నిజామాబాద్
అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం


అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం
– గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనం వెలుగు న్యూస్ నిజామాబాద్:- ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్న అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF) సేవలు ప్రశంసనీయమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు.
నిజామాబాద్‌లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పసిపిల్లల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
నిరుపేద చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఫౌండేషన్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు.
లబ్ధిదారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేయాలని ఫౌండేషన్‌కు సూచించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, ప్రజలు సమష్టిగా పనిచేస్తే అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరుతాయని అన్నారు.
ఈ సందర్భంగా అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ధర్మపురి అరవింద్‌ను గవర్నర్ అభినందించారు.
ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ కుమార్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను వివరించారు. పసిపిల్లల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి హాజరైనందుకు గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్,ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పి. రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








