Connect with us

నిజామాబాద్

జి జి హెచ్ లో బాల భరోసా కేంద్రం ప్రారంభం

janamvelugunews

Published

on

జి జి హెచ్ లో బాల భరోసా కేంద్రం ప్రారంభం

జిల్లా వైద్య శాఖ అధికారిని ఆరోగ్య రాజశ్రీ

జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా లో భాగముగా బాల భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏడవ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రారంభించారు . ఈ కార్యక్రమములో జిల్లా వైద్య శాఖ అధికారిణి రాజశ్రీ ,జిల్లా సంక్షేమాధికారిణి పద్మ ,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మోహన్ రావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.అశోక్ ,సి డి పి వో లు,సూపర్ వైజర్ లు , మెడికల్ హెల్త్ టీం డాక్టర్ లు, RBSK సిబ్బంధి , లబ్ధిదారులు పాల్గొన్నా రు. పిల్లలలో (0-5 సంవత్సరాలు) అభివృద్ధిలో జాప్యాలు, నాడీ సంబంధిత అభివృద్ధి సమస్యలు మరియు శారీరక వైకల్యాలను ముందుగానే గుర్తించడానికి ఉద్దేశించిన బాల భరోసా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ,ఈ కార్యక్రమo విజయవంతం కావడానికి మహిళా శిశు సంక్షేమ శాఖా ,ఆరోగ్య శాఖ సమన్వయం తో పనిచేయాలని జిల్లా వైద్య శాఖా అధికారిణి రాజశ్రీ ,జిల్లా సంక్షేమాధికారిణి పద్మ కోరారు. అభివృద్ధిలో జాప్యాలు, నాడీ సంబంధిత అభివృద్ధి సమస్యలు మరియు శారీరక వైకల్యాలను ఉన్న పిల్లలకు చికిత్స అందించడానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి పూర్తి సహాకారం ఉంటుందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మోహన్ రావు చెప్పారు. డిస్ట్రిక్ట్ ఇమ్యు నై జేషన్ ఆఫీసర్ డా అశోక్ మాట్లాడుతూ మే నెలలో సెలవులు ఉన్నాయి కావున rbsk టీం లు స్క్రీనింగ్ చేయడానికి అంగన్వాడీ టీచర్ లు అందరూ సహకరించాలని కోరారు,

 

ఈ స్క్రీనింగ్ లో భాగంగా ఏదైనా సమస్య తో గుర్తించబడిన పిల్లలకు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోని 4వ అంతస్తు లో ఉన్నటువంటి జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రం లో స్పీచ్ మరియు పిజియో థెరపీలు మరియు చికిత్సలు ఉచితంగా అందించబడును. అలాగే నవజాత శిశువు నుండి 18 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం లో భాగంగా మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా హెల్త్ స్క్రీనింగ్ చేయించి ఏవైనా సమస్యలు ఉన్న విద్యార్థులకు ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రం లో పుట్టుకతో వచ్చే లోపలకు, దంత సమస్యలకు, అనీమియా, మరియు పోషకాహార లోపలకు, గుండె సంబంధిత వ్యాధులు, చిన్నారుల్లో అన్ని రకాల శస్త్ర చికిత్సలకు, దంత సమస్యలకు, కంటి సమస్యలకు, చర్మ వ్యాధులకు, తదితర వ్యాధులకు చికిత్సలు చేయించబడును అని జిల్లా వైద్య శాఖ అధికారిని డా. రాజశ్రీ తెలియజేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

janamvelugunews

Published

on

అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

సిపి సాయి చైతన్య.

జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.

పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.

Continue Reading

నిజామాబాద్

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

Thammali Pandu

Published

on

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి 

జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.

ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

ప్రయాణికులు www.tgsrtcbus.in⁠ వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.

Continue Reading

నిజామాబాద్

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

Thammali Pandu

Published

on

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు 

జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.

ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

Continue Reading