Connect with us

నిజామాబాద్

మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేసిన కలెక్టర్

janamvelugunews

Published

on

జనం వెలుగు, నిజామాబాద్ :- మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం క్షేత్రస్థాయి సందర్శన జరిపి పరిశీలించారు. భీంగల్ పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను, ఇదే మండలంలోని పల్లికొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించి అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు మందకొడిగా సాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్, యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంప్, ఫ్లోరింగ్, ఫ్యాన్లు, పెయింట్, పైప్ లైన్, కిచెన్ షెడ్, టాయిలెట్స్ తదితర పనులను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. పాఠశాలల ఆవరణలో మురుగు జలాలు, వర్షపు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, ఎక్కడ కూడా రాజీ పడవద్దని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. విద్యార్థులు ప్రయోజనాలతో ముడిపడిన పనులు అయినందున తమ సొంత ఇంటి పనులుగా భావిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుత్తేదార్లకు హితవు పలికారు. అవకాశం ఉన్నచోట వంట గదికి ఆనుకుని డైనింగ్ హాల్ నిర్మించాలని, పాఠశాలలకు చెందిన ఖాళీ స్థలం వృధా కాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. భీంగల్ ఉర్దూ మీడియం అప్పర్ ప్రైమరీ పాఠశాలలో అంగన్వాడీ చిన్నారుల కోసం వండిన భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ పాఠశాలలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కంస్ట్రక్షన్ (ఎన్ఏసి) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్ లో, యువతులకు కుట్టు మిషన్ శిక్షణ అందిస్తుండగా, కలెక్టర్ ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఎంత మంది శిక్షణ పొందుతున్నారు, ఎన్ని రోజుల పాటు శిక్షణ అందిస్తారు, ఉపాధి కల్పనకు గల అవకాశాల గురించి నిర్వాకులను ఆరా తీశారు. శిక్షణ సందర్భంగా ఏకాగ్రతతో అన్ని అంశాలను ఆకళింపు చేసుకోవాలని, శిక్షణ పూర్తయిన అనంతరం స్వయం ఉపాధి దిశగా కృషి చేయాలని అభ్యర్థులకు సూచించారు. వినియోగదారులకు సంతృప్తికరంగా నాణ్యమైన సేవలు అందిస్తే శిక్షణ పొందిన రంగంలో చక్కటి ఉపాధి పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట భీంగల్ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading