Connect with us

నిజామాబాద్

మతం కంటే మానవత్వమే గొప్పది

janamvelugunews

Published

on

మతం కంటే మానవత్వమే గొప్పది

మత సామరస్యం, సోదర భావంతోనే శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యం : పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

జనం వెలుగు, నిజామాబాద్:- మంచితనం, మానవత్వం లేని ఏ మతమైనా సంస్కరించబడాల్సిందేనని, సమాజంలో ఐక్యత, భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు.

ఆదివారం నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి సమీపంలోని నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో “మత సామరస్యం – సోదర భావం – ప్రస్తుత సమాజం” అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వమత సమానత్వమే నిజమైన మానవత్వానికి ప్రతీక అని అన్నారు. కుల, మత, భాష, ప్రాంత భేదాలు లేకుండా పరస్పర ప్రేమ, గౌరవం, శాంతి, సయోధ్యతో కలిసి జీవించడమే భారతీయ సంస్కృతి గొప్పతనమని పేర్కొన్నారు.

వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కులమతాలకు అతీతంగా ప్రజలు బాధితులకు ఆహారం, దుస్తులు, నిత్యావసర వస్తువులు అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారని కొనియాడారు. ఆపదలో ఉన్న పేదలకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం, వృద్ధులు, చిన్నారులు, నిరుపేదల పట్ల ప్రేమ, ఆప్యాయత చూపడం నిజమైన సోదరభావానికి నిదర్శనమని అన్నారు.

సమాజంలో మంచి, చెడు అనే రెండే మతాలు ఉన్నాయని, మానవత్వమే అత్యున్నత మతమని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధి, శాంతి, సామాజిక భద్రత కోసం ఐక్యత ఎంతో అవసరమని, విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.

ప్రతి వ్యక్తి మానవీయ విలువలను ఆచరిస్తూ సమాజ హితం కోసం ఒక అడుగు ముందుకు వేస్తే స్వేచ్ఛ, శాంతి, సామరస్యంతో కూడిన నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. మంచితనం, మానవత్వం లేని ఏ మతమైనా సంస్కరించబడాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మతాల ప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని మత సామరస్యాన్ని పెంపొందించే సందేశాలను పంచుకున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading