Connect with us

నిజామాబాద్

సర్పంచే గొడవలు సృష్టిస్తే ఎలా… సర్పంచ్ పై అధికారులకు ఫిర్యాదు

janamvelugunews

Published

on

సర్పంచే గొడవలు సృష్టిస్తే ఎలా… సర్పంచ్ పై అధికారులకు ఫిర్యాదు

జనంవెలుగు, నందిపేట్ జూన్ 27: నందిపేట మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీలో ఒక భాగమైన మంతెన పంత సభ్యులంతా స్థానిక సర్పంచ్ సిలిండర్ లింగంపై ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎస్ఐలకు ఫిర్యాదు చేశారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ముంగట గల గ్రామ చావిడి (కచీరు) స్థలంలో గ్రామపంచాయతీ తీర్మానంతో మహిళా సంఘ భవన నిర్మాణం కొరకు గుంతలు చేయడం జరిగింది.

  అయితే గ్రామ అభివృద్ధి కమిటీలో ఒక భాగమైన మంతెన పంత సభ్యులంతా ఆ మహిళా భవన నిర్మాణం చేపట్టదంటూ గుంతలు పూడ్చడంతో ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లేసరికె గ్రామపంచాయతీ కమిటీకి మంతెన పంతకు గొడవ ప్రారంభమైంది. దీంతో శనివారం మంతెన పంత సభ్యులంతా కలిసి గ్రామ సెక్రెటరీ, సర్పంచ్ పై ఎంపీడీవో, ఎమ్మార్వో ఎస్సైలకు ఫిర్యాదు చేశారు.

   ఈ సందర్భంగా మంతెన పంత అధ్యక్షులు మంతెన శ్రీను మాట్లాడుతూ గత వంద సంవత్సరాలుగా గ్రామపంచాయతీ దగ్గర గల గ్రామచావిడిని గ్రామ అభివృద్ధి కమిటీ ఎక్కువగా ఉపయోగించుకునేదని, ఇప్పుడంటే గ్రామం పెద్దగా అయింది కానీ, నందిపేట గ్రామం మొత్తం ఈ చావిడి చుట్టుపక్కల నే ఉండేదని, ఇంతకుముందు రెవెన్యూ ఆధీనంలో ఉన్న చావిడి గ్రామకంఠంలోకి వెళ్లిందని, 2023 సం.లో సిడిపి 10 లక్షల రూ. నిధులతో అప్పటి ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి తో మంజూరు చేయించుకోవడం జరిగిందని.

  మాకు కేటాయించిన భూమిలో మళ్లీ ఇప్పుడు మహిళా మండలం పేరుతో సర్పంచ్ నిర్మాణాలు చేపడుతూ కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడని, గ్రామ సర్పంచ్ అంటే గొడవలు మొదలయితే మాన్పాలే గాని ఇలా పంతల మధ్య గొడవలు సృష్టించడం, వారి పైన కేసులు నమోదు చేయించడం సరికాదని, తప్పకుండా ఇది కక్ష సాధింపేనని విమర్శించారు.

  మహిళా భవనం నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదని, మాకు ఉన్నదే కొద్ది స్థలమని, గ్రామంలో వీడిసి చేసే పనులు ఎన్నో ఉన్నాయని, అనాదిగా వస్తున్న ఆచారాలను, పండుగ పబ్బాలను చేసేది వీడిసే నని, గ్రామ నడిబొడ్డులో గల వ్యాన్లు అడ్డను కాపాడింది కూడా వీడిసేనని, అధికారులు గ్రామపంచాయతీ కమిటీ అందరూ అమ్ముడుపోయిన వీడీసీ ఒక్కటే పోరాడిందని గుర్తుంచుకోవాలని అన్నారు.

మాకు అందుబాటులో ఉన్న ఈ కాస్త స్థలాన్ని వేరే వాళ్ళకు కేటాయించడం నచ్చకనే ఈరోజు మూడు పంతలలో రెండు పంతలైన మంతెన పంత, ప్యాట్ల పంత సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా సర్పంచ్, పంచాయతీ కమిటీ సభ్యులు వి డి సి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తు పెట్టుకొని ఆ స్థలాన్ని వీడీసీకే చెందేటట్టు చూడాలని విజ్ఞప్తి చేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

Thammali Pandu

Published

on

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి 

జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.

ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

ప్రయాణికులు www.tgsrtcbus.in⁠ వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.

Continue Reading

నిజామాబాద్

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

Thammali Pandu

Published

on

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు 

జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.

ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

Continue Reading

నిజామాబాద్

ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు

janamvelugunews

Published

on

అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు

భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రతిమల నిమజ్జనం

భక్తుల నృత్యాలతో మార్మోగిన గ్రామం 

 

జనం వెలుగు చౌటకూర్:- దుర్గమ్మ నామస్మరణతో పల్లెలు మార్మోగాయి. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు, బుధవారం హారతులు,కాషాయ జెండాల రెపరెపల మధ్య అమ్మవారి శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో భక్తుల పూజలందుకున్న జగన్మాతకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల్ సరఫ్ పల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి.

  ఈ నెల 11న ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాతను భక్తులు భక్తిపారవశ్యంతో కొలిచారు. కుంకుమార్చనలు, ప్రత్యేక హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు.

  మంగళ వారం వరకు వైభవంగా కొనసాగిన ఉత్సవాల అనంతరం అమ్మవారికి ఉత్తర పూజలు నిర్వహించి నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరలను పలు మండపాల నిర్వాహకులు వేలం వేశారు. బుధవారం నిర్వహించిన శోభాయాత్రల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లారు.

   దారిపొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భవానీ భక్తులు, యువకులు డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలతో సాగిన ఊరేగింపులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పలు దేవీ మండళ్ల నిర్వాహకులు శోభాయాత్రల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఏటేటా గ్రామాల్లో దేవీ మండపాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు వినూత్న అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నవరాత్రి వేడుకలు మరింత వైభవంగా సాగుతున్నాయి. గ్రామస్తులు, యువజన సంఘాలు, ఉత్సవ కమిటీల సమన్వయంతో నిర్వహించిన శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. చివరగా అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేయడంతో గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

   ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంచద్రారెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీ నరసింహ, మీనాక్షి గోవర్ధన్, నాగులు గౌడ్, సాయి కృష్ణ, మల్లేశం, కమల, నాగమ్మ, హేమలత, తదితరులు పాల్గొన్నారు

Continue Reading