నిజామాబాద్
అమరవీరుల ఆశయాన్ని కొనసాగిద్దాం. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు ప్రభాకర్ పిలుపు


Views: 0
జనం వెలుగు, కమ్మర్పల్లి:- సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా కమ్మర్పల్లి సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ కామ్రేడ్ ఎస్ సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ప్రజాపంతా నాయకులు వి. ప్రభాకర్, B. దేవారంలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా, దళారీ పెట్టుబడి దారి విధానానికివ్యతిరేకంగా, భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా పేద ప్రజలుఅనేక పోరాటాలు చేసే క్రమంలో ఆ పోరాటానికి నాయకత్వం వహించిన అనేకమంది కమ్యూనిస్టు విప్లవ కారుల్ని రాజ్యం బూటక పు ఎన్కౌంటర్లో కాల్చివేసింది. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను, 4000 గ్రామాల విముక్తి చేసి పంచి ఇచ్చిన పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగాలు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది సభ. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పాలకులంతా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడమే తప్ప పేదలకు వరగబెట్టిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు బిజెపి డీజిల్ పెట్రోల్ ధర తగ్గిస్తామని ,వంటగ్యాస్ ధర తగ్గిస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారులకు వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అమలు చేయించుకోవడానికి పోరాటమే మార్గమని అమరవీరులు చూపిన బాటనే అని నొక్కి చెప్పారు. మరోవైపు తెలంగాణ సెంటిమెంటుతో అధికారులకు వచ్చిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానీకానికి చేసిందేమీ లేదని నాలుగైదు దశాబ్దల కాలంగా పోడు రైతుల సమస్య పరిష్కారం చేయాలని పోరాటం జరుగుతుంటే కుర్చీ వేసుకుని సమస్యను పరిష్కరిస్తానని ప్రగల్ బాలుపలికి సాగు చేసుకున్న గిరిజన గిరిజన ఇతరులను భూమి నుండి పోలీసు బలగాలతో తనివేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికొక ఉద్యోగం ఎగనాం పెట్టాడని, మద్యంద్వారా 32 వేల కోట్ల ఆదాయం సమకూర్చడమే ప్రధాన ధ్యేయంగా మారిందని ఎద్దేవా చేశారు. మరోవైపు పౌర హక్కుల నేతగా మార్తానని కోతలు కోసిన కేసిఆర్ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాచి వేయడమే కాకుండా అర్బన్ నక్సలైట్లను ముద్ర వేసి హక్కులను బొంద పెడుతున్న సంగతి మరవరాదని అన్నారు. ఈ ప్రాంతంలో కొత్త బిచ్చగాళ్లు తయారైనట్లుగా కొన్ని ఎర్రజెండా పార్టీలు పేరు చెప్పుకొని బీడీ కార్మికులను పైరవీల పేరుతో మోసం చేస్తున్న వారి పట్ల జాగ్రత్త వహించాలని కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు . ఈ ప్రాంతంలో పనిచేసిన కామ్రేడ్ కుమార్ నారాయణ. విద్యార్థి ఉద్యమాల ప్రతముడు j.c.s.ప్రసాద్. విప్లవ పార్టీ. కార్యదర్శి కామ్రేడ్ రాంనర్సయ్య. మాజీ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యలను అత్యవసర పరిస్థితి కాలంలో బూటక ఎన్కౌంటర్ లో కాల్చివేశారు. అంతేకాక ఇల్లందు ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఐదుగురు కామ్రేడ్స్ బూటక ఎన్కౌంటర్లో కాల్చివేసిన రాజ్యం స్వభావం ఇంకా మారలేదని అన్నారు. మన హక్కుల సాధన కొరకు, రక్షణ కొరకు పోరాటమే మార్గమని నొక్కి చెప్పారు కష్టజీవుల రాజ్యం నిర్మాణానికై ఉద్యమమే, అమరవీరులు చేసిన త్యాగం మార్గమే మన మార్గమని, నిజమైన నివాళి అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేపడతామని వారు పిలుపునిచ్చారు. ఈ సభలో, జి కిషన్, జి సత్యనారాయణ గౌడ్, వి బాలయ్య, అశోక్, కే రాజేశ్వర్, వి ఆనంద్, గ్రామపంచాయతీ లక్ష్మణ్, లక్ష్మక్క, జమున, గంగక్క, భాజక్క లతోపాటు వందలాదిమందిపాల్గొన్నారు.
నిజామాబాద్
అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు…


Views: 127
అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు..


జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో గురువారం హనుమాన్ జన్మోత్సవ వేడుకలు, భారీ ఊరేగింపు విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కంటేశ్వర్ నుండి ప్రారంభమైన ఊరేగింపు భక్త జన సందోహల మధ్య, భక్తి గీతాలతో, నృత్యాలతో భక్తి పారవాశ్యం తో ఆర్ ఆర్ చౌరస్తా వరకు చేరుకుంది. నగరం లోని అన్ని హనుమాన్ ఆలయాలలో పెద్ద ఎత్తున పూజలు,అన్న ప్రసాదాలు నిర్వహించారు. నగరమంతా రామ నామ,, హనుమాన్ నామ స్మరణ తో మార్మోగింది. వినాయక్ నగర్ లోని సంకట మోచన హనుమాన్ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఆర్చేస్ట్రా తో భక్తి పాటలు అందరిని మంత్ర ముగ్దులను చేసాయి.ఆలయ పురోహితుల మంత్రోచ్చారనలు, హారతి పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.శ్రీ నటరాజ నృత్య తరంగిని నాట్యాలయం ఆధ్వర్యంలో బంటు సుకన్య నేత్రుత్వంలో సహస్ర, నిహాన్వి, కె. ఆధ్య, టి. ఆద్య, పి. ఆధ్య, రూణి, ప్రేర్, తనిష్క, వేధిత చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఆలయ ఆవరణలో సంసృతి సాంప్రదాయాలు రాబోయే తరానికి తెలియ చేయాలనే ఉద్దేశ్యం తో ప్రతి రోజు సాయంత్రం నృత్య తరగతులు తీసుకుంటున్నట్లు తెలిపారు.హనుమాన్ భారీ ర్యాలీ సందర్బంగా భక్తులు, వచ్చిన భక్తుల కోసం పులిహోర, బాదాం పాలు, జీరా అన్నం, రస్నా, శ్రీరామ రసం, లాంటివి అందించి భక్తుల మన్ననలు పొందారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేసారు.
నిజామాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు


Views: 24
రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు
జనంవెలుగు, నిజామాబాద్:- రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుండి మీ సేవ సేవలపై కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయని, కొత్త రేట్లు పాత ఛార్జిలతో పోల్చవద్దని, వినియోగదారులు ఈ విషయం లో మీ సేవ నిర్వాహకులకు సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. గతం లో కంటే ప్రస్తుతం మీ సేవల రుసుముల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.వినియోగదారులుపాత ఛార్జిలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్షుడు సితారే క్షేవిన్ (రాజ్) విజ్ఞప్తి చేసారు. మేము నిన్ననే దరఖాస్తు చేసుకున్నాం, ఇంత చార్జీలు లేకుండే మీరేంటి బాగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు లాంటి అపోహాలు, వాదనలకు పోకుండా తాజా చార్జీలు చెల్లించి మీ సేవ సేవలు వినియోగించు కోవాలని సూచించారు.ఇన్నేళ్లుగా యూసర్ ఛార్జిల్లో పెంపు లేకుండా ఉన్న మీ సేవల ఛార్జిలను పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవా కేంద్రాలతరపున ధన్యవాదాలు తెలియ చేసారు. వినియోగ దారులు ఎటువంటి ఆటంకం లేకుండా మీ సేవ సేవలను వినియోగించు కోవాలన్నారు.
నిజామాబాద్
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం


Views: 110
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం నిజామాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం


జనంవెలుగు, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్ స్టేషన్ ఆవరణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.10 వేల కోట్ల ఆదా జరిగిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఉమారాణి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల కుటుంబాల ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 8.58 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 290 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణించగా, మొత్తం రూ.10 వేల కోట్ల ఆదా జరిగిందని, నిజామాబాద్ జిల్లాలో మాత్రమే రూ.365.50 కోట్ల ఆదా నమోదైందని వివరించారు.
ఈ పథకాన్ని మహిళలు విస్తృతంగా వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలపడాలని ఆమె ఆకాంక్షించారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోలలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి డిపోలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, ఆర్మూర్ డిపోలో మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, బాన్స్‌వాడ డిపోలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ డిపోలో మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయగౌడ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, జిల్లా కార్యదర్శి మమత, సంధ్యారాణి, సరిత, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు ఆనంద్, ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ జానాబాయి, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజవ్వ తదితరులు పాల్గొన్నారు.
మహిళా కండక్టర్లు సరళ, నాగకుమారి, జ్యోతి మరియు మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








