Connect with us

నిజామాబాద్

వినాయక ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

Thammali Pandu

Published

on

వినాయక ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలి.

విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు అప్రమత్తంగా ఉండాలి: రాష్ట్ర డీజీపీ.

జనం వెలుగు, నిజామాబాద్   వినాయక చవితి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుతంగా , ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ సూచించారు.

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ , శాంతిభద్రతలు , ట్రాఫిక్ నియంత్రణ , బందోబస్తు , మండపాల భద్రత , నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ అన్నీ జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వినాయక చవితి ప్రారంభం నుంచి విగ్రహ నిమజ్జనం పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు , భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా , శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని డీజీపీ తెలిపారు. ప్రతి మండపం వద్ద భద్రతా పరిస్థితులను ముందుగానే పరిశీలించి, అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

మండపాల వివరాలు పోలీస్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి

వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు తమ మండపాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీస్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీజీపీ సూచించారు.
మండపం ఏర్పాటు చేసే ప్రదేశం , నిర్వాహకుల పేర్లు , వారి సంప్రదింపు నంబర్లు , విగ్రహానికి సంబంధించిన వివరాలు తదితర పూర్తి సమాచారాన్ని పోలీస్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. దీనివల్ల ప్రతి మండపానికి సంబంధించిన సమాచారం పోలీస్ శాఖ వద్ద అందుబాటులో ఉండి , అవసరమైన సమయంలో సమన్వయం చేసుకోవడానికి , భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
http://policeportal.tspolice.gov.in

మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని , అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయకుండా సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు.

మండపాల వద్ద భద్రతకు ప్రాధాన్యత

వినాయక మండపాల వద్ద విద్యుత్ వైర్లు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు తదితర వాటి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
మండపాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని , మహిళలు , పిల్లలు , వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

వినాయక చవితి ఉత్సవాలు, ముఖ్యంగా నిమజ్జనం రోజున భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని డీజీపీ ఆదేశించారు.
ప్రధాన రహదారులు , రద్దీ ప్రాంతాలు , నిమజ్జన మార్గాలను ముందుగానే గుర్తించి అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని , వాహనదారులకు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు
వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో రద్దీ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకలు, బ్యారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

నీటిలోకి వెళ్లే సమయంలో ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని , సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా నిర్వహించాలని సూచించారు.

సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా

ఉత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు , వదంతులు , రెచ్చగొట్టే సందేశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ సూచించారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని తెలిపారు.

ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీస్ శాఖ జారీ చేసే నిబంధనలు, సూచనలను పాటించి ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు సహకరించాలని కోరింది.

వినాయక చవితి ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి , ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, సి.సి.ఆర్.బి ఏసిపి గురు నాయుడు , ఏ.ఆర్ ఏ సి పి శ్రీ రాములు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ శ్రీధర్ రెడ్డి , శ్రీ మల్లేశం , రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్ , సిసిఆర్బి ఇన్స్పెక్టర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading