Connect with us

నిజామాబాద్

టౌన్-5 పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

janamvelugunews

Published

on

టౌన్-5 పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలి

ఫిర్యాదు వచ్చిన వెంటనే త్వరితగతిన స్పందించాలి

నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి

జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-5 పోలీస్ స్టేషన్‌ను మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు పోలీస్ అధికారులు, సిబ్బంది గౌరవ వందనం అందించగా, ఆయన వందనాన్ని స్వీకరించి అనంతరం స్టేషన్‌లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

మొదటగా స్టేషన్‌లో సిబ్బందికి అందుబాటులో ఉన్న కిట్ ఆర్టికల్స్, భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు.

తదుపరి స్టేషన్‌లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్ కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీషీటర్లు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అలాగే స్టేషన్‌లో అమలవుతున్న “5ఎస్ విధానం” అమలు తీరును సమీక్షించి, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని స్పందించాలని తెలిపారు.

స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల డిజిటల్ నిర్వహణ, సిబ్బంది హాజరు, డ్యూటీ విధానాలు తదితర అంశాలపై కూడా పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా క్రమశిక్షణతో, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.

ప్రధానంగా అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న కమిషనర్, వాటి చేదనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలని సబ్ ఇన్స్పెక్టర్‌కు సూచనలు చేశారు.

ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు మరియు సోషల్ మీడియా వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

అలాగే విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేయాలని, తమ పరిధిలోని సమాచారాన్ని పైస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలు సూచనలు చేశారు.

సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో యువత ఆన్‌లైన్ బెట్టింగ్స్, గేమింగ్ యాప్‌లకు బానిసలై సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల పాలై మానసిక ఒత్తిడికి గురవుతున్న యువతను దృష్టిలో ఉంచుకొని గేమింగ్ యాప్‌ల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.

అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది 24X7 తమ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఈ తనిఖీలో నిజామాబాద్ ఏసీపీ శ్రీ బి. ప్రకాష్ యాదవ్, నార్త్ రూరల్ సీఐ శ్రీ బి. శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ శ్రీ బి. అంజయ్య, టౌన్-5 ఎస్‌ఐ శ్రీ ఎం. గంగాధర్, ఎస్‌ఐ-2 శ్రీ ఆర్. లక్ష్మయ్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

Thammali Pandu

Published

on

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి 

జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.

ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

ప్రయాణికులు www.tgsrtcbus.in⁠ వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.

Continue Reading

నిజామాబాద్

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

Thammali Pandu

Published

on

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు 

జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.

ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

Continue Reading

నిజామాబాద్

ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు

janamvelugunews

Published

on

అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు

భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రతిమల నిమజ్జనం

భక్తుల నృత్యాలతో మార్మోగిన గ్రామం 

 

జనం వెలుగు చౌటకూర్:- దుర్గమ్మ నామస్మరణతో పల్లెలు మార్మోగాయి. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు, బుధవారం హారతులు,కాషాయ జెండాల రెపరెపల మధ్య అమ్మవారి శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో భక్తుల పూజలందుకున్న జగన్మాతకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల్ సరఫ్ పల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి.

  ఈ నెల 11న ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాతను భక్తులు భక్తిపారవశ్యంతో కొలిచారు. కుంకుమార్చనలు, ప్రత్యేక హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు.

  మంగళ వారం వరకు వైభవంగా కొనసాగిన ఉత్సవాల అనంతరం అమ్మవారికి ఉత్తర పూజలు నిర్వహించి నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరలను పలు మండపాల నిర్వాహకులు వేలం వేశారు. బుధవారం నిర్వహించిన శోభాయాత్రల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లారు.

   దారిపొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భవానీ భక్తులు, యువకులు డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలతో సాగిన ఊరేగింపులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పలు దేవీ మండళ్ల నిర్వాహకులు శోభాయాత్రల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఏటేటా గ్రామాల్లో దేవీ మండపాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు వినూత్న అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నవరాత్రి వేడుకలు మరింత వైభవంగా సాగుతున్నాయి. గ్రామస్తులు, యువజన సంఘాలు, ఉత్సవ కమిటీల సమన్వయంతో నిర్వహించిన శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. చివరగా అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేయడంతో గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

   ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంచద్రారెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీ నరసింహ, మీనాక్షి గోవర్ధన్, నాగులు గౌడ్, సాయి కృష్ణ, మల్లేశం, కమల, నాగమ్మ, హేమలత, తదితరులు పాల్గొన్నారు

Continue Reading