Connect with us

నిజామాబాద్

ప్రజా మరుగుదొడ్లకు తాళాలు

janamvelugunews

Published

on

ప్రజా మరుగుదొడ్లకు తాళాలు

జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ పట్టణంలో పది వేర్వేరు ప్రాంతాలలో ప్రజా అవసరాల కోసం నిర్మించిన ప్రజా మరుగుదొడ్లకు గత నెల రోజులుగా తాళాలు వేసి ఉండ డం తో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ పరిసర ప్రాంతాలలోని ప్రజానీకం తమ అవసరాల నిమిత్తం ఆర్మూర్ వస్తే ముఖ్యంగా

మహిళలతో పాటు పురుషులు, మరుగుదొడ్లకై తీవ్ర ఇబ్బందులను ఎదురుకోవలసి వస్తొంది. అక్కడక్కడ సుమారు పది వేర్వేరు ప్రాంతాలలో మహిళల సౌలభ్యం కోసం ఈ మరుగు దొడ్లను నిర్మించడం జరిగింది. ఎంఆర్ఓ కార్యాలయం, వారాంతపు సంత సమీపంలోని రహదారిపై,

జంబి హనుమాన్ మైదానం వద్ద, మామిడి పల్లి గ్రామపంచాయితి సమీపంలో, విజయ పబ్లిక్ స్కూల్ వెనుక భాగంలో ఉన్న భవనంలో, గ్రూప్ థియేటర్ తథితర ప్రాంతాలలో నిర్మించిన మరుగు దొడ్లకు తాళాలు వేసి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ ఇంచార్జి సయ్యద్ అవేజ్ అన్నాడు.

షాపింగ్, ఇతర పనుల నిమిత్తం ఆర్మూర్ కు వచ్చే చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఆర్మూర్‌కు వచ్చే ప్రజలు, ముఖ్యంగా మహిళలు, అత్యవసర సమయాల్లో మరుగు దొడ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ప్రభుత్వం నిర్మించిన ఈ ప్రజా మరుగుదొడ్లను నిర్వహణ బాధ్యత కోసం కాంట్రాక్టర్లకు అప్ప గించినప్పటికి వాటిని సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ మరు గుదొడ్లను సరిగ్గా శుభ్రం చేయడం లేదు. అంతేకాకుండా అక్కడ నీటి సరఫరా కూడా లేదు. కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుండి ప్రతి నెలా నిర్వాహణ నిధులు పొందుతున్నప్పటికీ, వారు ఈ ప్రజా మరుగుదొడ్ల బాగోగులను పట్టించుకునే లేడాయే. అత్యవసర సమయాల్లో స్త్రీ, పురుషులు ఎవరూ ఈ మరుగు దొడ్లను వినియోగించుకోలేని దుస్థితిలోకి మరుగుదొడ్లను తీసుకువచ్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తు న్నాయని ఆయన తెలిపాడు.

ఇప్పటికైనా అధికారులు ఈ ప్రజా మరుగుదొడ్ల సమస్యపై దృష్టి సారించి, వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేయించి, ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశాడు. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలపై దృష్టి సారించి, వాటిని తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆయన వివరించాడు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

Thammali Pandu

Published

on

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి 

జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.

ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

ప్రయాణికులు www.tgsrtcbus.in⁠ వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.

Continue Reading

నిజామాబాద్

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

Thammali Pandu

Published

on

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు 

జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.

ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

Continue Reading

నిజామాబాద్

ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు

janamvelugunews

Published

on

అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు

భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రతిమల నిమజ్జనం

భక్తుల నృత్యాలతో మార్మోగిన గ్రామం 

 

జనం వెలుగు చౌటకూర్:- దుర్గమ్మ నామస్మరణతో పల్లెలు మార్మోగాయి. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు, బుధవారం హారతులు,కాషాయ జెండాల రెపరెపల మధ్య అమ్మవారి శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో భక్తుల పూజలందుకున్న జగన్మాతకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల్ సరఫ్ పల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి.

  ఈ నెల 11న ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాతను భక్తులు భక్తిపారవశ్యంతో కొలిచారు. కుంకుమార్చనలు, ప్రత్యేక హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు.

  మంగళ వారం వరకు వైభవంగా కొనసాగిన ఉత్సవాల అనంతరం అమ్మవారికి ఉత్తర పూజలు నిర్వహించి నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరలను పలు మండపాల నిర్వాహకులు వేలం వేశారు. బుధవారం నిర్వహించిన శోభాయాత్రల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లారు.

   దారిపొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భవానీ భక్తులు, యువకులు డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలతో సాగిన ఊరేగింపులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పలు దేవీ మండళ్ల నిర్వాహకులు శోభాయాత్రల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఏటేటా గ్రామాల్లో దేవీ మండపాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు వినూత్న అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నవరాత్రి వేడుకలు మరింత వైభవంగా సాగుతున్నాయి. గ్రామస్తులు, యువజన సంఘాలు, ఉత్సవ కమిటీల సమన్వయంతో నిర్వహించిన శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. చివరగా అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేయడంతో గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

   ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంచద్రారెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీ నరసింహ, మీనాక్షి గోవర్ధన్, నాగులు గౌడ్, సాయి కృష్ణ, మల్లేశం, కమల, నాగమ్మ, హేమలత, తదితరులు పాల్గొన్నారు

Continue Reading