నిజామాబాద్
ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సోలమన్


ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సోలమన్
నిజామాబాద్ ఆర్ టి సి రీజియన్ పరిధిలోని నిజామాబాద్ బస్ స్టేషన్, నిజామాబాద్-2 డిపోను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ సందర్శించి తనిఖీ చేశారు ఈ సందర్భంగా నిజామాబాద్-2 డిపో పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ మరియు భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు. రీజియన్లో మొత్తం 89 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, ప్రస్తుతం 35 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఆపరేషన్లో ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో సాంకేతిక సమస్యలు, ఆకస్మికంగా మంటలు చెలరేగే ఘటనల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి బస్సును పూర్తిస్థాయిలో సాంకేతికంగా తనిఖీ చేసిన అనంతరమే ప్రయాణికుల సేవలకు వినియోగించాలని, బ్యాటరీ, వైరింగ్, ఛార్జింగ్ వ్యవస్థ, ఉష్ణోగ్రత నియంత్రణ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రతే సంస్థకు అత్యంత ముఖ్యమని, డ్రైవర్లు మరియు సాంకేతిక సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం నిజామాబాద్ బస్ స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, బస్సుల రాకపోకలు, సమాచార బోర్డులు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు
ఈ కార్యక్రముంలో నిజామాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ శ్రీమతి పి. జ్యోతి నిజామాబాద్-1 డిపో మేనేజర్ మరియు నిజామాబాద్-2 డిపో మేనేజర్, డిపో అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్
DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి


DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే
జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజామాబాద్
కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ


కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ
డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ
దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్ చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.








