Connect with us

నిజామాబాద్

నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్

janamvelugunews

Published

on

నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్

జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 30: మే 3వ తేదీన జరగనున్న నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం పరీక్షా కేంద్రాలను సందర్శించారు. డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని యూజీ బ్లాక్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ లను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్యన పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రాల్లోని ఆయా గదుల వివరాలను తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతితో పాటు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎం లను నియమించాలని ఆదేశించారు. అభ్యర్థులు కూడా తమ వెంట గాజు సీసాలలో మంచినీటిని తెచ్చుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఎండ తీవ్రత నుండి రక్షణ పొందేందుకు వీలుగా గొడుగులను కూడా తెచ్చుకోవచ్చని తెలిపారు. అయితే పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ చిన్న తప్పిదానికి సైతం అవకాశం లేకుండా నీట్ ప్రవేశ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని, సీ.సీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరగాలని అధికారులకు సూచించారు. 

   మే 3వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు కొనసాగే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ భవనంలో, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భవనంలో, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని యూజీ బ్లాక్ లో, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ లో, బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, నిజామాబాద్ కంటేశ్వర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, మాక్లూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని అన్నారు. విద్యార్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, సంబంధిత అధికారులు ఉన్నారు.

 అదనపు కలెక్టర్ సందర్శన

కాగా, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేపథ్యంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ 

Thammali Pandu

Published

on

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ 

ర్యాలీ నిర్వహించిన అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో “సైకిల్, బైక్ ర్యాలీ ” కార్యక్రమం 

జనంవెలుగు నిజామాబాద్:– పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు అదనపు డి. సి. పి ( అడ్మిన్ ) ఎన్. శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సైకిల్, బైక్ ర్యాలీ ఉదయం 8 గంటలకు పూలాంగ్ చౌరస్తా నుండి అదనపు పోలీస్ కమిషనర్ ఎన్. శుభం ప్రకాష్ జండాఊపి ప్రారంభించారు.

పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై, ర్యాలీ ప్రగతి హాస్పిటల్ – ఎల్ఐసి చౌరస్తా – కోర్టు చౌరస్తా – ఎన్టీఆర్ చౌరస్తా – పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు , మతపరమైన విభజన శక్తులు , ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ నేరాలు అరికట్టడం , మాదక ద్రవ్యాలు అణచివేయడానికి , మహిళ భద్రతకు , తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేటు లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని , ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్న , వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరమర్శించినట్లు తెలిపారు. మన పోలీసులు ఒకటే కుటుంబం వారు వేసుకున్న యూనిఫాం అందరికీ గర్వకారణమని వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు.

ఈ దేశం కోసం, న్యాయం కోసం , ఎప్పటికీ తలవంచకుండా పక్షపాతం లేకుండా , సేవ చేయడానికి మనస్ఫూర్తిగా ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి.ఐలు , రిజర్వు ఇన్స్ పెక్టర్లు , ఎస్.ఐలు , ఆర్.ఎస్.ఐలు , ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది , స్పెషల్ పార్టీ సిబ్బంది , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం కోసం పీఎం రాహత్ పథకం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Thammali Pandu

Published

on

రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం కోసం పీఎం రాహత్ పథకం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

జనంవెలుగు నిజామాబాద్ :- రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలకంగా నిలుస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు.

పీఎం రాహత్ (ప్రైమ్ మినిస్టర్ రోడ్ ఆక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలిజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్) పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి సీ.ఎస్ సంజయ్ జాజు శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అనుసంధానం, నిధుల విడుదల ప్రక్రియపై చర్చించారు.

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించడానికి పోలీస్ ఆమోదిత కేసులకు గరిష్టంగా లక్షా 50 వేల రూపాయల వరకు పూర్తి చికిత్స అందించే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రమాదం తర్వాత బాదితుల ప్రాణాలు కాపాడేందుకు గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, ఈ సమయంలో వేగంగా స్పందించాలని అన్నారు. ఈ పథకం సమర్థవంతమైన అమలు కోసం జిల్లా కలెక్టర్లు రహదారి భద్రత కమిటీలతో సమన్వయం చేసుకొని, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

          ప్రమాదాల నివారణకు, బాధితుల వివరాలను పారదర్శకంగా నమోదు చేయడానికి టీఎంఎస్ 2.0 పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.

జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా బాధితుల చికిత్స ఖర్చులను నేరుగా ఆసుపత్రులకు చెల్లించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

ప్రజలలో ఈ పథకంపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి జిల్లాలోనూ ఈ పథకం అమలును కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ స్పష్టం చేశారు.

        వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు పలు సూచనలు చేశారు. పీఎం రాహత్ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత శాఖలు వెంటనే అప్రమత్తమవ్వాలని అన్నారు.

నగదు, బాదితుల సమాచారం అందుబాటులో లేని కారణంగా వైద్యసేవలు నిరాకరించకూడదన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఉండి ప్రమాదాల వల్ల కలిగే ప్రాణ నష్టాలను తగ్గించాలని తెలిపారు.

       ఈ వీసీలో అదనపు కలెక్టర్ లు రాజాగౌడ్, భుజంగరావు, జిల్లా రవాణా శాఖ అధికారి రమేష్ రాథోడ్, వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈ-దార్ జిల్లా మేనేజర్ వర్ష నిహంత్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

వైద్య రంగ నిపుణులకు న్యాయ అవగాహన సదస్సు  జిల్లా జడ్జి జీ వీ ఎన్ భరతలక్ష్మి 

Thammali Pandu

Published

on

వైద్య రంగ నిపుణులకు న్యాయ అవగాహన సదస్సు 

జిల్లా జడ్జి జీ వీ ఎన్ భరతలక్ష్మి 

వైద్యపరమైన రికార్డులను జాగ్రత్తగా భద్రపర్చాలి

అర్ధమయ్యే రీతిలో ప్రిస్క్రిప్షన్ ఉండాలి

జనంవెలుగు నిజామాబాద్ : – వైద్య వృత్తిలో కొనసాగుతున్న వారు వైద్యపరమైన రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా భద్రపర్చాలని జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి సూచించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు, వైద్య రంగ నిపుణులకు వివిధ అంశాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు డీ.సీ.పీ శుభం నగ్రాలే తదితరులు పాల్గొన్నారు. వైద్యుల హక్కులు, వైద్య సేవల్లో చట్టపరమైన బాధ్యతలపై జిల్లా జడ్జి, కలెక్టర్, ఇతర వక్తలు ముఖ్య సూచనలు చేశారు.

హెల్త్‌ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్) చట్టం–2025, వైద్య రికార్డుల నిర్వహణ, వాటి చట్టపరమైన ప్రాముఖ్యత, న్యాయపరమైన విచారణల్లో వాటి ప్రామాణికత తదితర అంశాలపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు.

వైద్య సేవలందించే సమయంలో చట్టపరమైన నిబంధనలను పాటించడం, వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా వైద్యులు, రోగుల హక్కులను పరిరక్షించడంతో పాటు న్యాయ ప్రక్రియకు సహకారం అందించిన వారు అవుతారని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

న్యాయవ్యవస్థలో వైద్యులు భాగస్వాములుగా వ్యవహరించాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.

    ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.నారాయణ, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని, ట్రైనీ కలెక్టర్ సురేష్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.సుభాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎ.విశాల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, రాష్ట్ర వైద్య మండలి జిల్లా ఇన్‌చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రాథోడ్, రాజ్ కుమార్ సుబేదార్, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Advertisement