కరణలు, దేశీయ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేయడం కార్యక్రమ ప్రత్యేకత అని తెలిపారు.

12 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న మన్ కీ బాత్ ప్రజలకు, ప్రధానమంత్రికి మధ్య ఒక ఆత్మీయ వారధిగా నిలిచిందన్నారు.

ఈ ఎపిసోడ్ లో పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహిస్తున్న ‘నవ్-త్రింజన్’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించడం విశేషమని పేర్కొన్నారు.

సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడంతో పాటు, చేనేత నైపుణ్యాలను భావితరాలకు అందించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని వివరించారు.

అలాగే ఉత్తరాఖండ్‌లోని హేవల్ నదిని పునరుజ్జీవింపజేయడానికి స్థానిక ప్రజలు, అధికారులు కలిసి చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, మొక్కల పెంపకం కార్యక్రమాలను ప్రధాని ప్రస్తావించడం పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందన్నారు.

రాబోయే దీపావళి పండుగ సందర్భంగా స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపు ప్రతి భారతీయుడు ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

“మన్ కీ బాత్’ కేవలం రేడియో కార్యక్రమం మాత్రమే కాదని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులను కోట్లాది మందికి పరిచయం చేసే గొప్ప వేదిక అని కొనియాడారు.

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్, నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading