నిజామాబాద్
ఫించన్ డబ్బులకై లబో దిబో మంటున్న వృద్దులు


ఫించన్ డబ్బులకై లబో దిబో మంటున్న వృద్దులు
ఫించన్ డబ్బులకై ఆందోళనకు సిద్ధమవుతున్న వృద్ధులు
జనం వెలుగు ఆర్మూర్: నెల నెల వృద్ధులకు ఇచ్చే ఫించన్లను ఈ నెల 6 వరకు పంపిణి చేయక పోగా వృద్దులు, వితంతువులు ఫించన్ డబ్బులకై లబో దిబో మంటున్నారు. ప్రతి నెల 25 వ తేదీ వరకు పంపిణి చేయాల్సిన ఫించన్లను ఈ నెల 6 వ తేదీ వచ్చిన బాల్కొండలో వృద్దాప్య ఫించన్లు పంపిణి చేయలేదు. ఫించన్ డబ్బులు రాకపోగా ఫించన్ డబ్బులకై వృద్దులు మండ టెండలను సహితం లెక్క చేయకుండా ఆందోళనకు వృద్ధులు సిద్దమవు తున్నారు. ఈ నెల 6 వరకు వృద్దాప్య ఫించన్లు పంపిణి చేయడం లేదని బాల్కొండ ఎంపిడిఓ విజయ భాస్కర్ రెడ్డి రెడ్డికి ప్రశ్నించగా ఫించన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. ఒక అధికారి అయిన ఎంపిడిఓ విజయ భాస్కర్ రెడ్డికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వృద్దులు మండి పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మారు ప్రాంతాలలో సహితం ఫించ న్లను ఈ పాటికి ఏనాడో పంపిణి చేయగా ఒక్క బాల్కొండలో మాత్రం పింఛన్లను పంపిణి చేయలేక పోవడంలో ఆంతర్యమేమిటని ఫించన్ దారులు ప్రశ్నిస్తున్నారు. వృద్దాప్య దశలో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మెడికల్ ట్యాబ్లెట్ లకు ఎంతో వ్యయం అవుతుందని వృద్దులు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్దాప్య ఫించన్ డబ్బులను పంపిణీ చేసే జిల్లా పోస్టు ఆఫీసులో విధులను నిర్వర్తించే వ్యక్తి కేవలం బాల్కొండకు ఫించన్లు పంపిణి చేయడంలో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బాల్కొండ పరిసర ప్రాంతాలలోని గ్రామాలకు వృద్దాప్య పింఛన్లను పంపిణి చేస్తు కేవలం బాల్కొండకు ఫించన్లను ఎందుకు పంపిణి చేయడం లేదని బాల్కొండ ఫించన్ దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకు బారమై కొందరు వృద్ధులు కుటుంబానికి దూరంగా ఉంటూ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మెడికల్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వృద్దుల పట్ల జిల్లా పోస్టు మాస్టర్ ఎందుకు కనికరం కలుగడం లేదని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. బాల్కొండ వృద్దాప్య ఫించన్ల పట్ల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వృద్దులు కోరుతున్నారు.
నిజామాబాద్
అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం


అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సిపి సాయి చైతన్య.
జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.
పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.








