నిజామాబాద్
నిజామాబాద్ లో గవర్నర్ పర్యటన


నిజామాబాద్ లో గవర్నర్ పర్యటన
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమీషనర్,
జనం వెలుగు, నిజామాబాద్ : రాష్ట్ర గవర్నర్ సి.శివ్ ప్రతాప్ శుక్లా మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 10.20 గంటల సమయంలో నిజామాబాద్ కు చేరుకోనున్నారు.
రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గవర్నర్ కు స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్యన కాన్వాయ్ ద్వారా ఉదయం 11.00 గంటలకు భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ కు చేరుకుని, నషా ముక్త్ భారత్ అభియాన్ (యాంటీ డ్రగ్స్ అవగాహన) కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో సునహరీ మిట్టీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని పసుపు రైతులతో భేటీ అవుతారు. కార్యక్రమం ముగిసిన అనంతరం డిచ్పల్లి మండలం బర్దిపూర్-ధర్మారం శివారులోని పీహెచ్ఆర్ కన్వెన్షన్ లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ పాల్గోనున్నారు.
గవర్నర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
గవర్నర్ పర్యటించనున్న ప్రతీ చోట పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీ.పీలు సమావేశమై గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రొటోకాల్ ను పాటిస్తూ గవర్నర్ పర్యటనకు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మెడికల్ టీం, 108, 104, ప్రత్యేక డాక్టర్ల బృందంను అందుబాటులో ఉంచాలని, వేదిక, సీటింగ్ ను సరి చూసుకోవాలని, తాగునీరు, శానిటేషన్ పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు బాధ్యతలు పురమాయించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, గవర్నర్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
అనుమతి ఉన్న వారిని మాత్రమే గవర్నర్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీ.ఆర్.ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








