నిజామాబాద్
ప్రెస్ క్లబ్లో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


ప్రెస్ క్లబ్లో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనం వెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ ఆవరణలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ జాతీయ జండా ఆవిష్కరించారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జర్నలిస్టు క్రీడా పోటీలను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్స్ గా మాంతం మధు సహకారం అందించారు.
క్రికెట్, షటిల్, క్యారం పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టులకు ఆ సంస్థ నిర్వాహకులు మంతం మధు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడులకు లోనవుతున్న జర్నలిస్టులు ఆటల పోటీలతో ఒత్తిడులు దూరం అవుతాయని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని మంతం మధు అన్నారు.
జర్నలిస్టు కార్యక్రమాలకు ఎల్లప్పుడు సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈరోజు మనం కేవలం జెండా ఎగరేయడం లేదు. 200 ఏళ్ల బానిసత్వం నుండి మనకు విముక్తి కలిగించిన ఎందరో త్యాగధనులను స్మరించుకుంటున్నాం.
గాంధీజీ, నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి, కొమురం భీం లాంటి వారి త్యాగం వల్లనే ఈ స్వేచ్ఛా గాలిని పీలుస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన రోజున మన రాజ్యాంగం మనకు మూడు స్థంబాలను ఇచ్చింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు. కానీ ఆ మూడింటినీ నిలబెట్టేది నాలుగో స్తంభం మన పత్రికా రంగం అని అన్నారు. నిజామాబాద్ గడ్డకు ఉద్యమాల చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు ఈ గడ్డ మీద నుండి వార్తలు రాసిన ప్రతి కలం ఒక చరిత్రను లిఖించింది. ఇవాళ పాత్రికేయం చాలా సవాళ్లలో ఉంది. ఫేక్ న్యూస్ ఒకవైపు, సోషల్ మీడియా ఒత్తిడి మరోవైపు. కానీ మనం…. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే వేగం కంటే వాస్తవం ముఖ్యం. టి ఆర్ పి కంటే నిజాయితీ ముఖ్యం అని అన్నారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి ఒక్కటే. మన కలాలు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలి. అధికారానికి ప్రశ్నగా,…. బాధితుడికి భరోసాగా ఉండాలి చెప్పారు పంచారెడ్డి శ్రీకాంత్. మనం విభేదించవచ్చు, వాదించవచ్చు, కానీ దేశం విషయంలో, నిజం విషయంలో ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు.ప్రధాన కార్యదర్శి సుభాష్ వాాగ్మారే మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అనునిత్యం వార్తలు సేకరించే విధులు నిర్వహిస్తూ ఉంటారు అందుకు కొద్దిపాటి ఉపశమనంగా జర్నలిస్టులకు క్రీడా పోటీలను నిర్వహించుకోవడం ఆనవాయితిగా వస్తుందన్నారు.
జిల్లా ప్రజలకు, అధికారులకు, జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, బిల్డర్ మోహన్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, నగర జర్నలిస్టు, సబ్ ఎడిటర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్ లు, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








