Connect with us

నిజామాబాద్

కాంట్రాక్టు క్యారేజ్ బస్సులకు జిల్లా పన్ను యథాతథంగా అమలు చేయాలి

janamvelugunews

Published

on

కాంట్రాక్టు క్యారేజ్ బస్సులకు జిల్లా పన్ను యథాతథంగా అమలు చేయాలి

– నిజామాబాద్ జిల్లా టూరిస్ట్ బస్సు ఆపరేటర్స్ అసోసియేషన్ డిమాండ్

జనం వెలుగు, నిజామాబాద్:- కాంట్రాక్టు క్యారేజ్ బస్సులకు ప్రస్తుతం అమలులో ఉన్న సింగిల్ డిస్ట్రిక్ట్ టాక్స్‌ను యథాతథంగా కొనసాగించాలని నిజామాబాద్ జిల్లా టూరిస్ట్ బస్సు ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుప్పాల బాజన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నిజామాబాద్లో నిర్వహించిన జిల్లా టూరిస్ట్ బస్సు ఆపరేటర్స్ సమావేశంలో ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా పుప్పాల బాజన్న మాట్లాడుతూ, ప్రతి సీటుకు ప్రస్తుతం అమలులో ఉన్న రూ.899 సింగిల్ డిస్ట్రిక్ట్ టాక్స్‌ను యథావిధిగా కొనసాగించాలని, క్యూఆర్ కోడ్ రేడియం సంబంధిత ఎంఎస్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కాంట్రాక్టు క్యారేజ్ బస్సుల రాకపోకలకు పరస్పర ఒప్పందం కుదుర్చాలని కోరారు.

గ్రీన్ టాక్స్‌ను తగ్గించడంతో పాటు రవాణా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బస్సుల ఫిట్‌నెస్ కోసం తాము త్రీ ఎం (3M) రేడియం స్టిక్కర్లను మాత్రమే వినియోగిస్తున్నామని, వీటి ద్వారా స్పష్టమైన విజిబిలిటీతో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అనంతరం తమ సమస్యలను వివరిస్తూ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పుప్పాల బాజన్న, కార్యదర్శి ఎర్రం పూర్ణచందర్, కోశాధికారి సాయిబాబా, వైస్ ప్రెసిడెంట్ రవీందర్, ఎజాస్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ అంజాద్ ఖాన్ మహమూద్‌తో పాటు పలువురు టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

Thammali Pandu

Published

on

DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే 

జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.

స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.

Continue Reading

నిజామాబాద్

కాంగ్రెస్ శ్రేణులతో  రూరల్ ఎమ్మెల్యే  ఆత్మీయ భేటీ

Thammali Pandu

Published

on

కాంగ్రెస్ శ్రేణులతో  రూరల్ ఎమ్మెల్యే  ఆత్మీయ భేటీ

డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ 

 దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం 

 పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు 

జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్  చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Continue Reading

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading