నిజామాబాద్
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి


ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
అదనపు కలెక్టర్ భుజంగరావు
నిజామాబాద్, జూలై 24 : ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పిస్తున్నామని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు అన్నారు. పంటల మార్పిడి విధానం ద్వారా సమకూరే ప్రయోజనాల గురించి వివరిస్తూ, రైతులు ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్య, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ, పంటల సాగు, సీజనల్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు త్వరగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్య అభ్యసించే విద్యార్థులందరికీ 2 జతల ఏకరూప దుస్తులు ఆగస్టు 25వ తేదీలోగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్ నినో వర్షబావ పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు వైపు అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలని, కందులు, పెసర్లు, కూరగాయల పంటల సాగు శ్రేయస్కరం అని రైతులకు సూచించాలని తెలిపారు. సిజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వీ.సీ అనంతరం అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. ప్రతి రైతుకు అవగాహన కల్పించేలా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, భూగర్భ జల శాఖ అధికారులు కృషి చేయాలని, ప్రజాప్రతినిధుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందని, అర్హులైన ప్రతి రైతు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు నిర్ణీత గడువు లోపు అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారుల పరస్పర సమన్వయంతో పని చేస్తూ సకాలంలో విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు అందేలా కృషి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్
DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి


DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే
జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజామాబాద్
కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ


కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ
డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ
దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్ చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.








